2014 ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఐదేళ్లలో, బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు తీరు ఎలా ఉందో మేం పరిశీలించాం.
2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తన మేనిఫెస్టోలో దాదాపు 346 హామీలు ఇచ్చింది. వీటిలో కొన్ని పరిమాణాత్మకమైనవి(క్వాంటిటేటివ్), కొన్ని గుణాత్మకమైనవి (క్వాలిటేటివ్). ప్రభుత్వ పదవీకాలం పూర్తవుతుండటం, మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో, అత్యధిక హామీల స్థితిపై బీబీసీ పరిశీలన జరిపింది.
హామీలు ఏ దశలో ఉన్నాయనేదాన్ని ఇక్కడ మూడు కేటగిరీలుగా వర్గీకరించి చూపిస్తున్నాం.
పూర్తిస్థాయిలో అమలైన హామీలు
పురోగతి ఉన్న హామీలు. కొత్త పథకాలు ప్రవేశపెట్టడం, నిధుల కేటాయింపు పెంచడం, చట్టాలు సవరించడం లాంటి చర్యలు చేపట్టి ప్రభుత్వం కొంత పురోగతి సాధించిన హామీలు ఇవి.
పురోగతిలేని హామీలు: ఎలాంటి పురోగతీ లేని హామీలు ఇవి. ప్రభుత్వం ప్రతిపాదనలు చేయగా, సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించినవి కూడా ఇందులో ఉన్నాయి.
అధ్యయన విధానాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు
పేజీని స్క్రాల్ చేయండి.
మొత్తం 346 హామీల్లో
హామీల అమలు స్థితి ప్రకారం చూడండి.
కేటగిరీ ప్రకారం చూడండి.
మూలికా(హెర్బల్) ఉత్పత్తులకు సంబంధించి రొటేషన్ సాగు విధానాన్ని ప్రవేశపెట్టడం
కనీస మద్దతు ధరను పెంచడం, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయడం.
ప్రతి జిల్లాలో విత్తన తయారీ ప్రయోగశాలల ఏర్పాటు
గ్రామీణ రుణ సదుపాయాల విస్తరణ, పటిష్టత
వ్యవసాయోత్పత్తుల మరియు మార్కెటింగ్ కమిటీ (ఎ.పి.ఎం.సి) చట్టంలో మెరుగైన మార్పులు
60 ఏళ్ళు పైబడ్డ రైతులకు సంక్షేమ పథకాల అమలు
కిసాన్ టీవీ చానళ్ల ఏర్పాటును పరిశీలించాలి.
భూసార అంచనాల ఆధారంగా పంటలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టడం, భూసార పరీక్షలకు మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేయడం
పంట బీమా పథకాన్ని అమలు చేయడం
సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి భారత సేంద్రియ సాగు, ఎరువుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం
తక్కువ నీరు ఉపయోగించే నీటిపారుదల పద్ధతులను ప్రవేశపెట్టడం
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో ప్రజల పెట్టుబడులను పెంచడం.
వృథాను తగ్గించి, ఆదాయాన్ని పెంచడం, బీమా రక్షణకోసం కన్స్యూమర్ ఫ్రెండ్లీ రైతుల మార్కెట్ పద్ధతిని ప్రవేశపెట్టడం
మత్స్యపరిశ్రమను, రొయ్యలసాగును ప్రోత్సహించడం
యువతను స్వయం ఉపాధివైపు ప్రోత్సహించడం,
అత్యధిక శ్రమతో కూడిన తయారీ రంగాన్ని, పర్యాటకాన్ని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయడం
పెద్ద స్థాయి ప్రాజెక్టుల కోసం చిన్న, మధ్యతరహా పరిశ్రమల నుంచి కొనుగోళ్లు చేయడాన్ని తప్పనిసరి చేసేలా అవసరమైన విధానపరమైన మద్దతు అందించడం.
ఎంఎస్ఎమ్ఈలలో ఐటీని ఉపయోగించేలా చూడడం
సంబంధిత ఎస్ఎంఈ బ్యాంక్ నుంచి రుణ సహాయం దొరికేలా చూడడం
పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులను పెంచడం, తయారీ రంగంలో పోటీ తత్వాన్ని పెంచడానికి ఆర్ అండ్ డీలో ప్రోత్సాహకాలను పెంచడం
పరిశ్రమలకు రుణ వడ్డీ రేేట్ల హేతుబద్దీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవడం
తయారీ రంగం వృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, దేశంలో ఉద్యోగాలను సృష్టించడం
ఎలాంటి సందిగ్దానికి తావులేని పర్యావరణ చట్టాలను రూపొందించడం
ఎంఎస్ఎంఈ రంగాన్ని పునరుజ్జీవింపచేయడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం.
హబ్ స్పోక్ మోడల్ ద్వారా సింగిల్ విండో వ్యవస్థ వైపు మళ్లడం
మౌలిక సదుపాయాలు, సప్లై చైన్ మేనేజ్మెంట్ అభివృద్ధికి దోహదం చేయడం
విధానపరమైన అడ్డంకులను తొలగించడం, అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించడం
భారత్‌లో వ్యాపారం చేయడం (డూయింగ్ బిజినెస్) ను సులభతరం చేసే వాతావరణాన్ని సృష్టించడం, పారదర్శకతను పెంచడం
ఐపీఆర్, పేటెంట్లపై పెద్ద స్థాయిలో కృషి చేయడం
ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్‌ను ఏర్పాటు చేయడం
దేశంలోని అన్ని ప్రాంతాలను రోడ్డులు, జలమార్గాలతో అనుసంధానం చేయడం
లోపరహిత ఉత్పత్తులపై దృష్టిసారించడం
చిన్న వ్యాపారులు, రోడ్డు మీద వస్తువులు పెట్టుకుని అమ్ముకునే చిరు వ్యాపారుల ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం
ఎగుమతులపై దృష్టిసారించి కరెంటు ఖాతా లోటును తగ్గించడం
సంస్థాగత రుణాలు లభ్యతను సులభతరం చేయడం
వాడుకలో లేని చట్టాలు, బహుళ చట్టాలను సమీక్షించడం, సులభతరం చేయడం
వొకేషనల్ పథకాలు
జీఎస్టీను అమలు చేసేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఒకే బోర్డు కిందకు తీసుకురావడం
వివాద రహిత, ఉపయుక్త పన్నుల పద్ధతిని ప్రవేశపెట్టడం
50 పర్యాటక సర్య్కూట్ల ఏర్పాటుకు ప్రత్యేక ఏర్పాట్లు
పర్యాటకం కోసం ప్రత్యేక కోర్సు
సమగ్ర ప్రజా రవాణా
జలరవాణా మార్గాలను అభివృద్ధి చేయడం
జాతీయ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం
త్వరగా పాడయ్యే వ్యవసాయ ఉత్పత్తుల అవసరాల కోసం ప్రత్యేక ట్రైన్ వేగన్ల రూపొందించడంతోపాటు అగ్రిరైల్ నెట్వర్క్ ఏర్పాటు
పర్యాటక రైళ్లు, యాత్రల రైళ్లను ఏర్పాటు చేయడం
రైల్వేల ఆధునికీకరణకు చర్యలు తీసుకోవడం
స్వదేశీ రైల్వేలు, కోచ్ నిర్మాణాలు, సిగ్నల్ వ్యవస్థలపై ఆర్ అండ్ డీని ప్రారంభించడం
అత్యధిక వేగవంతమైన రైల్ నెట్వర్క్ (బుల్లెట్ ట్రైన్) - వజ్రచతుర్భుజి ప్రాజెక్టు ప్రారంభం
ఎంఎస్ఎంఈ రంగంలో విదేశీ ఎగుమతులకు అవకాశాలు కల్పించడం
వాణిజ్య అవసరాలకు కస్టమ్ అనుమతులు సులభతరం చేసేలా ఏర్పాట్లు చేయడం
మౌలిక సదుపాయాలు, నిబంధనలు, వార్నింగ్ వ్యవస్థల్లో కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం
పౌరుడు-ప్రభుత్వ మధ్యలో వివాదాలను తగ్గించేందుకు ఈ-గవర్నెన్సును అందుబాటులోకి తేవడం
మదుపుకు, అభివృద్ధికి పొదుపును ప్రధానంగా ప్రోత్సహించడం
లావాదేవీలను సులభతరం చేయడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి బ్యాంకింగ్ సంస్కరణలను చేపట్టడం
విదేశీ, స్వదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేయడానికి పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను సమీక్షించడం
విదేశీ ప్రభుత్వాలతో అనుసంధానమై నల్లధనంపై సమాచార మార్పిడి చేసుకోవడం
నల్లధనాన్ని అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం
నల్లధనాన్ని అరికట్టి, విదేశీ బ్యాంకుల నుంచి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టడం
విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు పనితీరును మరింత మెరుగుపరచడం
వివిధ రంగాల్లో ఉద్యోగాల సృష్టికి, సంపద సృష్టికి, మౌలిక సదుపాయాల కల్పనకు, అవసరమైన సాంకేతికను అందుబాటులోకి తేవడానికి అవసరమైన చోట ఎఫ్‌డీఐలను అనుమతించడం
మల్టీ బ్రాండ్ రీటైల్ సెక్టార్లో ఎఫ్‌డీఐలను అనుమతించకపోవడం
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నియంత్రణా నిబంధనలను రిజర్వు బ్యాంకు 2014 లో సవరించింది. వాటిని అమలు చేసి ఆ రంగాన్ని బలోపేతం చేశారు.
బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏలను తగ్గించడానికి చర్యలు తీసుకోవడం
పన్ను వివాదాల పరిష్కార విధానాన్ని నవీకరించడం
జీఎస్టీ అమలుకు భారీ ఐటీ నెట్వర్క్ ఏర్పాటు చేయడం
సందిగ్ధతను తొలగించి, పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించి, పన్ను విధానాలను సులభతరం చేసి, క్రమబద్ధీకరించడం
ఏకీకృత జాతీయ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయడం
రైతులకు ఉత్పత్తులు, ధరలు, ఎగుమతులు, సాక్స్, అందుబాటులో ఉన్న పంటలు, విత్తనాలు వంటి వాటిపై ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారం అందచేయడం
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలను విభజించడం
ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం
నల్ల మార్కెట్లను నిరోధించడానికి నిర్థిష్ట చర్యలు తీసుకోవడం, ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయడం
జాతీయ సౌరశక్తి మిషన్‌ను విస్తరించడం
పునరుత్పాదక శక్తి వనరులను ప్రోత్సహించడం
బొగ్గు ఉత్పత్తిని పెంచడం
జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులను ప్రారంభించడం
నేషనల్ ఎనర్జీ పాలసీని అమలు చేయడం
హిమాలయ పర్యావరణ పరిరక్షణ నిధిని ఏర్పాటుచేయడం
"నేషనల్ మిషన్ ఆన్ హిమాలయాస్" ఏర్పాటు
భారతీయ భాషలను ప్రోత్సహించడం, వాటి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం
వారసత్వ ప్రదేశాల నిర్వహణ, పునరుద్ధరణకు అవసరమైన వనరులు కల్పించడం
గోవుల అభివృద్ధికి అవసరమైన చట్టపరమైన ఏర్పాట్లు చేయడం, దేశీయ జాతుల వృద్ధికి జాతీయ పశు అభివృద్ధి బోర్డును ఏర్పాటుచేయడం
నదుల ప్రక్షాళనకు భారీ కార్యక్రమాన్ని ప్రారంభించడం
సేతు సముద్రం ఛానల్ ప్రాజెక్టుకు రామ సేతు సాంస్కృతిక, వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని పరిగణించడం
పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతి స్థానంలో పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీపీ) ని తీసుకురావడం
పంచాయతీలు సమర్థంగా పనిచేయడానికి మరిన్ని అభివృద్ధి నిధులను అందచేయడం
విధాన రూపకల్పనలో వివిధ మార్గాల ద్వారా ప్రజలను భాగస్వామ్యం చేయడం
ప్రభుత్వంలో పారదర్శకతను ప్రోత్సహించడం, భాగస్వాములందరినీ నిర్ణయాలు తీసుకోవడంలో భాగం చేయడం
అన్ని ప్రభుత్వ కార్యకాలాపాల్లో డిజిటైజేషన్‌ను తప్పనిసరి చేయడం
ఎన్నికల వ్యయ పరిమితులను సవరించడం
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం
రాజకీయ నాయకులపై కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు
లోక్ అదాలత్, మధ్యవర్తిత్వ కేంద్రాల ద్వారా వివాదాల పరిష్కారానికి ప్రాముఖ్యం ఇవ్వడం
వాడుకలో లేని, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడం
ఐపీఆర్ కేసులకు ప్రత్యేక కోర్టులు
నేషనల్ లిటిగేషన్ పాలసీని అమలు చేయడం
భారతీయ భాషల్లో ఐటీ కోసం ఈ-భాష - నేషనల్ మిషన్ ను ప్రోత్సహించడం
మొబైల్, ఈ-బ్యాంకింగ్‌ల వాడకాన్ని పెంచడం
జాతీయ న్యాయ కమీషన్ ఏర్పాటు
అస్సాంలో వరదల నివారణ, నదీ జలాల నిర్వహణ
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె
పీఓకే నుంచి వచ్చే శరణార్ధుల సమస్యలు
అన్ని రకాల కార్మికులకు పెన్షన్లు, ఆరోగ్య బీమా
పోలీసు బలగాల సామర్థ్యం పెంపుకు శిక్షణ ఏర్పాట్లు
పోలీస్ బలగాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునికీకరించడం
సమాచార మార్పిడికి, నేరాల నియంత్రణకు దేశంలోని పోలీస్ స్టేషన్లన్నింటినీ అనుసంధానించడం
జైళ్లను ఆధునికీకరించడం
పోలీసులకు సైబర్ నేరాల సంబంధిత అంశాలపై శిక్షణ
రాష్ట్రాల్లో ప్రాంతీయ కౌన్సిళ్ల ఏర్పాటు
సమగ్ర పట్టణాభివృద్ధి ప్రణాళిక
మోడల్ పట్టణాల్లో వ్యర్థాల సమగ్ర నిర్వహణ
ప్రధాన్ మంత్రి గ్రామ్ సించాయి యోజన ప్రారంభించడం
మురుగునీటి శుద్ధి
లవణాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు
నదుల అనుసంధానం
భూగర్భ జలాల నాణ్యత పరిశీలన
మారుమూల ప్రాంతాలకు నీటి సౌకర్యం
గృహాలకు పైపుల ద్వారా నీటి సరఫరా
సాగరమాల ప్రాజెక్టు ఏర్పాటు చేయడం
ఏకీకృత సివిల్ కోడ్ రూపొందించడం
ప్రభుత్వ రికార్డుల డిజిటైజేషన్
సమగ్ర ఈ-గ్రంథాలయం ఏర్పాటు చేయడం, న్యాయవాదులకు సాధికారత కల్పించడం
చట్టాలను క్రమం తప్పకుండా సమీక్షించి, వాటి సంస్కరణకు సూచనలు ఇవ్వడం
జాతీయ అభివృద్ధి మండలి, అంతర్రాష్ట్ర మండలి లాంటి వేదికలను పునరుద్ధరించడం
హిమాలయాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కేంద్రీయ టెక్నాలజీ విశ్వవిద్యాలయం నెలకొల్పడం
ఆత్మరక్షణ అంశాలను పాఠశాల విద్యలో భాగం చేయడం
భారత విశ్వవిద్యాలయాల విశ్వసనీయతను పెంచేందుకు ఉన్నత స్థానాల భర్తీని పారదర్శకంగా చేపట్టేందుకు విధానాలు రూపొందించడం
ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో పని సంస్కృతిని మెరుగుపరచడం
పాఠశాలల విద్యార్థుల కోసం వివిధ దేశాలతో స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాన్ని తీసుకురావడం
పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం ఈ-గ్రంథాలయం ఏర్పాటు చేయడం
టెక్నాలజీ సాయంతో, బడికెళ్లే పిల్లలకు పుస్తకాల బరువును తగ్గించే మార్గాలు అన్వేషించడం
మదర్సాాల ఆధునికీకరణకు జాతీయ కార్యక్రమం ప్రారంభించడం
బాలికలు పాఠశాల విద్యను పూర్తిచేసేలా తోడ్పాటు అందించడం
సర్వ శిక్షా అభియాన్ అమలు తీరు మదింపునకు వ్యవస్థ ఏర్పాటు
పాఠశాల విద్యా విధానంపై సమీక్ష
పిల్లల ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరణ
భారత వైద్య విధానం(ఐఎస్ఎం), ఆధునిక వైద్యశాస్త్రం, ఆయుర్జెనామిక్స్ అంశాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టడం. భారత వైద్య విధాన సంస్థలు ఏర్పాటు చేయడం.
యోగా, ఆయుష్‌లలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం
జాతీయ దోమల నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టడం
జాతీయ ఆరోగ్య భరోసా కార్యక్రమం
కొత్త ఆరోగ్య విధానాన్ని ప్రవేశపెట్టడం
వైకల్యమున్న పిల్లల కోసం ప్రత్యేక బోధనా విధానాన్ని తీసుకురావడం
సెకండరీ స్కూల్ విద్యను సార్వజనీనం చేయడం. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో, సంక్లిష్టమైన ప్రాంతాలపై ప్రదానంగా దృష్టి పెడుతూ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం
విద్య, పరిశోధనల ప్రమాణలు పెంచడం
జనాభా స్థిరీకరణకు కృషి చేయడం
పాఠశాల విద్యలో ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రతను భాగం చేయడం
గిరిజనుల కోసం పూర్తిస్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడం
నూతన విద్యా విధానం(ఎన్ఈపీ) సిఫార్సు చేసేందుకు జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయడం
ఆన్లైన్ కోర్సులను పెద్దయెత్తున ప్రారంభించడం
అప్రెంటీస్‌షిప్ చట్టాన్ని సమీక్షించడం
యూజీసీని ఒక ఉన్నత విద్య కమిషన్‌గా మార్చడం
భారత విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను పెంచి, విద్యా ప్రమాణాలను పెంచడం, తద్వారా అంతర్జాతీయంగా భారత విద్య స్థాయిని పెంచడం
ఉన్నత విద్యా సంస్థల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి వాటికి స్వయం ప్రతిపత్తిని కల్పించడం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సహా పారిశ్రామిక రంగం, విద్యా రంగం, సమాజం మధ్య సంబంధాలు, సమన్వయం కోసం ఒక యంత్రాంగాన్ని తీసుకురావడం
మెడికల్- పారా మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచడం
దిల్లీలోని ఎయిమ్స్ తరహా సంస్థను ప్రతీ రాష్ట్రంలో నెలకొల్పడం
దేశంలో బాగా వెనకబడ్డ 100 జిల్లాలను గుర్తించడం
మతపెద్దలతో మాట్లాడి వక్ఫ్ బోర్డులను బలోపేతం చేయడం. వక్ఫ్ భూముల్లో ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టడం.
పీడీఎస్‌ను సవరించడం
గృహనిర్మాణం, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి కోసం ఓ మోడల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం
వన బంధు కల్యాణ్ యోజనను జాతీయ స్థాయిలో తీసుకురావడం
గిరిజన పరిశోధన, సంస్కృతి, భాషల పరిరక్షణకు జాతీయ గిరిజన పరిశోధన, సంస్కృతి కేంద్రం ఏర్పాటు చేయడం.
గిరిజన సంక్షేమం, అభివృద్ధికి నిధుల కేటాయింపును పెంచడం
ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు వీలుగా సహజ వనరులను బలోపేతం చేసుకోవడం
సైనిక హార్డ్‌వేర్ డిజైన్, ఉత్పత్తిలో పెద్ద భాగస్వామ్యాన్ని పొందేలా దేశీయ పరిశ్రమను ప్రోత్సహించడం
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)ను బలోపేతం చేయడం
ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఆధునికీకరించడం ద్వారా ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ వ్యవస్థను సమూలంగా మెరుగుపరచడం
పోలీసు బలగాల నవీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి తోడ్పాటు అందించడం
గ్రామీణాభివృద్ధి కోసం టెక్నాలజీ సంస్థలు నెలకొల్పడం
విశ్వవిద్యాలయాలు, జాతీయ ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసే టెక్నాలజీని పరిశ్రమలకు అందించేందుకు స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయడం
విజ్ఞానశాస్త్ర పరిశోధన, నవీన ఆవిష్కరణ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకొనేలా యువతను ప్రోత్సహించేందుకు పథకాలు ప్రవేశపెట్టడం
పేదరిక నిర్మూలనకు, జీవనోపాధి భద్రతను పెంచేందుకు, ఎవ్వరికీ ఆకలి బాధ లేకుండా చేసేందుకు, పోషకాహార లోపం సమస్యను అధిగమించేందుకు, ఉపాధి కల్పనకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం
పౌర రక్షణ, హోమ్గార్డ్స్ వ్యవస్థను విస్తృతం చేయడం, పటిష్ఠపరచడం
కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఎన్సీసీ శిక్షణ పొందేలా విద్యార్థులను ప్రోత్సహించడం, ఈ శిక్షణను బలోపేతం చేయడం
మావోయిస్టు సమస్యను ఎదుర్కొనేందుకు జాతీయ ప్రణాళికను రూపొందించడం
ఈశాన్య రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు, సమూహాల భద్రత కోసం తక్షణం చర్యలు చేపట్టడం
రక్షణ సామగ్రి, వ్యవస్థాగత సంస్కరణలు, ఇతర అంశాల్లో సంస్కరణలు చేపట్టడం
ఒకే ర్యాంకు-ఒకే పింఛను విధానం అమలు
యుద్ధస్మారక నిర్మాణం
జాతీయ మారిటైం సంస్థ ఏర్పాటు
సాయుధ దళాల ఆధునీకరణ
సరిహద్దు నిర్వహణ సమీక్ష మరియు మెరుగుపరచడం. చట్టవిరుద్ధ ఇమ్మిగ్రేషన్ను తనిఖీ చేయడానికి చర్యలు
మానవ వనరుల కొరతను అధిగమించేందుకు రక్షణ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం.
వృద్ధుల సమస్యల పరిష్కారానికి వెటరన్ కమిషన్ ఏర్పాటు
రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయాత్మక పాత్రలో సాయుధ దళాల పాత్రను పెంచడం
సాయుధ దళాల ట్రిబ్యునల్ల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టడం.
సైనికులు తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచి ఓటు రిజిస్టర్ చేసుకోవడం. పోస్టింగ్ వారి స్థానం నుంచే ఓటు వేసే అవకాశం కల్పించడం.
సైనిక స్థలాల డిజిటలైజేషన్
యువతకు ఇంటర్న్‌షిప్, అప్రెంటింషిప్ అవకాశాలు కల్పించడం.
డిజిటల్ అక్షరాస్యతకు జాతీయ కార్యక్రమం ఏర్పాటు.
నిరంతర విద్యతో సామర్థ్యాలను పెంచడానికి మెరుగుపరచడానికి సంస్థాగత విధానాల ఏర్పాటు.
యూనివర్సిటీలు, పరిశ్రమలు, ప్రభుత్వంతో మమేకం చేయడం.
పరిశ్రమల భాగస్వామ్యంతో ఎక్సలెన్స్ కేంద్రాల ఏర్పాటు.
బహుళ నైపుణ్య మిషన్ ఏర్పాటు
2012 నాటి బాలలు యువకుల చట్టాన్ని 2015 మే లో కేంద్ర ప్రభుత్వం సవరించింది.
వృద్ధులకు పన్నుల మినహాయింపు
వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయడం, మెరుగు పర్చడం
దివ్యాంగుల హక్కులకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టడం
విదేశీ భాషలపై జాతీయ కార్యక్రమంతో సహా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం.
ఉద్యోగ పరికల్పనకు స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం.
కొత్త కాలనీల్లో క్రీడాసదుపాయాలు కల్పించడం.
ఆవిష్కరణ, వ్యవస్థాపకతలను ప్రోత్సహించడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం
రక్తహీనత సమస్యపై ప్రత్యేక దృష్టిసారించడం
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో వృద్ధులను స్వచ్ఛంద సేవకులుగా తీసుకునేలా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం.
విద్యారుణాల మంజూరును సులభతరం చేయడం, తక్కువ వడ్డీకే రుణాల మంజూరు
దివ్యాంగుల కోసం ఆన్లైన్ లర్నింగ్
దివ్యాంగుల కోసం దేశమంతా వర్తించేలా ప్రత్యేక గుర్తింపు కార్డులు
పబ్లిక్ స్థలాల్లో, రవాణాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టడం
దివ్యాంగుల కుటుంబాలకు పన్ను మినహాయింపు
క్రీడాకారుల కోసం ప్రత్యేక పథకాల ఏర్పాటు
దేశమంతా క్రీడా అకాడమీలు ఏర్పాటు చేయడం
నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం
క్రీడలకు ప్రత్యేక నిధుల కేటాయింపు
యూత్ ఫర్ డెవల్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు
జాతీయ యువ నేతల కార్యక్రమం
నేషనల్ యూత్ అడ్వయిజరీ కౌన్సిల్ ఏర్పాటు
యూత్ లీడర్ ప్రోగ్రాం ఏర్పాటు
ఆల్ విమెన్ మొబైల్ బ్యాంక్ ఏర్పాటు
మహిళా పోలీసుల సంఖ్యను పెంచడం
ఆమ్లదాడి బాధితుల కోసం నిధులు కేటాయింపు
లైంగికదాడికి గురైన వారికి మద్దతుగా నిధుల అందించడం
మహిళ రక్షణను పెంపొందించడం
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం
జిల్లాను ఒక విభాగంగా తీసుకొని మహిళల నేతృత్వంలో నడిచేలా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు
మహిళల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఇంక్యుబేటర్ పార్కులు
మహిళా భద్రతకు ఐటీని ఉపయోగించడం
మహిళల శిక్షణ అవకాశాలు పెంచడం
బాలికలపై దృష్టిపెట్టేందుకు ప్రత్యేక పథకం
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు
గ్రామీణ ప్రాంతంలో ఇంటి నిర్మాణాలకు చేయూత
మహిళా స్వయం సహాయక బృందాలకు తక్కువ వడ్డీకే రుణాలు
మహిళల కోసం వయోజన అక్షరాస్యత పథకం
ఆస్తి హక్కులు, వివాహ, సహసంబంధ హక్కులలో లింగ అసమానతలు తొలగించండి
కమ్యూనిటీ హెల్త్ కేర్ కార్మికులకు మెరుగైన జీతాలు
మహిళా హాస్టళ్ల అభివృద్ధి
మహిళల కోసం ప్రత్యేక వ్యాపార ఫెసిలిటేషన్ కేంద్రాలు
బేటీ బచావో బేటీ పడావో పథకం ఏర్పాటు
ఉద్యానాలు, పూలపెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకాలను ప్రోత్సహించడం
వ్యవసాయాన్ని, అనుబంధ పరిశ్రమలను ఆధునికీకరించడం
క్లస్టర్ ఆధారిత గిడ్డంగుల వ్యవస్థను ఏర్పాటు చేయడం
పోర్టులను అనుసంధానం చేసేందుకు రైల్ నెట్వర్క్ అభివృద్ధి
మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ చట్టంలో మార్పులు
ప్రభుత్వం పరిశ్రమల మధ్య సమన్వయం కోసం వ్యవస్థ ఏర్పాటు
కాపలాలేని రైలు క్రాసింగులను తొలగించడం
ఆయిల్, గ్యాస్, జల విద్యుత్, మహాసముద్రాలు, పవన విద్యుత్, బొగ్గు, అణు వనరుల వినియోగాన్ని పెంచడం
బొగ్గు, ఖనిజాలు, స్పెక్ట్రమ్ వంటి సహజ వనరులపై జాతీయ విధానాన్ని ఏర్పాటు చేయడం
శుద్ధమైన ఇంధనాన్ని ప్రోత్సహించడం
కాలుష్య నియంత్రణ విధానాల్ని ప్రాధాన్యంగా అమల్లోకి తీసుకురావడం
వృథాగా ఉన్న భూములను సామాజిక వన అభివృద్ధికి ఉపయోగించడం
హరిత భవనాలు, ఇంధన పొదుపు కార్యాలయాలకు మార్గదర్శకాలు రూపొందించడం
అటవీ జంతు సంరక్షణకు విధానాల రూపకల్పన
అడవుల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేయడం
ఈ-వేలం ద్వారా విలువైన వనరుల వేలం
టెక్నాలజీ ద్వారా వనరుల గుర్తింపు, అధ్యయనం, నిర్వహణ
జాతీయ వారసత్వ ప్రదేశాల పునరుద్ధరణ, నిర్వహణకు వనరుల కేటాయింపు
అయోధ్య రామ మందిర వివాదం పరిష్కరించడం
కొత్త కోర్టుల ఏర్పాటుకు, పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం
కింది స్థాయిలో కోర్టులు, జడ్జిల సంఖ్యను రెట్టింపు చేయడం
జడ్జీ పోస్టుల భర్తీకి ప్రాధాన్యం
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల పనితీరుపై అన్ని కోణాల్లో సమీక్ష
గ్రామీణ, చిన్నపట్టణాల్లో ఐటీ ఆధారిత ఉద్యోగాల సృష్టి
విద్యార్థులకు టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం
నేషనల్ రూరల్ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆధ్వర్యంలో గ్రామీణ వైద్య సేవల అభివృద్ధికి టెలీమెడిసిన్, మొబైల్ హెల్త్ కేర్ సేవల వినియోగం
గుజరాత్‌లోని ఈ-గ్రామ్, విశ్వగ్రామ్ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయడం
ఐటీ ఆధారిత అభివృద్ధి పరిధిలోకి అన్ని వెనకబడిన వర్గాలవారినీ తీసుకురావడం
ఓపెన్ సోర్స్, ఓపెన్ స్టాండర్డ్ సాఫ్ట్ వేర్ ను ప్రోత్సహించడం
హైస్పీడ్ హైవేల ఏర్పాటు
పంపిణీ, సరఫరా నష్టాల నివారణకు టెక్నాలజీ వినియోగం
కోర్టుల సామర్థ్యం పెంపుకు, నవీకరణకు నిధి ఏర్పాటు
వాణిజ్య చట్టాలతో ఉన్న కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు
ప్రభుత్వంపై వేసే కేసులను సమీక్షించడం, తగ్గించడం
బార్ కౌన్సిల్, బెంచిలలో మహిళల సంఖ్య పెంచడం
పాఠశాల పాఠ్యప్రణాళికల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు
చట్టపరమైన సమాచారం సులభంగా అందరికీ అందుబాటులో ఉండే చర్యలు
దౌత్యవేత్తల సంఖ్యను పెంచడం
అందరికీ ఇల్లు ఉండాలనే ఆలోచనలో భాగంగా తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం భారీ స్థాయిలో చేపట్టడం
ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకం, ఐటీ ద్వారా ఉద్యోగాల సృష్టి
ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లు, అక్రమ శరణార్థులు అంశాన్ని పరిష్కరించడం
విద్యా సంస్థల్లో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు హాస్టళ్ల ఏర్పాటు
ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు వైద్యసేవలు అందించేందుకు 2018లో ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ప్రారంభించాము.
వర్కర్స్ బ్యాంక్ ఏర్పాటును పరిశీలించడం
గృహాలకు, పరిశ్రమలకు గ్యాస్ అందుబాటులోకి తేవడానికి గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు
ఎయిర్ పోర్టుల ఆధునికీకరణ, చిన్న పట్టణాలు, పర్యాటక సర్క్యూట్ల అనుసంధానం
అన్ని గ్రామాలకు అన్ని కాలాల్లో తట్టుకునే రోడ్ల ఏర్పాటు
భారీ స్థాయిలో జాాతీయ రహదారుల నిర్మాణం, ప్రత్యేకంగా సరిహద్దులు, తీర ప్రాంతాల్లో
ప్రపంచ స్థాయి రహదారులు, రైలు మార్గాల ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము, కశ్మీర్‌లను ఇతర ప్రాంతాలతో కలపడం
ఫ్రైట్ కారిడార్ల ఏర్పాటు
ప్రత్యేక యూనివర్శిటీలతో జాతీయ నెట్వర్క్ ఏర్పాటు
గ్రామస్థాయిలో నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు, వైఫై జోన్ల ఏర్పాటు
వర్షపు నీరు వినియోగానికి వీలుగా భూగర్భ జలవనరుల వినియోగానికి సంబంధించి నమూనా బిల్లు రూపొందించాము.
ప్రజల ఆధ్వర్యంలో వికేంద్రీకృత, డిమాండ్ ఆధారిత జలవనరుల నిర్వహణను, నీటి సరఫరాను, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం.
పాఠశాాలల్లో క్రీడా సౌకర్యాలు, శిక్షణను మెరుగుపరిచేందుకు ఏర్పాట్లు చేసి క్రీడలను తప్పనిసరి చేయడం
మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగుపరచడం
వైద్య నిపుణుల కొరతను తీర్చేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం
ఆరోగ్య సంరక్షన నియంత్రణ విభాగాలను సమీక్షించి అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం
ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికీకరించి సౌకర్యలను మెరుగుపరచడం
ఔషధ మొక్కల పెంపక రంగాన్ని పునర్ వ్యవస్థీకరించడం
జాతీయ ఎలక్ట్రానిక్ వైద్య సంస్థ ఏర్పాటు ఇంకా ఆలోచన దశ లోనే ఉంది. ముసాయిదా సిద్ధం అయ్యింది. ప్రజాభిప్రాయం కోసం త్వరలో విడుదల కానుంది.
బహిరంగ మల విసర్జన రహిత దేశాన్ని సృష్టించడం
ఆధునిక, సైంటిఫిక్ మురుగు వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల ఏర్పాటు
పారిశుద్ధ్య రేటింగులను ప్రవేశపెట్టడం
సురక్షిత తాగు నీరు అందరికీ అందుబాటులోకి తేవడం
పోషకాహార లోపం నిర్మూలనకు పథకం
మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం పథకాన్ని అమలు చేయడం
క్రానిక్ డిసీజెస్‌లో పరిశోధనలపై పెట్టుబడులు పెట్టడం
108 అత్యవసర ఆరోగ్య సేవలను దేశమంతా విస్తరించడం
శాశ్వత ఇంటర్ ఫెయిత్ కన్సల్టేటివ్ మెకానిజంను ఏర్పాటు చేయడం
బిగ్ డాటా, విశ్లేషణ కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడం
జాతీయ అభివృద్ధి, భద్రతకు సంబంధించిన లక్ష్యాల సాధనకు అంతర్జాతీయ శాస్త్ర, సాంకేతికత సహకారం పెంపొందించడం
వాతావరణ మార్పులకు సంబంధించిన పరిశోధనలను ప్రోత్సహించడం
ఆధునిక ఉపగ్రహ సాంకేతికత అభివృద్ధికి కృషి
వొకేషనల్ అర్హతలు
వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించడం
పప్పు దినుసులు, నూనెల ఉత్పత్తికి ప్రోత్సాహం
వికలాంగుల కోసం పనిచేసే సంస్థలకు సాయం
యువతలో టాలెంట్‌ను మొదటి దశలోనే గుర్తించి ప్రోత్సహించడం
కమ్యూనిటీ కిచెన్ల నిర్వహణలో వాలంటరీ సంస్థల సాయం
నిర్ణీత కాలవ్యవధిలో రక్షణ శాఖలో బలగాలను పెంచడం
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖను పునర్ వ్యవస్థీకరించడం
జాతీయ భద్రతా కౌన్సిల్లో మార్పులు తీసుకురావడం
నానో టెక్నాలజీ, థోరియమ్ టెక్నాలజీ తదితర రంగాల్లో ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాలను నిర్మించడం
ఇన్నొవేషన్ కోసం జాతీయ స్థాయి వ్యవస్థను తీసుకురావడం
సైన్స్‌ను ప్రోత్సహించే పథకాలకు ప్రచారం
ఉష్ణ మండల వ్యాధుల నిర్మూలన కోసం పరిశోధన
మందుల్లో, పరిశ్రమల్లో, వ్యవసాయంలో న్యూక్లియర్ సైన్స్ వినియోగాన్ని, పరిశోధనలను ప్రోత్సహించడం
వ్యాపారం ప్రారంభించేందుకు అనుమతుల కోసం వ్యాపారులు, సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు పదే పదే తిరగాల్సిన అవసరం లేకుండా చేయడం. చిరు వ్యాపారులపై వేధింపులను నిరోధించేందుకు ఓ వ్యవస్థ ఉంటుంది.
ఉపాధి ఎక్సేంజ్‌లను జీవనోపాధి కేంద్రాలుగా రూపాంతరం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో పరిశోధన, ఆవిష్కరణలకు మద్దతు
వయోధికుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి
విద్యా హక్కు, ఆహార భద్రత చట్టం సరిగ్గా అమలయ్యేలా చూడటం
క్రీడలు, క్రీడాకారులకు సాయపడేలా వ్యాపారులను ప్రోత్సహించడం
దేశమంతా ఏయిర్ కార్గో సేవలను విస్తరించడం
యాంటీ టెర్రర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఎన్ఐఏను బలోపేతం చేయడం.
సార్క్, ఏసియన్ లాంటి అంతర్జాతీయ కూటములతో కలిసి పనిచేయడం.
నిర్ణీత కాలవ్యవధిలో పారదర్శకంగా పర్యావరణ అనుమతలను తీసుకోవడం.
భవిష్యత్తు డిమాండ్‌కు సరిపడేలా నైపుణ్య మానవ వనరులను అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించడం.
భారీ ప్రాజెక్టులకు అనుమతిలిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం.
హార్ట్‌వేర్, సాఫ్ట్వేర్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే సదుపాయాలు కల్పించడం.
ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహిస్తూ రాష్ట్రాలకు ఆర్థిక స్వయంప్రతిపత్తిని కల్పించడం.
దేశీయ థోరియం సాంకేతిక కార్యక్రమంలో పెట్టుబడులు పెట్టడం
శక్తి రంగంలో మౌలిక సదుపాయాల వృద్ధిపై దృష్టిసారించడం, మానవ వనరుల అభివృద్ధి, టెక్నాలజీని తర్వాత స్థాయికి తీసుకెళ్లడం
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో గ్రామీణ పేదలకు ఉద్యోగాలు కల్పించడం
కార్బన్ క్రెడిట్లపై సానుకూలంగా ప్రోత్సహించడం
ఎన్ఆర్ఐ, పీఐవో అలాగే ఇతర దేశాల్లో స్థిరపడిన భారతీయుల సహకారంతో బ్రాండ్ ఇండియాను ప్రచారం చేయడం.
మెరైన్ పోలీసింగ్ అంశాలపై చర్చించడానికి తీర ప్రాంత రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకురావడం
ప్రస్తుత సవాళ్లకు అనుగుణంగా భారత అణుసిద్ధాంతాలను సమీక్షించి ఉన్నతీకరించడంపై అధ్యయనం చేయడం.
ఈ ప్రాజెక్టు కోసం, 2014 మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను మూడు స్టేటస్ కేటగిరీలుగా విభజించాం.
నెరవేరింది: నెరవేరిన హామీలు
పురోగతి ఉంది: కొన్ని పథకాలు, నిధుల కేటాయింపు, చట్ట సవరణల ద్వారా అమలులో కొద్దిగా పురోగతి ఉన్న హామీలు
ఎలాంటి పురోగతీ లేదు: అమలుపై ఎలాంటి పురోగతీ లేని హామీలు. ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించిన హామీలు కూడా దీనిలో భాగమే.
మా డేటా టీమ్ ప్రతి హామీ అమలులో ప్రస్తుత పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించింది. పార్లమెంటులో ప్రశ్నలు, అధికారిక నివేదికలు, సర్వేలను ఈ బృందం ఆధారంగా చేసుకుంది. ప్రతి హామీ, దాని ప్రస్తుత పరిస్థితి, దానికి సంబంధించిన ఆధారం (లింక్) కూడా ఇక్కడ ఉంది.
2014 మేనిఫెస్టో నుంచి 393 హామీలను పరిగణనలోకి తీసుకున్నాం. దీనిలో 346 హామీలను మా విశ్లేషణకు ఉపయోగించాం. కొన్ని హామీలు మళ్లీ మళ్లీ వచ్చాయి, విశ్లేషించడానికి కొన్ని చాలా సాధారణమైనవి. మిగిలిన 47 హామీలు ఏంటి, వాటిని ఎందుకు మేము ఈ విశ్లేషణలో చేర్చలేదో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..
మేనిఫెస్టోను చూడాలంటే... ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రొడక్షన్: మహిమా సింగ్, షాదాబ్ నజ్మీ
డెవలప్మెంట్: అభిషేక్ జైరాత్, జూలియట్ కార్టర్
డిజైన్: మహిమా సింగ్, గగన్ నార్హె
ఇలస్ట్రేషన్స్: పునీత్ బర్నాలా
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: నెరవేరింది
2017లో నేషనల్ హెల్త్ పాలసీని తీసుకొచ్చారు. అందుబాటు ధరలో నాణ్యమైన వైద్య సేవల్ని అందించడం దాని లక్ష్యం.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: నెరవేరింది
1950లో ప్రారంభించిన మూడు దశల అణుశక్తి కార్యక్రమాన్ని భారత్ ప్రభుత్వం అనుసరిస్తూనే ఉంది. ప్రస్తుతం భారత్ రెండో దశలో ఉంది.మూడో దశకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది.
వర్గం: వ్యవసాయం స్థితి: నెరవేరింది
2015 లో ప్రభుత్వం అసంఘటిత రంగంలో పని చేసేవారి కోసం అటల్ పెన్షన్ యోజన అనే పింఛను పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాలలోని పేద, బడుగు కుటుంబాల వారికి, ఎంపిక చేయబడ్డ పట్టణ ప్రాంతాలలోని కొన్ని రకాల పనివారికి ఆర్ధిక సహాయం చేసేందుకు ఆయుష్మాన్ భారత్ పేరుతో 2019 లో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభించారు.
వర్గం: వ్యవసాయం స్థితి: నెరవేరింది
2016లో ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ప్రారంభించింది. ఇది పంటబీమా పథకం. 2016లో ‘రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సురెన్స్’ పథకాన్ని కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రతికూల వాతావరణం వల్ల నాశనమయ్యే పంటకు బీమా లభిస్తుంది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
తీర ప్రాంత భద్రత, మెరైన్ విధానాలు వంటి అంశాలపై చర్చించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హోం మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీల సమావేశాలు జరిగాయి.
వర్గం: వ్యవసాయం స్థితి: నెరవేరింది
2015లో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అమల్లోకి వచ్చింది. వ్యవసాయంలో నీటి వృథాను అరికట్టిడం దీని ఉద్దేశం. హర్ ఖేత్ కో పానీ, మోర్ క్రాప్ పర్ డ్రాప్ లాంటి నినాదాలు ఉనికిలోకొచ్చాయి.
వర్గం: వ్యవసాయం స్థితి: నెరవేరింది
2014లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై ఖర్చు అంచనా రూ.111056 కోట్లుగా ఉంది. 2018 నాటికి అది రూ.170003 కోట్లకు చేరింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: నెరవేరింది
ప్రధానమంత్రి ఉపాధి అవకాశాల కల్పన పథకం (పి ఎం ఇ జి పి), ప్రధానమంత్రి ముద్ర యోజన, స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, ‘దీన్ దయాళ్ I అంత్యోదయ యోజన’ పేరుతో అమలవుతున్న జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం (DAY-NRLM) మరియు జాతీయ పట్టణ జీవనోపాధి పథకం (NULM) వంటి అనేక పథకాల ద్వారా ప్రభుత్వం స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోంది. NULM ను యుపీఏ ప్రభుత్వం 2013 లో ప్రారంభించింది. బ్యాంకులు యువతకు శిక్షణ ఇవ్వడానికి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (RSETI)లను నెలకొల్పుతున్నాయి. వారు సొంతంగా చిన్న పరిశ్రమలను నెలకొల్పుకునేందుకు రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నాయి.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: నెరవేరింది
పాత ప్రభుత్వం పథకాలను కొనసాగించడంతో పాటు ప్రభుత్వం అనేక కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టింది. ఎక్కువమంది కార్మికుల శ్రమ అవసరమయ్యే రంగాలలో జరిగే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు, వాటి ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఫోకస్ మార్కెట్ స్కీమ్, మార్కెట్ లింక్డ్ ఫోకస్ ప్రోడక్ట్ స్కీమ్, ఫోకస్ ప్రోడక్ట్ స్కీమ్ వంటి అనేక పథకాలను రూపొందించారు. విదేశీ వాణిజ్య విధానం 2015-20 పై మధ్యంతర సమీక్ష చేసినపుడు ఈ రంగంలోని కీలకమైన పరిశ్రమల ఉత్పత్తుల రేట్లను మర్కండైజ్ ఎక్స్ పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (MEIS) కింద 2 శాతం పెంచారు. దేశ పర్యాటక రంగ అభివృద్ధికి పర్యాటక మంత్రిత్వ శాఖ పలు కొత్త కార్యక్రమాలు ప్రారంభించింది. 2015 లో స్వదేశ్ దర్శన్ పేరుతో ఒక ఇతివృత్తం (థీమ్) ప్రాతిపదికగా యాత్రలను నిర్వహించడం, తీర్ధయాత్రలను పునరుద్ధరించే, ఆధ్యాత్మిక, సాంస్కృతిక యాత్రలను ప్రోత్సహించే ‘ప్రషాద్’ (PRASHAD) అనే పథకం పేరుతో పేరెన్నికగన్న పవిత్ర స్థలాలను అభివృద్ది చేయడం, ADOPT అనే పేరుతో చారిత్రక స్థలాలు, స్మారక చిహ్నాలు, ఇతర పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులకు కావలసిన సదుపాయాలు కల్పించడానికి ఒక హెరిటేజ్ ప్రాజెక్ట్ ను అమలు చేయడం వంటి ఎన్నో చర్యలు చేపట్టారు.
వర్గం: మైనారిటీలు స్థితి: నెరవేరింది
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతోంది. 2018లో ఈ పథకం కింద జరిగిన 260 పనుల్లో 164 వ్యవసాయ, అనుబంధ రంగానికి సంబంధించిన పనులు. మొత్తం నిధుల్లో వ్యవసాయ ఆధారిత పనుల కోసం 67 శాతం ఖర్చు చేశారు.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: నెరవేరింది
దేశంలోని ప్రతి నివాసానికీ విద్యుత్ సదుపాయం కల్పించేందుకు 2017లో సౌభాగ్య పథకాన్ని ప్రారంభించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు 2015లో స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: నెరవేరింది
2015 జూలై 15 వ తేదీ నాడు ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమం ప్రారంభించారు. అదే రోజు భారతదేశపు అతి పెద్ద నైపుణ్య సర్టిఫికేషన్ స్కీమ్ అయిన ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’ ను కూడా ఆరంభించారు. తర్వాత దాన్ని మరో నాలుగేళ్ల పాటు 2020 వరకు పొడిగించారు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: నెరవేరింది
2017 లో జి.ఎస్.టి చట్టమైంది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: నెరవేరింది
టూరిజం మంత్రిత్వ శాఖ 2015 జూలై లో టూరిజంలో ఎం.బి.ఎ కోర్సును ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. వారు అమరకంటక్ లో ఉన్న ఇందిరాగాంధి జాతీయ గిరిజన యూనివర్సిటీ తో కలిసి ఈ కోర్సును రూపొందించారు. 2018 నవంబర్ లో టూరిస్ట్ ఉద్యోగాలకు మరో సర్టిఫికేషన్ కోర్సును కూడా మొదలుపెట్టారు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: నెరవేరింది
106 అంతర్గత జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా మార్చే బిల్లును భారత పార్లమెంటు 2016 లో ఆమోదించింది. జాతీయ స్థాయిలో జల రవాణాను పెంచే అవకాశాలను సాగరమాల కార్యక్రమం ద్వారా గుర్తించారు. దీని కింద మొదటి జలమార్గం 2018 లో వాడుకలోకి వచ్చింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: నెరవేరింది
రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఐ.ఆర్.సి.టి.సి దేశంలోని అనేక పుణ్య స్థలాలకు ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది. కేవలం వయోవృద్ధుల కోసం ‘బరిస్తా నాగరిక తీర్థ యాత్రా యోజన’ పేరుతో ఒక టూరిస్టు పథకాన్ని ప్రారంభించారు. బౌద్ధ యాత్రాస్థలాలన్నిటినీ చూపించే బౌద్ధ తీర్ధయాత్రా రైలును ఇటీవల మరింత మెరుగుపరిచారు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: నెరవేరింది
ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన వాణిజ్య వెసులుబాటు ఒప్పందం ఇండియాలో 2017 నుండి అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు 2016 ఏప్రిల్ లో ఒక సింగిల్ విండో ఇంటర్ఫేస్ ను ఆరంభించింది. ఎగుమతిదారులకు, దిగుమతిదారులకు సౌకర్యంగా ఉండేలా 19 రేవులలో, 17 ఎయిర్ కార్గో కాంప్లెక్స్ లలో 24 గంటలూ కస్టమ్స్ క్లియరెన్స్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో పేపర్ వర్క్ ను బాగా తగ్గించారు.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: నెరవేరింది
ప్రభుత్వం అనేక కుటుంబ పొదుపు పథకాలను ప్రారంభించింది. కూతుర్ల కోసం పొదుపు చేసేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ‘సుకన్య సమృద్ధి యోజన’ ను 2015 లో ప్రారంభించారు. 2014 లోనే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన మొదలుపెట్టారు. ఇంకా ఆదాయ పన్ను పరిమితిని పెంచడం వంటి చర్యలు కూడా తీసుకున్నారు. 2018-19 బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు బ్యాంకు వడ్డీ రేట్లలో, ఆరోగ్య భీమా చెల్లింపులలో కొన్ని రాయితీలు ఇచ్చారు.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: నెరవేరింది
ప్రజలకు అన్ని రకాల ఆర్ధిక సేవలు అందుబాటులోకి తేవడానికి ప్రధాని నరేంద్ర మోదీ 2014 లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ప్రారంభించారు. 2018 లో ప్రభుత్వం ప్రకటించిన బ్యాంకు రీకాప్, సమగ్ర సంస్కరణ ప్రణాళిక కస్టమర్ అభిప్రాయాలకు, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ కు పెద్ద పీట వేయనుంది.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: నెరవేరింది
ఇండియా పన్ను సమాచారం ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాలు, మల్టీలాటరల్ కన్వెన్షన్, ‘సార్క్’ మల్టీలాటరల్ కన్వెన్షన్ వంటి ఒప్పందాలన్నో కుదుర్చుకుంది. 2016 జూన్ నాటికీ ఇండియా పన్ను ఒప్పందాలను కుదుర్చుకున్న దేశాల సంఖ్య 139.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: నెరవేరింది
నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చే షెల్ కంపెనీల ఆటకట్టించడానికి 2017 ఫిబ్రవరిలో ఒక టాస్క్ ఫోర్సును నెలకొల్పారు.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: నెరవేరింది
బ్లాక్ మనీ ( గుప్తంగా ఉంచిన విదేశీ ఆదాయం, ఆస్తులు) మరియు పన్ను విధింపు చట్టం 2015 లో అమల్లోకి వచ్చింది. అప్పటినుండి బినామి లావాదేవీల (నియంత్రణ) సవరణ చట్టం వంటి చట్టాలు, అనేక పథకాలు, టాస్క్ ఫోర్సులు, దర్యాప్తు బృందాలు అందుకోసమే అమల్లోకి వచ్చాయి.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: నెరవేరింది
విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించడానికి, విదేశీ సంస్థలు ఇండియాతో సులువుగా వ్యాపారం చేయడానికి వీలుగా 2017 లో విదేశీ పెట్టుబడి ప్రోత్సాహక బోర్డును రద్దు చేశారు.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: నెరవేరింది
భారత్‌లో మోనజైట్ అనేది థోరియంకు ప్రాథమిక వనరు. ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) వివరాల ప్రకారం, దేశంలో 12.47 మిలియన్ టన్నుల మేర మోనటైజ్ నిల్వలు ఉన్నాయి. బడ్జెట్ నివేదికల ప్రకారం, ముంబయి సమీపంలోని థోరియం కర్మాగారం నిర్వహణ, కార్యకలాపాల కోసం 2012- 2013లో రూ.1.50 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత దానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2016లో థోరియం ఆధారిత రియాక్టర్లపై పరిశోధనల కోసం రూ.292 కోట్లు కేటాయించారు.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: నెరవేరింది
2014లో అప్పటికే అమల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్బీఐ సవరించింది. ఎన్బీఎఫ్సీలు, స్టేక్హోల్డర్లను బలోపేతం చేసేందుకు ఈ సవరణలు జరిగాయి.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: నెరవేరింది
బ్యాంకులకు చెందిన ఆదాయం రాని ఆస్తుల సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇంసాల్వెంసీ అండ్ బ్యాంక్ రప్టససీ కోడ్ 2016 అందులో ఒకటి. 1949 నాటి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని 2017 లో సవరణ చేసింది కూడా ఇందుకే. ఆదాయం రాని ఆస్తుల నుండి నగదు రాబట్టడానికి SARFAESI చట్టాన్ని కూడా కొనసాగిస్తోంది.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: నెరవేరింది
పార్లమెంట్ 2017 లో వస్తు, సేవల పన్ను చట్టాన్ని ఆమోదించింది. 2013 లో ఇన్ఫోసిస్ సహాయంతో నెలకొల్పిన వస్తు సేవల పన్ను నెట్ వర్కే జి.ఎస్.టి కి వెన్నెముక.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: నెరవేరింది
ప్రభుత్వం 2016 లో ఎ.పి.ఎం.డి మండీల స్థానంలో వ్యవసాయోత్పత్తుల అమ్మకాలకు ఒక ఏకీకృత జాతీయ మార్కెట్ ను నెలకొల్పాలనే ఉద్దేశంతో NAM పేరుతో ఒక ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించింది.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: నెరవేరింది
తోటలు, వ్యవసాయోత్పత్తుల ధరల నియంత్రణ కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2014 లో ధరల స్థిరీకరణ నిధి (పి.ఎస్.ఎఫ్) ని ఏర్పరచింది.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: నెరవేరింది
జాతీయ సౌర పథకాన్ని 2015 లో పునః సమీక్షించి సౌర విధ్యుత్ సామర్ధ్యం పెంపుకు లక్ష్యాలు నిర్దేశించారు. తర్వాతి సంవత్సరంలో దానిని రెట్టింపు చేసినట్లు తెలుస్తోంది.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: నెరవేరింది
అంతర్జాతీయ ఇంధన సంస్థ లెక్క ప్రకారం 2016-17 లో ప్రపంచంలో మూడవ అతి పెద్ద బొగ్గు ఉత్పత్తిదారు ఇండియానే. తర్వాత కాలంలో బొగ్గుకి గిరాకీ, ఉత్పత్తి రెండూ ఇంకా పెరిగాయి.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: నెరవేరింది
గత నాలుగేళ్ళలో ప్రభుత్వం అనేక జల విద్యుత్ ప్రాజెక్ట్ లను ప్రారంభించింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: నెరవేరింది
దేశవ్యాప్తంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు 2015లో జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్‌ను ప్రారంభించారు.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: నెరవేరింది
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2015 లో హిమాలయాల అధ్యయనంపై ఒక జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తేవడమే కాక నిర్ణయాత్మక ప్రక్రియలో కూడా భాగం కాగలిగిన అనేక పోర్టల్స్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
2014 ఫిబ్రవరిలో మంత్రిమండలి ఎన్నికల నిర్వహణ నిబంధనలను సవరించింది. పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసేవారి వ్యయ పరిమితిని 70 లక్షల వరకు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిమితిని 28 లక్షల వరకు పెంచింది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
వాడుకలో లేని చట్టాలను గుర్తించే ప్రాజెక్టును గత ప్రభుత్వ హయాంలోనే 19వ లా కమిషన్ చేపట్టింది. కానీ కమిషన్ గడువు ముగియడంతో దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు. 20వ లా కమిషన్ కూడా ఈ ప్రాజెక్టును కొనసాగించాలని నిర్ణయించింది. తన సిఫార్సులతో “వాడుకలో లేని చట్టాలు: వెంటనే తొలగించాల్సిన ఆవశ్యకత” అనే పేరుతో ఓ నివేదికను కూడా సమర్పించింది. ఈ నివేదికను సమీక్షించి అవసరం లేని చట్టాలను రద్దుచేసేందుకు 2014లో ప్రధాని కార్యాలయం ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. రద్దుకు అర్హమైన 1824 చట్టాలను ఆ కమిటీ గుర్తించింది. దీనికోసం అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐదు బిల్లులు పాస్ అయ్యాయి. మొత్తం 1824 చట్టాల్లో 1428 చట్టాలు ఇప్పటికే రద్దయ్యాయి.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ద్వారా 2014 తర్వాత దాదాపు 29 కోట్ల కొత్త బ్యాంకు అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. యూపీఐ ఆధారిత మొబైల్ చెల్లింపుల యాప్ భీమ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
పోలీస్ శాఖలోని ఉద్యోగులకు వివిధ పథకాలు, సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం శిక్షణనిస్తోంది. పోలీస్ బలగాల ఆధునికీకరణ (ఎంపీఎఫ్) పథకంలో భాగంగా పోలీసు బలగాల నవీకరణకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు అందిస్తోంది. శిక్షణకు అవసరమైన సాయం కూడా దీనిలో భాగమే. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడెమీ, బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నార్త్ ఈస్ట్రన్ పోలీస్ అకాడెమీ, లోక్ నాయక్ జయ్‌ప్రకాశ్ నారాయణ్ జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్సెస్ సంస్థలు ఫోరెన్సిక్ సైన్స్‌పై వివిధ స్థాయుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) శిక్షణ విభాగం కూడా భారత పోలీసు అధికారులకు వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రత్యేక శిక్షణ సంస్థల ద్వారా కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), కేంద్రీయ పోలీసు సంస్థలు (సీపీఓ)ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తమ సిబ్బందికి, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాం పోలీసు సిబ్బందికి ప్రతి సంవత్సరం వివిధ అంశాలపై ప్రత్యేక శిక్షణను అందిస్తోంది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
పోలీస్ బలగాలను ఆధునికీకరించడానికి ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. 2017లో “పోలీస్ బలగాల ఆధునికీకరణ (ఎంపీఎఫ్)” పథకాన్ని మూడేళ్ల కాలానికి (2017-18 నుంచి 2019-20 వరకు) రూ.25061 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఆమోదించింది. ఎంపీఎఫ్తో పాటు, విచారణలకు, పౌర సేవలకు అవసరమైన ఆన్లైన్ పోర్టల్ క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) ను 2018లో ప్రారంభించింది. ది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ పోర్టల్, సెర్ట్-ఇన్, బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు చెందిన శిక్షణ విభాగం, మహిళలు, పిల్లలపై సైబర్ నేరాల నిరోధక విభాగం, సీబీఐ వంటి వివిధ శాఖలు, పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం సైబర్ ఫోరెన్సిక్స్‌పై శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రైవేటు సంస్థలు, యూనివర్సిటీలు కూడా సైబర్ భద్రతపై తరగతులు నిర్వహిస్తున్నాయి. అన్ని రకాల సైబర్ నేరాలను విచారించేందుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ను హోంమంత్రిత్వ శాఖ ఆమోదించింది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
2009లో ఆమోదం పొందిన ‘ది క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్)’ ను 2018 చివర్లో అమల్లోకి తెచ్చింది. సీసీటీఎన్ఎస్ జాతీయ ఈ-గవర్నెన్స్ ప్రణాళిక (ఎన్ఈజీపీ) లో భాగంగా ఓ మిషన్ మోడ్ ప్రాజెక్టుగా చేపట్టారు. పోలీసు వ్యవస్థకు ఈ-గవర్నెన్స్‌ను జోడించడానికి ఉద్దేశించిన వెబ్ పోర్టల్ ఇది. పౌర-ఆధారిత, విచారణ సేవలన్నింటినీ అందించడానికి ఉద్దేశించిన కేంద్రంగా దీన్ని చూపించారు. పోలీస్ స్టేషన్ల మధ్య సహకారం, సమాచార మార్పిడికి ఇది వీలు కల్పిస్తుంది. నవంబర్ 2018 నాటికి ఇది దేశంలోని 14764 పోలీస్ స్టేషన్లలో ఏర్పాటైంది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
ది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ పోర్టల్, సెర్ట్-ఇన్, బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు చెందిన శిక్షణ విభాగం, మహిళలు, పిల్లలపై సైబర్ నేరాల నిరోధక విభాగం, సీబీఐ వంటి వివిధ శాఖలు, పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం సైబర్ ఫోరెన్సిక్స్‌పై శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రైవేటు సంస్థలు, యూనివర్సిటీలు కూడా సైబర్ భద్రతపై తరగతులు నిర్వహిస్తున్నాయి. 2018-20 మధ్యలో రూ. 415.86 కోట్ల వ్యయంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ఏర్పాటుకు హోంమంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
సమగ్ర పట్టణాభివృద్ధికి ఉద్దేశించిన స్మార్ట్ సిటీ పథకాన్ని 2016 జూన్ 25న మోదీ ప్రారంభించారు.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ 2017 జూన్ 23 న “గంగా గ్రామ్” పేరుతో వ్యర్థాల సమగ్ర నిర్వహణ కార్యక్రమాన్ని గంగానది వెంబడి ఉన్న 4470 గ్రామాల్లో ప్రారంభించింది. పరిశ్రమలు తమ వ్యర్థాల నిర్వహణను పర్యవేక్షంచుకోవడానికి ఓ వెబ్ ఆధారిత అప్లికేషన్‌ను 2016లో పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వివిధ రకార వ్యర్థాల నిర్వహణకు సంబంధించి అనేక నిబంధనలను కూడా అదే సంవత్సరం ఏర్పాటు చేసింది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
ప్రధాన్ మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) మొదటి సమావేశం 2015 జులై 1 న జరిగింది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
గంగానది మరింతగా కాలుష్యం కాకుండా తగ్గించడానికి ప్రయాగరాజ్‌లో మురుగునీటి శుధ్ధి ప్లాంట్లకు నీటిని తీసుకెళ్లేందుకు ఓ పైపుల వ్యవస్థను 2018 డిసెంబరులో ప్రధాని మోదీ ప్రారంభించారు. గంగ-యమున ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే మరో మురుగునీటి వ్యవస్థకు, 7 పంపింగ్ స్టేషన్లకు, 3 నీటి శుద్ధి ప్లాంట్లకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. జలవనరుల శాఖ వివరాల ప్రకారం, ఇలాంటి 10 పథకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
ఒడిషాలోని గంజాం జిల్లాలో సముద్రపునీటిలో లవణాలను తొలగించే ప్లాంటు నిర్మాణంలో ఉందని అణుశక్తి విభాగం ఫిబ్రవరి 2017లో స్పష్టం చేసింది. తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న మరొకటి అప్పటికే ప్రారంభమైంది. మహారాష్ట్రలోని సముద్రతీరం వెంబడి ఇలాంటి ప్లాంట్లను నెలకొల్పే ప్రణాళికలేమీ లేవు.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
కేంద్ర భూగర్భ జలవనరుల బోర్డు (సీజీడబ్ల్యూబీ) ప్రతి సంవత్సరం భూగర్భ జలాల్ని పరీక్షిస్తూ ఉంటుంది. రాష్ట్రాలు డేటా సర్వేలు చేసి, ఫ్లోరైడ్, నైట్రేట్, ఆర్సెనిక్, ఐరన్, భార లోహాలు, లవణ స్థాయులను పరీక్షిస్తాయి.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
2015లో సాగరమాల ప్రాజెక్టు ప్రారంభమైంది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
రికార్డుల డిజిటైజేషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించి, కొనసాగిస్తోంది. యూపీఏ హయాంలోని డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునికీకరణ కార్యక్రమం (డీఐఎల్ఆర్ఎంపీ) నే భూవనరుల విభాగం అనుసరిస్తోంది. ఇప్పటివరకూ దీనికి రూ.1399.83 కోట్లను విడుదల చేశారు. డాక్యుమెంట్ల క్రమబద్ధీకరణ, సంరక్షణ/పరిరక్షణ కోసం, రాతప్రతుల డిజిటైజేషన్ కోసం 2003లో నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్స్ (ఎన్ఎంఎం) ను సాంస్కృతిక శాఖ ప్రారంభించింది. మ్యూజియాలు సేకరించిన ప్రతులను కూడా డిజిటైజేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా సాంస్కృతిక శాఖ ప్రారంభించింది. ఇప్పటివరకూ ఈ పథకం కింద 18 మ్యూజియాలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయాన్ని అందుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లోని కేసు రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియ మొదలైంది. ఇది వివిధ కోర్టుల్లో వివిధ దశల్లో ఉంది. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా డిజిటైజేషన్ అనేది ఓ నిరంతర ప్రక్రియ. పురాతన పత్రాలు, చారిత్రక పత్రాలు అందరికీ అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో 2015లో శోధనకు అనువైన ‘అభిలేక్-పటల్’ అనే వెబ్ పోర్టల్ ప్రారంభమైంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా క్రౌడ్ సోర్సింగ్ ద్వారా రికార్డులను డిజిటైజ్ చేయడానికి ప్రభుత్వం డిజిటైజ్ ఇండియా ప్లాట్‌ఫాం (డీఐపీ)ను ప్రారంభించింది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
2018లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టును మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రారంభించింది. ఇది అందరికీ ఉచితంగా నేర్చుకునేందుకు అవసరమైన వనరుల సంగ్రహం.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
వాడుకలో లేని చట్టాలను గుర్తించే ప్రాజెక్టును గత ప్రభుత్వ హయాంలోనే 19వ లా కమిషన్ చేపట్టింది. కానీ కమిషన్ గడువు ముగియడంతో దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు. 20వ లా కమిషన్ కూడా ఈ ప్రాజెక్టును కొనసాగించాలని నిర్ణయించింది. తన సిఫార్సులతో “వాడుకలో లేని చట్టాలు: వెంటనే తొలగించాల్సిన ఆవశ్యకత” అనే పేరుతో ఓ నివేదికను కూడా సమర్పించింది. ఈ నివేదికను సమీక్షించి అవసరం లేని చట్టాలను రద్దుచేసేందుకు 2014లో ప్రధాని కార్యాలయం ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. రద్దుకు అర్హమైన 1824 చట్టాలను ఆ కమిటీ గుర్తించింది. దీనికోసం అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐదు బిల్లులు పాస్ అయ్యాయి. మొత్తం 1824 చట్టాల్లో 1428 చట్టాలు ఇప్పటికే రద్దయ్యాయి.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
రాష్ట్రాల మధ్యన నెలకొన్న వివాదాలపై విచారణ చేసి, సూచనలిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఛైర్మన్‌గా, ఆరుగురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సభ్యులుగా అంతర్ రాష్ట్ర మండలి తిరిగి ఏర్పాటైంది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: నెరవేరింది
జాతీయ ఉపాధి సేవ, ఉపాధి ఎక్సేంజీల అంతర్గత అనుసంధానం కోసం 2013 నుంచి నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్టును లేబర్ బ్యూరో మిషన్ మోడ్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: నెరవేరింది
పాఠశాలల్లో మార్చి 31, 2019 నాటికి పనిచేస్తున్న శిక్షణ పొందని ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చి బీఈఎల్ఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) లేదా డీఈఎల్ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) అర్హతను పొంది, తమ ఉద్యోగాల్లో కొనసాగేందుకు అవకాశం కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీని 2019-20లో ప్రారంభించనుంది. ఐఐఎమ్‌లకు తమ ఛైర్మన్లను ఎంపిక చేసుకోవడంలో మరింత స్వయం ప్రతిపత్తిని కల్పించింది. “ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్” అనే దాన్ని ప్రారంభించినప్పటికీ అది వివాదాస్పదమైంది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: నెరవేరింది
2018లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టును మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రారంభించింది. ఇది అందరికీ ఉచితంగా నేర్చుకునేందుకు అవసరమైన వనరుల సంగ్రహం.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: నెరవేరింది
2017లో ‘షగున్’, సర్వ శిక్ష అభియాన్’ వెబ్ పోర్టళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. దానికి ప్రధానంగా రెండు లక్ష్యాలు. టీచర్లు, విద్యార్థులు అందులో ఎంటర్ చేసే సమాచారం ద్వారా స్కూళ్ల పనితీరును అంచనా వేస్తుంది. ‘రిపాసిటరీ’ పేరుతో స్కీమ్‌కు సంబంధించిన రిపోర్టులను అందులో ఉంచుతారు. కానీ కొన్ని రిపోర్టులు మాత్రమే పబ్లిక్కు అందుబాటులో ఉంటాయి.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: నెరవేరింది
బడ్జెట్ నివేదికల ప్రకారం ఆయుష్ కోసం ఖర్చు చేసిన మొత్తం 2014లో రూ.892 కోట్లుంటే, 2018లో అది రూ.1626కోట్లకు చేరింది.
వర్గం: వ్యవసాయం స్థితి: నెరవేరింది
ఎ.పి.ఎం.సి చట్టంలో గణనీయమైన మార్పులు చేస్తూ ప్రభుత్వం 2017 లో 'వ్యవసాయోత్పత్తుల మరియు పశువుల మార్కెటింగ్ (ప్రోత్సాహం మరియు సదుపాయాల కల్పన) చట్టాన్నిఅమల్లోకి తీసుకువచ్చింది. రైతులను నేరుగా వినియోగదారులతో కలపడం దీని లక్ష్యం.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: నెరవేరింది
2017లో 146 జిల్లాల్లో మిషన్ పరివార్ వికాస్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జనాభా నియంత్రణపై 2017 జాతీయ హెల్త్ పాలసీ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. కొత్త కాంట్రసెప్టివ్ చాయిస్‌లను ప్రభుత్వం తీసుకొచ్చింది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: నెరవేరింది
2016లో ‘స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్’(స్వయం) పథకాన్ని తీసుకొచ్చారు. ‘మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల’కు అనువైన ఇంటిగ్రేటెడ్ వేదికను అది కల్పిస్తుంది. ఇప్పటిదాకా 1,082 కోర్సులను స్వయంలో పొందుపరిచారు. 25,57,118 మంది వీటిల్లో నమోదు చేసుకున్నారు.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: నెరవేరింది
2014 నవంబరులో ‘ది అప్రెంటిసిస్(అమెండ్మెంట్) బిల్లును పార్లమెంటులో పాస్ చేశారు. అప్రెంటీస్‌షిప్‌ను యువత, పరిశ్రమకు మరింత చేరువ చేసేందుకు దీన్ని తీసుకొచ్చారు. దీనివల్ల యాజమాన్యానికి ఎక్కువ హక్కులు కల్పించినట్లవుతుందని కొందరు అభ్యంతరాలు తెలిపారు. ఇందులోని అంశాలను అమలు చేయకపోతే తీసుకునే చర్యలు కూడా పరిమితంగానే ఉన్నాయి.
వర్గం: మైనారిటీలు స్థితి: నెరవేరింది
ఆ ప్రాజెక్టుపై 2017 డిసెంబరులో పని మొదలైంది. 12 మంత్రిత్వ శాఖలు దానిపై కసరత్తు చేశాయి. నిర్దేశించిన
వర్గం: మైనారిటీలు స్థితి: నెరవేరింది
2014లో గిరిజనుల సంక్షేమం కోసం వన్‌బంధు కల్యాణ్ యోజన్ (వీకేవై)ను ప్రభుత్వం ప్రారంభించింది.
వర్గం: మైనారిటీలు స్థితి: నెరవేరింది
దేశంలోని గిరిజన సంక్షేమ పథకాల కోసం 2015లో రూ.4792.19 కోట్లు కేటాయించారు. 2017లో అది రూ.5,300.14 కోట్లకు పెంచారు. గిరిజన ఉప ప్రణాళిక కింద ప్రభుత్వం 2018లో రూ.37,802.94 కోట్లు కేటాయించింది.
వర్గం: మైనారిటీలు స్థితి: నెరవేరింది
2016లో ప్రకృతి విపత్తుల నష్ట నివారణపై జరిగిన ఆసియా మంత్రుల సదస్సును ప్రధాన మంత్రి ప్రారంభించారు.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: నెరవేరింది
దేశీయంగా ప్రభుత్వ, ప్రైవేటు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ద్వారా వస్తు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 2018లో ప్రభుత్వం రక్షణ ఉత్పత్తుల ముసాయిదాను విడుదల చేసింది. రక్షణ పరికరాల సేకరణ కోసం 2015-17 దేశీయ సంస్థలతో 99 ఒప్పందాలు, విదేశీ సంస్థలతో 61 ఒప్పందాలు జరిగాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు రక్షణ కొనుగోళ్ల విధానం (డీపీపీ)లో అనేక మార్పులు జరిగాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబుడుల (ఎఫ్‌డీఐ) విధానాన్ని సవరించారు.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: నెరవేరింది
2016లో ఐఐటీ గువహాటిలో సెంటర్ ఫర్ రూరల్ టెక్నాలజీ ఏర్పాటు చేశారు. మానవ వనరుల శాఖ 2014లో “ఉన్నత్ భారత్ అభియాన్’’ ను ప్రారంభించింది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎస్ఈఆర్ లాంటి ఉన్నత విద్యా సంస్థలను సాంకేతికత సాయంతో స్థానిక ప్రజలతో అనుసంధానం చేసి, అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేసే ఉద్దేశంతో 2018లో ఆ పథకాన్ని సంస్కరించారు.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: నెరవేరింది
రక్షణ వ్యవహారాలకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవేశాన్ని సరతరం చేయటం, పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం, ఎగుమతుల సరళీకరణ వంటి విషయాల్లో కొన్ని చర్యలు చేపట్టింది. దేశీయంగా నిర్మాణ ప్రణాళిక, అభివృద్ది, ఉత్పత్తి పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మెక్ ఇన్ ఇండియా విధానానికి అనుగుణంగా 2016లో రక్షణ ఉత్పత్తుల సేకరణ విదానాన్ని సవరించినది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: నెరవేరింది
2018 జులై లో ఒక రాంకు ఒక పెన్షన్ విధానాన్ని ప్రకటించి 2014 జులై ఓకటో తేదీ నుండి అమల్లోకి తెచ్చే విధం గా చేసింది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: నెరవేరింది
2018 నవంబర్ లో పారిస్ పర్యటన సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మొదటి ప్రపంచ యుద్ధం లో చనిపోయిన భారతీయ సైనికుల స్మారక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద నేషనల్ వార్ మెమోరియల్‌ను 2019 ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: నెరవేరింది
శాస్త్రీయ పరిశోధనల గురించి ప్రచారం చేసేందుకు ప్రభుత్వం ఫిస్ట్, పర్స్, క్యూరీ, సైఫ్ లాంటి కార్యక్రమాలు చేస్తోంది. శాస్త్ర, సాంకేతికతలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వం 2019 జనవరి 15న డీడీ సైన్స్, ఇండియా సైన్స్ ఛానళ్లను ప్రారంభించింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
40 శాతం గ్రామీణ జనాభా కు డిజిటల్ అక్షరాస్యత కల్పించే లక్ష్యం తో 2017లో ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ ను ప్రారంభించింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
2015లో మొదలైన కౌశాలాభివ్రుద్ధి సంస్థ 500 మిలియన్ల మందికి 2022 నాటికి ఇవ్వాలన్న లక్ష్య సాధన లో ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
బాంకులు పోస్టాఫీసుల్లో పొదుపు చేసిన నిధి పై వచ్చే ఆదాయంలో పది వేల వరకు ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపు ను యాభై వేలకు పెంచింది. ఈ డిపాజిట్ల ద్వారా యాభై వేల లోపు ఆదాయం పొందుతున్న వారు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 19ఎ కింద పన్ను దాఖల పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఇదే వెసులుబాటును ఇతర డిపాజిట్లు మీద వచ్చే ఆదాయానికి కూడా వర్తింప చేసింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
మోడీ ప్రభుత్వం 2016-2017 ఆర్ధిక సంవత్సరం లో 396 వృద్ధాప్య కేంద్రాలకు నిధులు విడుదల చేసింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
1995 నాటి వికలాంగుల చట్టాన్ని 2016 లో వికలాంగుల హక్కుల చట్టం గా సవరించింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం 2015 లో ఎస్పైర్ పథకం ప్రారంభించింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
వికలాంగుల తో సహా అందరికీ బోధన, అధ్యయనం అందుబాటులోకి తెస్తూ స్వయం పేరుతొ ఓ పథకాన్ని ప్రారంభించింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
కేంద్ర ప్రభుత్వ వికలాంగుల సాధికార సంస్థ, అధార్ సంస్థతో కలిసి వికలాంగులకు సంబంధించిన అన్ని వివరాలు తో కూడిన సార్వత్రిక గుర్తింపు, వికలాంగుల ధృవీకరణ పత్రం రూపొందిన్చేదుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
1961 ఆదాయపు పన్ను చట్టం లో సెక్షన్ 80 డిడి ప్రకారం వికలాంగులు ఉన్న కుటుంబాలకు రు. 100000 ఆదాయం మీద పన్ను మినహాయింపు ఉంది. ఈ మినహాయింపును 2015 ద్రవ్య బిల్లులో రు.1250000 కి పెంచింది. అయితే ఈ మినహాయింపు వికలంగత్వం తీవ్రత ఆధారం గా నిర్ణయించ బడుతుంది అత్యంత వికలాంగులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
అంతర్జాతీయ క్రీడల్లో మేడళ్ళు సంపాదించిన క్రీడాకారులకు పించను ఇవ్వాలని 2017 మార్చ్ లో నిర్ణయించింది. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు పించను ఇచ్చే క్రీడా నిధి ద్వారా ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఇచ్చె పించను రెట్టింపు చేస్తూ కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఫిబ్రవరి 2018 లో నిర్ణయించారు.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
2018 లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జాతీయ క్రీడా ప్రతిభ సెర్చ్ పోర్టల్ ని ప్రారంభించారు.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
కేంద్ర బడ్జెట్ లో 2017లో 1938.16 కోట్ల రూపాయలు క్రీడల మంత్రిత్వ శాఖకు కేటాయించగా 2018 బడ్జెట్ లో 2196.36 కోట్ల రూపాయలు కేటాయించింది
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
2014-2015 కేంద్ర బడ్జెట్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా డిసెంబరు 2014లో జాతీయ యువ నేతల కార్యక్రమం పథకాన్ని ప్రారంభించి వివిధ రాష్ట్రాలకు నిధులు కూడా కేటాయించింది.
వర్గం: మహిళలు స్థితి: నెరవేరింది
2015 -2016 మధ్య మొత్తం పోలీసు విభాగాల్లో 123000 మంది గా ఉన్న మహిళా పోలీసుల సంఖ్య 140000 కి పెరిగింది. అయినా మొత్తం పోలీసు బలగాల్లో మహిళలు ఎనిమిది శాతాన్ని మించి లేరు. అది కుడా ప్రధానంగా దిగువ శ్రేణి సిబ్బంది లో ఉన్నారు.
వర్గం: మహిళలు స్థితి: నెరవేరింది
లైంగిక వేధింపులు ఇతర అత్యాచారాల బాదితులు అయిన మహిళలకు నష్ట పరిహారం ఇచ్చే పథకం 2018లో ప్రారంభించ బడింది. అత్యాచారాలు, యాసిడ్ దాడులు, హింస, గృహ హింస వంటి వాటిల్లో నష్ట పోయిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.
వర్గం: మహిళలు స్థితి: నెరవేరింది
లైంగికదాడికి గురైన వారికి మద్దతుగా నిలిచేందుకు 2018లో ప్రభుత్వం నష్టపరిహారం కింద ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేసింది. అత్యాచారం, ఆమ్లదాడి, వేధింపులు, గృహహింసకు గురైన బాధితులకు మద్దతుగా నిలిచేలా ఈ పథకాన్ని ప్రారంభించారు.
వర్గం: మహిళలు స్థితి: నెరవేరింది
గర్భిణులకు, శక్తిహీనంగా ఉన్న మహిళలకు ఆర్ధిక సాయం అందించటానికి కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం 2017 జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది.
వర్గం: మహిళలు స్థితి: నెరవేరింది
ప్రధాన మంత్రి కౌశల వికాస్ యోజన పథకం అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఈ పథకం ప్రారంభించాక మొత్తం 17..72లక్షల మందికి మహిళ యజమానులకు శిక్షణ ఇచ్చింది. ప్రత్యేకించి ఈ పథకం మొదటి దశ లో (2015-2016) 8.63లక్షల మందికి శిక్షణ ఇచ్చాము.
వర్గం: మహిళలు స్థితి: నెరవేరింది
భారత ప్రభుత్వం ఉమంగ్ అనే యాప్ అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా స్కాలర్షిప్ లు, మహిళల భద్రత, వైద్య స్సేవలు, ఎలక్ట్రానిక్ జిల్లా, పాస్ పోర్ట్ సేవలు వంటివి అన్నీ అందుబాటులోకి తెచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే షుమారు వంద సేవలు ఒకే వేదిక ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ను పన్నెండు భాషల్లో వాడుకోవచ్చు.
వర్గం: మహిళలు స్థితి: నెరవేరింది
పతనమవుతున్న లైంగిక నిష్పత్తి ని నిలబెట్టడానికి, మహిళల సాధికారత పట్ల అవగాహన కల్పించటానికి, బాలికల లకు విలువ ఇచ్చేందుకు బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని 2015 లో ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకానికి 2014-2015 లో 1337.49 లక్షలు కేటాయించగా 2017-2018 నాటికి (తాత్కాలిక అంచనాలు) ఈ నిధులు 3298. 84 లక్షలకు పెరిగాయి.
వర్గం: మహిళలు స్థితి: నెరవేరింది
స్వయం సహాయ బృందాలకు ఇచ్చే రుణాల మీద వడ్డీ మినహాయింపు ఇస్తున్నట్టు రిజర్వు బ్యాంకు ఆగస్టు 2016 లో ప్రకటించింది. ఈ నిర్ణయం వాళ్ళ దాదాపు 250జిల్లాల్లో మహిళల నాయకత్వం లో ఉన్న స్వయం సహాయ బృందాలకు వడ్డీ భారం ఏదు శాతనికి పరిమితం కానుంది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు మాత్రమె పరిమితం అవుతుంది. దీన దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి సౌకర్యాల మిషన్ పరిధిలోకి వస్తుంది.
వర్గం: మైనారిటీలు స్థితి: నెరవేరింది
ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్‌ను కొనసాగిస్తోంది. నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్‌ను కూడా కొనసాగిస్తోంది. ఖరీఫ్, రబీ పంటలకు ఎమ్‌ఎస్‌పీలను కూడా 2018-19 కాలానికి పెంచింది.
వర్గం: మహిళలు స్థితి: నెరవేరింది
2018 సెప్టెంబర్ లో కేంద్ర ఆర్దిక శాఖ అంగన్ వాడి, ఆషా వర్కర్లకు యాభై శాతం జీతాలు పెంచుతూ నిర్ణయించింది. ఈ నిర్ణయం అదే సంవత్సరం అక్టోబర్ నుండీ అమల్లోకి వచ్చింది.
వర్గం: మహిళలు స్థితి: నెరవేరింది
2018 మార్చ్ 8 న ఉదయం సాక్షి పేరుతొ ఓ ఆన్లైన్ పోర్టల్ ని ప్రారంభించింది. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించటం ఈ పోర్టల్ లక్ష్యం.
వర్గం: మహిళలు స్థితి: నెరవేరింది
లైంగిక నిష్పత్తి పెంచటం, బాలికల విద్యను ప్రోత్సహించటం వంటి లక్ష్యలతో బేటీ బచావో బేటీ పదావో పథకాన్ని కేంద్రం 2015లో ప్రారంభించింది
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
వికలాంగుల ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది, రిజర్వేషన్లను 3 నుంచి 4 శాతానికి పెంచింది. ఆటిజమ్, డౌన్ సిండ్రోమ్ లాంటి వాటితో బాధపడేవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: నెరవేరింది
స్కిల్ ఇండియా కింద గత మూడేళ్లలో రెండున్నర కోట్ల మంది శిక్షణ ఇచ్చారు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: నెరవేరింది
మనుషులు లేని రైల్వే క్రాసింగ్ ల సంఖ్యను సెప్టెంబర్ 2018 నాటికి 13౦౦ కి తగ్గించాము. ఆర్నెల్ల క్రితం ఈ సంఖ్య 3400 గా ఉండేది. కొన్ని రైల్వే క్రాసింగ్ ల వద్ద కార్మికులను నియమించటం, మరికొన్ని క్రాసింగ్ లను పూర్తిగా రద్దు చేయటం ద్వారా ఈ సంఖ్యను తగ్గించగలిగాము. మనుషుల్లేని చివరి రైల్వే క్రాసింగ్ ను 2019 జనవరి నాటికి పూర్తి చేయగలిగాము.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: నెరవేరింది
జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 2015 లో జారీచేసిన జి ఎస్ 412 (ఈ) ఆదేశాల ద్వారా ఎత్నాల్ మరియు ప్లేక్సి ఇంధనం ఎత్నాల్ లు వినియోగించే వాహనాలకు బొగ్గుపులుసు వాయువు విడుదలకు సంబంధించి పరిమితులు నిర్ధారించింది. భారీ పరిశ్రమల శాఖ ఫేం ఇండియా పథకం (మిశ్రమ సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీకి సత్వర ఏర్పాట్లు ) మొదటి దశ అమలు చేస్తోంది. ఈ పథకం లో ఆదిన మిశ్రమ సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ పై కేంద్రీకరించటం లక్ష్యం.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: నెరవేరింది
హరిత గృహ నిర్మాణాలకు జాతీయ రేటింగ్ వ్యవస్థ గృహ (జీఆర్ఐహెచ్ఏ – గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటాట్ అసెస్మెంట్) ను టెరి (టీఈఆర్ఐ) అభివృద్ధి చేసింది. గృహకు తాజా వర్షన్‌ను జనవరి 2015లో ప్రవేశపెట్టారు. ‘పట్టణాలకు గృహ’ (గృహ ఫర్ సిటీస్) రేటింగ్ 2018లో పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం ఓ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించింది. ఎనర్జీ ఎఫిషియెంట్ భవనాల నమూనా, నిర్మాణంపై 2017లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. హరిత నిర్మాణాలను ప్రోత్సహించడానికి గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నమూనా భవనాలకు సంబంధించిన అనుబంధ నిబంధనలు (మోడల్ బిల్డింగ్ బై లా)ను 2016లో విడుదల చేసింది.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: నెరవేరింది
గనులు ఖనిజ వనరుల చట్టం 1957 ను 2015 లో సవరించాము. 2015లో గనుల మంత్రిత్వ శాఖ గనుల వేలానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనలు 2017 లో మరో సరి సవరించాము. పునరుద్ధరణ కు వీలైన ఇంధన వనరుల కేటాయింపు పారదర్శకమైన పద్దతిలో రివర్స్ వేలం రూపం లో వేలం వేయనున్నారు.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
ఐదేళ్లకు పైగా అపరిష్కృతంగా ఉన్న కేసులు విచారించి ఖరారు పరచటానికి 24 హైకోర్టులలో ఎర్రియర్స్ కమిటీలను 2015లో ఏర్పాటు చేసాము. 2017 లో న్యాయమిత్ర పథకాన్ని కూడా ప్రారంభించాము. ఈ పథకం కింద పదేళ్లకు పైగా అపరిష్కృతంగా ఉన్న కేసులు విచారించి ఖరారు పరచటానికి పదవీ విరమణ చేసిన న్యాయాధికారులను న్యాయ మిత్రాలు గా నియమించవచ్చు. న్యాయ వ్యవస్థ లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 1993-94 లో మొదలైన కేంద్ర ప్రభుత్వ పథకం కింద 13 ఫిబ్రవరి 2019 నాటికి 6670.12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఈ పథకం కింద 2014 నాటికి 15818 న్యాయస్థాన భవనాలు నిర్మించగా 13 ఫిబ్రవరి 2019 నాటికి ఈ సంఖ్య 18796 కి చేరింది. మరో 2925 భవనాలు నిర్మాణం లో ఉన్నాయి. మరో 3320 కోట్ల రూపాయలు కేటాయింపులు పెంచి ఈ పథకాన్ని 2017-2020 వరకు కొంసగించేందుకు కేంద్రం నిర్ణయించింది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
2018 లో ప్రారంభించిన జాతీయ డిజిటల్ గ్రధాలయం పథకం, 2016 లో ప్రారంభించిన యువజనులు ఆకాంక్ష కలిగిన మేధస్సుకు పదును పెట్టేందుకు డిజిటల్ అవకాసం (స్వయం) ద్వారా పెద్దగా ఖర్చు లేకుండా నేర్చుకోవటానికి అవకాశం వచ్చింది. మెట్రిక్, మెట్రిక్ అనంతర చాడువులుకు విద్యార్ధులకు స్కాలర్షిప్ లు అంద చేస్తుంది. విద్యార్ధులకు ఉచితంగా అందుబాటులో ఉండే విద్యా వనరులలో ఈ గవర్నేన్స్ పోర్టల్స్ ద్వార వచ్చే సమాచారం కూడా అందుబాటులో ఉంది. అయితే కేవలం విద్యార్ధులకు మాత్రమే పరిమితం అయినవి కాదు. అందరికీ అందుబాటులో ఉండేవే.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2018 లో డిజిటల్ గ్రామం కార్యక్రమాన్ని ఆమోదించింది. టెలి మెడిసిన్, టెలి విద్య, ఎల్ ఇ డి లైట్లు వై ఫై హాట్‌స్పాట్, ఎంపిక చేసిన గ్రామాల్లో నైపున్యాభివ్రుద్ది, వంటి పనులు ఈ కార్యక్రమం లో భాగం. ముప్పై రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలోని 1050 గ్రామాల్లో ఈ పథకం అమలు కాబోతోంది. 2017-2018 సంవత్సరానికి గాను ఈ కార్యక్రమం లో భాగం గా టెలి వైద్యం అమలు చేయటానికి 12.95 కోట్లు వెచ్చించింది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
గుజరాత్ లో అన్ని గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ ఏర్పాటు చేసే ఈ గ్రామ్ విశ్వ గ్రామం పథకం 2003 లో మొదలైంది. దాదాపు రెండున్నర లక్షణ గ్రామాలని బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేసే 2017 లో భారత్ నెట్ రెండో దశమొదలైంది. (2011 ఈ పథకం జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పథకం గా మొదలైంది)
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఉపయోగించటానికి సంబంధించి ఓ విధానాన్ని 2015 లో ప్రకటించింది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: నెరవేరింది
ప్రకృత్తి విపత్తుల నిర్మూలన కోసం టెక్నికల్ సపోర్ట్‌ను ఇస్రో అందిస్తోంది. 2008 నుంచి ప్రభుత్వం వాతావరణ మార్పులపై నేషనల్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తోంది. కొండ చరియలు విరిగిపడటంపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాలు చేస్తోంది. 2014-15 నుంచి జీఎస్ఐ ఈ అంశంపై ఓ జాతీయ స్థాయి యాక్షన్ ప్లాన్‌ను నిర్వహిస్తోంది.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
2015 లో ఆమోదించిన వాణిజ్య న్యాయ స్థానాలు, హైకోర్టులలో వాణిజ్య వివాదాలు విచారించే ప్రత్యెక బెంచీలు, అప్పిలేట్ డివిజన్ బెంచి బిల్లు 2018 లో సవరించాము. జిల్లా స్థాయిలో వాణిజ్య న్యాయ స్థానాలు, హైకోర్టు స్థాయిలో ప్రత్యెక బెంచీలు ఏర్పాటుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. 2017 డిసెంబరు నాటికి వివిధ జిల్లాల్లో 247 వాణిజ్య న్యాయస్థానాలు ఏర్పడ్డాయి.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
ఉద్యోగుల భవిష్య నిధి కార్మికుల బ్యాంకు ఏర్పాటు చేసే విషయాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ఉపాధి కార్మిక మంత్రిత్వ శాఖ ఓ కమిటీ ని నియమించింది. ఆ తర్వాత దీనికి సంబంధించి అదనపు. సమాచారం ఏమీ లేదు.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
ప్రస్తుతానికి 16788 కిలోమీటర్ల నిడివి లో గాస్ పైప్ లైన్ నిర్మాణం పూర్తి అయింది. దేశ వ్యాప్తంగా సహజ వాయువు అందుబాటులోకి తెచ్చే విధంగా నిర్మించ తలపెట్టిన జాతీయ సహజ వాయు గ్రిడ్ లో భాగంగా మరో 13105 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకుంది. ఈశాన్య భారతం లో గాస్ గ్రిడ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఐదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో అవగాహన కుదుర్చుకుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత గాస్ కనెక్షన్ అందించేందుకు 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ప్రారంభించాము.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
జాతీయ రహదారుల సంస్థ, ఇతర ప్రభుత్వ సంస్థలు జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టాయి. భూసేకరణ, పర్యావరణ అనుమతులు, ఈక్విటీ పెట్టుబడి పెట్టిన వాళ్ళు బయటకు వెళ్లాలంటే వెళ్లే అవకాశాన్ని ఇవ్వటం, వివాద పరిష్కార వ్యవస్థలను సారి చేయటం, వివిధ దశల్లో సమీక్షలు వంటి చర్యలున్నాయి.
వర్గం: పరిపాలన స్థితి: నెరవేరింది
2017లో భారత్ నెట్ ప్రాజెక్ట్. రెండో దశను ప్రభుత్వం ప్రారంభించింది. (2011లో ఈ ప్రాజెక్ట్ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ గా పిలవబడేది). అన్ని పంచాయతీ లను ఇంటర్నెట్ తో అనుసంధానం చేయటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. గ్రామ పంచాయతీల్లో వైఫై హాట్‌స్పాట్ కూడా ఏర్పాటు చేసేందుకు ఈ ప్రాజెక్టు అవకాశం కల్పిస్తుంది. మార్చి 3, 2019 నాటికి లక్ష పంచాయతీల్లో వైఫై ఏర్పాటు చేయాలని నిర్ణయించగా 41139 గ్రామాల్లో ఏర్పాటు చేసాము.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: నెరవేరింది
2016 జనవరిలో స్వచ్ఛ భారత్‌ను పర్యవేక్షించేందుకు స్వచ్ఛ్ సర్వేక్షన్ మొదలుపెట్టారు.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: నెరవేరింది
2017లో పోషణ్ అభియాన్‌ను ప్రవేశపెట్టారు
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: నెరవేరింది
2018లో ప్రభుత్వం బిగ్ డాటా, అనలటిక్స్ కోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ)ను ప్రారంభించింది. ప్రభుత్వం కూడా పైలట్ కార్యక్రమం కింద బిగ్ డాటా, అనలటిక్ ప్రోగ్రాంను తీసుకుంది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
56% జనాభాకు పైపుల ద్వారా నీళ్లు అందుతున్నాయని “సాధించదగిన అభివృద్ధి లక్ష్యాలు” పురోగతిపై ప్రభుత్వం 2018లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్ఆర్డబ్ల్యూడీపీ) ద్వారా ఇది సాధ్యమైంది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
ప్రస్తుతానికి ముంబయి - అహమ్మదాబాద్ రైల్ కారిడార్ ఒక్కటే హై స్పీడ్ రైలు నడపడానికి ఎంపిక చేయబడింది. అయితే మరో 6 కారిడార్లపై అధ్యయనం జరుగుతోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్ కతా రూట్లలో కూడా హై స్పీడ్ రైళ్ళను నడపడంపై సాధ్యాసాధ్యాల పరిశీలన జరుగుతోంది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
ఏకీకృత సివిల్ కోడ్ (యూసీసీ) అమలు సాధ్యాలపై అధ్యయనం చేయాల్సిందిగా 2016 జులైలో లా కమిషన్ ప్యానల్‌ను ప్రభుత్వం కోరింది. యూసీసీ అవసరం లేదని 2018లో లా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఓ ఆర్డినెన్స్ సహాయంతో ముమ్మారు తలాక్ బిల్లును బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
ఎం.ఎస్.ఎం.ఇ లు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడగలిగేలా సహాయం చేసే పాత పథకాలను కొనసాగిస్తూనే ఎగుమతులను పెంచేందుకు ఆర్ధికంగా కూడా సహాయం చేసే చర్యలు చేపట్టారు. 12 వ వార్షిక ప్రణాళికలో ఇందుకోసం 24 కోట్లు కేటాయించారు. ఈ రంగంలోని ఎగుమతిదారులకు కొత్త ప్రభుత్వం 2015 లో వడ్డీ ఈక్వలైజేషన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. వారు ప్రపంచ మార్కెట్లలో పోటీ పడేలా చేయగలగడమే దీని లక్ష్యం.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సూక్ష్మ, చిన్న పరిశ్రమల నుండి ఎంతమేరకు కొనుగోళ్ళు చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రభుత్వం డిసెంబర్ 2017 లో ‘ఎం ఎస్ ఎం ఇ సంబంద్’ అనే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ను ప్రారంభించింది. 2012 లో అమల్లోకి వచ్చిన ప్రొక్యూర్మెంట్ విధానం ప్రకారం అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏడాది ఆరంభంలోనే సూక్ష్మ, చిన్న పరిశ్రమల నుండి ఎంతమేరకు కొనుగోళ్ళు చేయనున్నాయో నిర్దిష్టంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. 2016 లో ప్రభుత్వం ఈ విధానం అమలును పరిశీలించినపుడు వారి నుండి కనీసం 20 శాతం కొనుగోళ్ళు చేయాల్సి ఉండగా ఆయా శాఖలు, సంస్థలు కేవలం 10 శాతం మాత్రమే కొనుగోళ్ళు జరిపినట్టు కనుగొంది. స్త్రీల యాజమాన్యంలో ఉన్న సూక్ష్మ, చిన్న పరిశ్రమల నుండి 3 శాతం కొనుగోళ్ళు జరపాలని ప్రభుత్వం కొత్తగా 2018 నవంబర్ 9 వ తేదీన ఆదేశాలు జరీ చేసింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
2018 లో రైల్వే శాఖ ప్రమాదాల నివారణకు, రైల్వే భద్రతకు 4 కార్యక్రమాలు చేపట్టింది. 2018-19 నుండి పూర్తి స్థాయిలో ఎల్.హెచ్.బి డిజైన్ కోచ్ ల తయారీకి మారిపోవాలని నిర్ణయించింది. గత ఏడాదితో పోల్చితే 2017-18 లో రైలు ప్రమాదాలు 104 నుండి 73 కు తగ్గాయి. రైల్వేలో భద్రతను పెంచడానికి 2017 నుండి ‘రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ నిధి’ని ఏర్పాటు చేసారు. దీని కింద ఐదేళ్ళలో లక్ష కోట్లు ఖర్చు పెట్టుకోవచ్చు.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
2006 లోనే ప్రభుత్వం నేషనల్ ఇ-గవర్నెన్స్ ప్లాన్ ను ఆమోదించింది. ప్రజలకు అన్ని ప్రజా సేవలు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందుబాటులోకి తీసుకురావడం దీని ధ్యేయం. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం కింద 31 మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ కొనసాగిస్తోంది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యాలు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు 2010 నుంచి జాతీయ పురస్కారాలు ఇస్తోంది. ఈ అవార్డుల కోసం 2014లో 451 దరఖాస్తులు వచ్చాయి. 2016లో 939 దరఖాస్తులు వచ్చాయి.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) మంత్రిత్వ శాఖ ఆయా పరిశ్రమలు నెలకొల్పే వారి సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు మొదలైన వాటిని పెంపొందించడానికి సూక్ష్మ, చిన్న పరిశ్రమల క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎం ఎస్ ఇ-సి డి పి) ను అమలు చేస్తోంది. వారు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునేందుకు వీలుగా రుణంతో అనుసంధానించబడ్డ పెట్టుబడి సబ్సిడీ పథకాన్ని కొనసాగిస్తూ 15 శాతం సబ్సిడీ ఇస్తోంది. వారికి సాంకేతిక సహాయం చేసేందుకు ‘టెక్నాలజీ సెంటర్ సిస్టమ్స్ ప్రోగ్రాం’ కింద టెక్నాలజీ సెంటర్లను కూడా ప్రారంభించింది. ఈ రంగంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వాడకాన్ని, ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ ను పెంచేందుకు బీజేపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శక సూత్రాలను కూడా జారీ చేసింది. వారి సాంకేతిక పరిజ్ఞానం వాడకాన్ని పెంచేందుకు టెక్నాలజీ అండ్ క్వాలిటీ అప్ గ్రెడేషన్ ప్రోగ్రాం, నేషనల్ మ్యానుఫాక్చరింగ్ కాంపిటిటివ్ నెస్ ప్రోగ్రాం (NMCP) కింద డిజైన్ క్లినిక్ స్కీమ్ మరియు ఇంక్యుబేషన్ స్కీమ్ లను కూడా అమలు చేస్తోంది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
ఉపాధ్యాయులు, యూనివర్సిటీలు, కాలేజీల్లోని అకడమిక్ సిబ్బంది నియామకాల్లో కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు 2018 ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించింది. ఈ నిబంధనల ప్రకారం... యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు పీహెచ్డీ డిగ్రీ తప్పనిసరి. యూనివర్సిటీల్లోని వివిధ సిబ్బందికి పదోన్నతులకు కూడా కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
కేవలం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎం.ఎస్.ఇ లకు) మాత్రమే రుణాలిచ్చే బ్యాంకును ఏర్పాటు చేయలేదు. కాని వారికి రుణ సదుపాయం సులభంగా అందేలా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కలిసి అనేక చర్యలు తీసుకున్నాయి. ఏటా 20 శాతం చొప్పున పెంచుకుంటూ వాటికి రుణ సదుపాయం కల్పించాలని, అడ్వాన్స్ లలో 60 శాతం మైక్రో ఎంటర్ ప్రైజ్ ఖాతాలకు కేటాయించాలని, ఈ ఖాతాల సంఖ్యను ఏటా 10 శాతం చొప్పున పెంచాలని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు సూచించారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక ఎం.ఎస్.ఇ బ్రాంచ్ ను తెరవమని కూడా సూచించారు. వాయిదా చెల్లింపులలో ఆలస్యం వంటి సమస్యల పరిష్కారానికి ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టం ఏర్పాటు చేసారు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
ప్రపంచ బ్యాంకు ప్రకారం, వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూలతల విషయంలో భారత ర్యాంకు 2018తో పోల్చితే 7 శాతం పెరిగి 2019లో 80.96కు చేరింది. ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకాన్ని 2015 నుంచి సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు వర్తింపజేస్తున్నారు. 2015లో 4857.68 కోట్లు మంజూరు చేశారు. 2017లో అది రూ.9459.97 కోట్లకు పెంచారు. జీఎస్టీ ప్రభావం చిన్న వ్యాపారులపై అధిక ప్రభావం పడింది. కానీ, సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తన విధానాల్లో అనేక మార్పులు చేస్తోంది.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: పురోగతి ఉంది
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2018 లో ఎఫ్.డి.ఐ పాలసీని మరింత పెట్టుబడి వాత్సల్యంగా మార్చింది. 2013-14 లో ఇండియా 36,046 మిలియన్ల యుఎస్ డాలర్లు విలువ చేసే విదేశీ పెట్టుబడిని పొందితే 2017-18 నాటికి (తాత్కాలిక అంచనాల ప్రకారం) అది 61,963 మిలియన్ల డాలర్లకు చేరింది. 2014 లో ప్రభుత్వం పెట్టుబడులను, నైపుణ్యాలను, కొత్త ఆలోచనలను ప్రోత్సహించడానికి ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రారంభించింది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
2018 నవంబర్‌లో స్కూల్ బ్యాగుల బరువు నియంత్రణపై కొన్ని మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు (HRD) విడుదల చేశారు.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
మదర్సాలకు నాణ్యమైన విద్యను అందించే పథకాన్ని(SPQEM) దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఆ పథకం ద్వారా మదర్సాలు, మక్తబ్ల లాంటి సంప్రదాయ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ ఆర్థిక సాయం అందిస్తారు. సైన్స్, మ్యాథ్స్ లాంటి ఆధునిక విద్యను కూడా ప్రవేశపెడతారు. కానీ, ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం మొదలుపెట్టలేదు. 2014లో ఈ పథకం ఆధునికీకరణ కోసం రూ.100కోట్లను కేటాయించారు. కానీ, ఇందులో పనిచేస్తున్న టీచర్లకు జీతాలు సమయానికి రావట్లేదని వాళ్లు కొంత కాలంగా ఫిర్యాదు చేస్తున్నారు.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
2015లో బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని మొదలుపెట్టారు. బాలికల విద్య, పడిపోతున్న బాలికల లింగ నిష్పత్తి అంశాలపై ప్రధానంగా ఈ పథకం దృష్టిపెడుతుంది. 2009-10తో పోలిస్తే పాఠశాలలో నమోదు చేసుకునే బాలికల సంఖ్య పెరిగిందని 2018లో రాజ్యసభలో ఓప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం చెప్పింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
చైనా (2.05 శాతం), కొరియా (4.29 శాతం), జపాన్ (3.58), యు.ఎస్.ఎ (2.73 శాతం) లతో పోల్చితే భారతదేశం తన జిడిపి లో 0.70 శాతం మాత్రమే పరిశోధనలకు ఖర్చు పెడుతుంది. సామాజిక అవసరాలకు అనుగుణమైన పరిశోధనలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2014 లో ‘ఇమ్పాక్టింగ్ రిసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ’ (IMPRINT), 2015 లో ‘ఉచ్చతర్ ఆవిష్కార్ యోజన’ (UAY) పేరుతో కొత్త పథకాలు ప్రారంభించింది. ‘ ఇంప్రింట్’ ఉన్నత విద్యా సంస్థలలో పరిశోధనలపై దృష్టి పెడితే, యుఎవై పరిశ్రమ ప్రాయోజిత పరిశోధనలకు సహాయం చేస్తుంది. ‘ఇంప్రింట్’ కింద 2016-17 నుండి 2019-20 వరకు ఖర్చు చేయడానికి రూ.487 కోట్లు కేటాయించారు. యుఎవై కింద రెండేళ్లలో ఖర్చు చేయడానికి రూ.475 కోట్లు కేటాయించారు. బీజేపీ ప్రభుత్వం 2014 లో నేషనల్ మ్యానుఫాక్చరింగ్ కాంపిటిటివ్ నెస్ ప్రోగ్రాంను ప్రకటించింది. దీనిలో భాగంగా ప్రభుత్వం తయారీ రంగంలో పోటీ స్పూర్తిని పెంచడానికి అనేక పథకాలను అమలుపరిచింది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
తమ కొత్త జాతీయ విద్యా పాలసీ (ఎన్ఈపీ) సిద్ధంగా ఉందని దాన్ని త్వరంలో ప్రభుత్వానికి సమర్పిస్తామని 2018 డిసెంబర్లో కేంద్ర మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఉద్దేశంతో తీసుకొచ్చిన మిషన్ ఇంద్రధనుష్ అనేది ఎన్డీఏ ప్రభుత్వ అమ్ములపొదిలోనే కీలక అస్త్రం అంటారు. 2014 నుంచి నాలుగు విడదల్లో వ్యాక్సీన్లు ఇవ్వడం ద్వారా 2.53కోట్ల మంది పిల్లల, 68 లక్షల మంది గర్భిణుల జీవితాలను అది ప్రభావితం చేసింది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
భారతీయ వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఓ కొత్త బిల్లు ముసాయిదాను 2019, జనవరి 7న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆయుష్ వార్షిక నివేదికల ప్రకారం 2016 నుంచి అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ల స్థాయిలో సీసీఐఎం నిర్దేశించిన కోర్సుల సంఖ్య 11గానే ఉంది. ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్‌కు అనుబంధంగా ఉన్న యూనివర్సిటీల సంఖ్య 2016లో 47 నుంచి 2017లో 52కు చేరింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
ప్రస్తుత ఎఫ్‌సీఐ విధానం ప్రకారం, ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులు కొన్ని ఎంపిక చేసిన రంగాల్లో నేరుగా 100 శాతం వరకూ పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉంది. 2008లో భారత ప్రభుత్వం ఇండియా డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్స్(ఐడీఎఫ్-ఓఐ) అనే ట్రస్టును ఏర్పాటు చేసింది. విదేశాల్లో పనిచేసే ప్రవాస భారతీయుల కోసం 2017లో ప్రవాసీ భారతీయ బీమా యోజన ప్రారంభించారు.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
కానీ, అలా మిషన్ ఏదీ రాలేదు. కానీ మలేరియా నిర్మూలన కోసం 2016-2030 నేషనల్ ఫ్రేమ్‌వర్క్‌ను 2016లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
అమృత్ ఫార్మసీ స్టోర్ల సంఖ్యను నాలుగు రెట్లు పెంచుతామని 2018లో ఆరోగ్య శాఖ ప్రకటించింది. దానివల్ల 52లక్షల మందికి రోగులకు రూ.267కోట్లకు పైగా ఆదా అయ్యిందని ప్రభుత్వం అంటోంది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
పారిశ్రామిక ఉత్పత్తుల సూచీ ప్రకారం తయారీ రంగంలో 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్-అక్టోబర్ మధ్య 5.6 శాతం (తాత్కాలిక అంచనాల ప్రకారం) పెరుగుదల ఉంది. గత ఏడాది ఇదే కాలంలో పెరుగుదల శాతం 2.1 మాత్రమే ఉంది. దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ‘స్టార్టప్ ఇండియా’, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘ మాడిఫైడ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్ గ్రేడేషన్ స్కీమ్’, ‘బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్’, ‘మేధో హక్కుల విధానం’ వగైరా అనేక కార్యక్రమాలను చేపట్టారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని, ప్రక్రియలను క్రమేణా చాలా సరళతరం చేసారు. 2017 అక్టోబర్ నాటి లేబర్ బ్యూరో త్రైమాసిక ఉపాధి సర్వే ప్రకారం 2017 జూలై-అక్టోబర్ మధ్య తయారీ రంగంలో ఉద్యోగాలు 89,000 పెరిగాయి. చాలా సందర్భాలలో సీజనల్ లేబర్ కారణంగా ఉద్యోగాలు తగ్గుతాయని మంత్రిత్వ శాఖ చెపుతుంది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
1 నుంచి 12వ తరగతి మధ్య ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం ‘ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్’ అనే విభాగాన్ని సమగ్ర శిక్షా పథకం 2018-19లో పొందుపరిచారు. వారికిచ్చే ప్రోత్సాహకాల్ని రూ.3000 నుంచి రూ.3500కు పెంచారు. వాటితో పాటు రాష్ట్రాలు, యూటీలకు ప్రత్యేక ట్యూటర్లను నియమించుకునేందుకు నిధులు కేటాయించారు. వికలాంగుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు 1992లో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్సీఐ)ను నెలకొల్పారు.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
2018 నుంచి ప్రభుత్వం సమగ్ర శిక్ష పథకాన్ని స్కూళ్లలో అమలు చేస్తోంది. సర్వ శిక్ష అభియాన్, టీఈ, ఆర్‌ఎంఎస్‌ఏ లాంటి పథకాల్ని విలీనం చేసి దీన్ని రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన విద్య అందించడం దీని ఉద్దేశం. సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లలో వోకేషన్ విద్య కోసం ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. యూ-డైస్ గణాంకల ప్రకారం 2009లో సెకండరీ విద్య కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్య 62.90శాతంగా ఉంది. 2015 నాటికి అది 80.01 శాతానికి చేరింది. 2017-18 బడ్జెట్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ ఫండ్‌ను కూడా సృష్టించారు.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
ఇంప్రింట్ ఇండియా, ఉచ్చతార్ ఆవిష్కార్ యోజన లాంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వ ప్రవేశపెట్టింది. దేశంలో పరిశోధనా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం వీటిని తీసుకొచ్చింది. పరిశోధనలు ప్రోత్సహించేందుకు అనేక గ్రాంట్లనూ అందిస్తోంది. 9 రీసెర్చ్ పార్కుల ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ 2018లో క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో మూడు యూనివర్సిటిలే టాప్ 200 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: పురోగతి ఉంది
క్యోటో ప్రోటోకాల్ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కాలుష్య ఉద్గారాలను తగ్గించే ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు క్లీన్ డెవలప్మెంట్ మెకనిజం(సీడీఎం)ను రూపొందించారు. భారత ప్రభుత్వం నేషనల్ క్లీన్ డెవలప్మెంట్ మెకనిజం అథారిటీ (ఎన్సీడీఎంఏ)ని ఏర్పాటు చేసింది. 2017 ఫిబ్రవరి వరకు ఈ అథారిటీ 3,011 ప్రాజెక్టులకు అనుమతులిచ్చింది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
ఎంహెచ్ఆర్డి, క్రీడా మంత్రిత్వ శాఖ సహాయంతో ఆరోగ్యం, స్పోర్ట్స్‌కు సంబంధించిన అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. 2018-19లో అన్ని స్కూళ్లలో ఒక తరగతిని వాటికి కేటాయించాలని సీబీఎస్ఈ సిఫార్సు చేసింది. అందులో పాల్గొంటేనే బోర్డు పరీక్షలురాసే అర్హత లభిస్తుంది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
ఎస్టీలకు వివిధ రంగాల్లో ప్రోత్సాహం కల్పించేందుకు 1977 నుంచి ప్రభుత్వం కొన్ని గ్రాంట్లను కల్పిస్తోంది. ‘స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు ట్రైబల్ సబ్ స్కీమ్’లో భాగంగా వీటిని అందిస్తోంది. తొమ్మిదో తరగతిపైన చదివే ఎస్టీ విద్యార్థుల ఖర్చులకు ప్రభుత్వం ఉపకారవేతనాలు అందిస్తుంది. ఐఐటీ, ఐఐఎం లాంటి వాటిల్లో చదివే ఎస్టీ విద్యార్థులకూ ఇది వర్తిస్తుంది. 2017-18లో ఈ పథకం కింద రూ.1,787 కోట్లు విడుదల చేశారు. ఎస్టీ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కూడా ప్రభుత్వం పథకాలను కొనసాగిస్తోంది. కానీ, ఎన్ని పథకాలు ఉన్నప్పటికీ దేశంలో గిరిజనుల అక్షరాస్యత, జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉందని 2018లో స్టాండింగ్ కమిటీ అన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నివేదిక చెప్పింది. మౌలిక వసతుల కల్పన కూడా సరిగ్గా లేదు. ఎకలవ్య మోడల్ రెసిడిన్షియల్ స్కూళ్లలోనూ పరిస్థితి ఇలానే ఉంది. తొమ్మిదో తరగతిపైన చదివే ఎస్టీ విద్యార్థుల ఖర్చులకు ప్రభుత్వం ఉపకారవేతనాలు అందిస్తుంది. ఐఐటీ, ఐఐఎం లాంటి వాటిల్లో చదివే ఎస్టీ విద్యార్థులకూ ఇది వర్తిస్తుంది. 2017-18లో ఈ పథకం కింద రూ.1,787 కోట్లు విడుదల చేశారు.ఎస్టీ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కూడా ప్రభుత్వం పథకాలను కొనసాగిస్తోంది.కానీ, ఎన్ని పథకాలు ఉన్నప్పటికీ దేశంలో గిరిజనుల అక్షరాస్యత, జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉందని 2018లో స్టాండింగ్ కమిటీ అన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నివేదిక చెప్పింది. మౌలిక వసతుల కల్పన కూడా సరిగ్గా లేదు. ఎకలవ్య మోడల్ రెసిడిన్షియల్ స్కూళ్లలోనూ పరిస్థితి ఇలానే ఉంది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
తమ కొత్త జాతీయ విద్యా పాలసీ (ఎన్ఈపీ) సిద్ధంగా ఉందని దాన్ని త్వరంలో ప్రభుత్వానికి సమర్పిస్తామని 2018 డిసెంబర్లో కేంద్ర మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: పురోగతి ఉంది
అత్యధిక రంగాలలో/కార్యకలాపాలలో వంద శాతం పెట్టుబడిని అనుమతించేందుకు వీలుగా కేంద్ర మంత్రిమండలి 2018 లో ఎఫ్.డి.ఐ పాలసీకి సవరణలు చేసింది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
ఎన్ సి సి మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు తాజా పరుస్తున్నాము. తాజాగా 2017లో ఈ విధమైన మార్పులు చేసాము. 2018లో జరిగిన ఓ రాలీ లో పాల్గొన ప్రధాని ఎన్ సి సి డైరెక్టర్ జనరల్ కి కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ సూచనలను ప్రస్తుతం అమలు చేస్తున్నాము. జాతీయ సమగ్రతను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో ప్రధాని ఎక్ భారత్ శ్రేష్ట భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేడేట్స్ తో వీడియో కాన్స్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం, శిక్షణ ట్రైనింగ్ పరిపాలన వ్యవహారాలు వంటి విషయాలలో కూడా ప్రధాని సలహాలిచ్చారు. ఎన్ సి సి సిబ్బంది ఆయుధ ప్రయోగ సామర్ధ్యం పెంపొందించటం కోసమె, రక్షణ వ్యయాన్ని సమతూకం లో ఉంచటం కోసం 2016 లో నియమించిన శేకత్కర్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తున్నాము.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
ఉన్నత విద్యా కమిషన్ బిల్ 2018 ముసాయిదాను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ 1956ను తొలగించి ఉన్నత విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నది దీని ఉద్దేశం.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
ఇంప్రింట్ ఇండియా, ఉచ్చతార్ ఆవిష్కార్ యోజన లాంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వ ప్రవేశపెట్టింది. దేశంలో పరిశోధనా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం వీటిని తీసుకొచ్చింది. పరిశోధనలు ప్రోత్సహించేందుకు అనేక గ్రాంట్లనూ అందిస్తోంది. 9 రీసెర్చ్ పార్కుల ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. క్యూఎస్ ర్యాంకుల్లో చోటు దక్కించుకున్న 24 భారతీయ యూనివర్సిటీల్లో 7 యూనివర్సిటీల ర్యాంకు మెరుగైంది. 9 యూనివర్సిటీల ర్యాంకు స్థిరంగా ఉంది. 5 యూనివర్సిటీలకు కొత్తగా ర్యాంకు దక్కింది. మూడు యూనివర్సిటీల స్థానం పడిపోయింది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
2018 మార్చి 20న 62 విశ్వవిద్యాలయాలు, 8 కాలేజీలకు మోదీ ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కల్పించింది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
కొత్త వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు 2015లో ప్రధాన్ మంత్రి ముద్ర యోజనను తీసుకొచ్చారు.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వ పథకాలు కొనసాగుతున్నాయి. ఈ పథకం రెండో విడతలో భాగంగా 24 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు క్యాబినెట్ కమిటీ 2018లో ప్రతిపాదించింది. ఆ 24లో ఇప్పటిదాకా 13 కాలేజీలకు అనుమతి లభించింది. ఎంసీఐ ప్రకారం 2018 నాటికి ఎంబీబీఎస్ విద్యను అందించే కాలేజీ 492 ఉన్నాయి. వాటిలో 61,580 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాలేజీలతో పాటు సీట్ల సంఖ్యా పెరిగింది. పారామెడికల్ విద్యను నియంత్రించే సరైన వ్యవస్థ లేకపోవడంతో ఆ డేటా అందుబాటులో లేదు.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
ప్రధాన్ మంత్రి స్వాస్య సురక్ష యోజన కింద 21 ఎయిమ్స్ ఏర్పాటును ప్రకటించారు. 2018 నాటికి దేశంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఎయిమ్స్ 8 ఉన్నాయి. ఎయిమ్స్ నాగ్‌పూర్ 2018 నుంచి సేవలందిస్తోంది. గుంటూరు ఎయిమ్స్ తాత్కాళిక భవనంలో సేవలందిస్తోంది. గత ఐదేళ్లలో 15 కొత్త ఎయిమ్స్ ఏర్పాటును ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో 13 ఎయిమ్స్ ఏర్పాట్లకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
చాలా శాఖలు సింగిల్ విండో పద్ధతికి మారే క్రమంలో ఉన్నాయి. ఎగుమతిదారులు ఒకే ఒక ఎలక్ట్రానిక్ డిక్లరేషన్ ఇచ్చేందుకు వీలుగా కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు 2016 ఏప్రిల్ లో SWIFT (సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఫర్ ఫెసిలిటేటింగ్ ట్రేడ్) అనే పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించింది. ప్రజలు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల పురోగతిని తెలుసుకునేందుకు పోలీసు ప్రధాన కార్యాలయంలో ఐ.టి సెంటర్ పర్యవేక్షణలో సింగిల్ విండో పద్ధతిని ఆరంభించామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఢిల్లీ, ముంబయిలలో ఆన్ లైన్ లో ఇచ్చే బిల్డింగ్ ప్లాన్ అనుమతులకు సింగిల్ విండో పద్దతిని ప్రారంభించామని గృహ, పట్టాన వ్యవహారాల శాఖ తెలిపింది. 2018 భూమి విధానాన్ని కూడా సింగిల్ విండో పద్ధతి కిందకు తీసుకురానున్నారు.
వర్గం: మైనారిటీలు స్థితి: పురోగతి ఉంది
రాష్ట్ర వక్ఫ్ బోర్డు పథకాలను పటిష్టం చేయడంతోపాటు, రికార్డులను కంప్యూటరీకరించే కార్యక్రమం పేరును 2017లో క్వామీ వఫ్క్ బోర్డు తరఖియాటీ స్కీమ్ (క్యూడబ్ల్యూబీటీఎస్) గా మార్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా వఫ్క్ ఆస్తులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ కోసం వఫ్క్ మేనేజ్మెంట్ సిస్టం ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ ఉంటుంది. వఫ్క్ ఆస్తుల అద్దెకు సంబంధించిన నిబంధనలను 2015లో సవరించారు. కొత్త నిబంధనల అమలు తీరును పరిశీలించేందుకు 2018లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ 2019లో పలు సిఫార్సులు చేసింది. వఫ్క్ బోర్డు ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదులు, వివాదాలను పరిష్కరించేందుకు ఏక సభ్య కమిటీ నియమించారు. రాష్ట్రాల్లో త్రిసభ్య ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాల్లో ఈ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేశారు.
వర్గం: మైనారిటీలు స్థితి: పురోగతి ఉంది
2018-19, 2019-20లో పౌరసరఫరాల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేసేందుకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం నెట్వర్క్(పీడీఎస్ఎన్) ఏర్పాటును ఆమోదించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రేషన్ కార్డుల కంప్యూటరీకరణ పూర్తి చేశారు.
వర్గం: మైనారిటీలు స్థితి: పురోగతి ఉంది
జాతీయ ఇ-గవర్నెన్స్ ప్రణాళిక 2011లో విద్య, ఆరోగ్యం అనే అంశాలను మిషన్ మోడ్ ప్రాజెక్టులుగా చేర్చారు. 2014లో ‘స్కిల్ ఇండియా’ను మిషన్ మోడ్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. 2015లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- అందరికీ నివాసం (పట్టణ) మిషన్ మోడ్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
అన్ని దేశాల వాణిజ్య లావాదేవీలను ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (LPI) ద్వారా తెలుసుకుంటుంటుంది. ఈ సూచీలో భారతదేశం ర్యాంకు 2016 లో 35 ఉండగా 2018 లో వెనక్కి పడి 44 అయింది. మొదట ఒక 6 కేటగిరీలలో ఈ స్కోరు పెరిగింది కానీ 2016-18 మధ్య అన్ని కేటగిరీలలో స్కోర్ పడిపోయింది.
వర్గం: మైనారిటీలు స్థితి: పురోగతి ఉంది
గిరిజన పరిశోధన సంస్థలు (టీఆర్ఐ)లు లేని ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు గిరిజన వ్యవహార శాఖ ప్రణాళికలు చేస్తోంది. ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో టీఆర్ఐలు పనిచేస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కం రాష్ట్రాల్లో కొత్త టీఆర్ఐల ఏర్పాటు కోసం 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.79 కోట్లు విడుదల చేసింది. దిల్లీలో జాతీయ స్థాయి గిరిజన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదన 2018 ఆఖరులో నీతి ఆయోగ్‌కు వెళ్లింది.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: పురోగతి ఉంది
అపరిష్కృతంగా ఉన్న పన్ను వివాదాలను తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. 2015 లో అప్పీళ్ళు ఫైల్ చేయడంపై ఉన్న నగదు పరిమితిని స్వల్ప కాలపరిధి వరకు పెంచారు. 2016 లో ప్రత్యేక్ష పన్ను వివాదాల పరిష్కార పథకాన్ని అమల్లోకి తెచ్చారు. పాత కేసుల పరిష్కారానికి 7 నెలల వ్యవధి ఇచ్చారు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
ప్రపంచ బ్యాంకు ‘డూయింగ్ బిజినెస్ 2019’ రిపోర్టు ప్రకారం బ్యాంకు పరిశీలనలో ఉన్న 11 కేటగిరీలలోనూ ఇండియా తన లావాదేవీల నిర్వహణను సరళతరం చేసింది.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: పురోగతి ఉంది
ప్రత్యేక్ష పన్నులను మరింత ఆధునీకరించి సులభతరం చేసే బిల్లును రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
2014-15 బడ్జెట్లో డీఆర్డీవో కోసం రూ.13.25 వేల కోట్లు కేటాయించారు. 2018-19లో రూ.17.86 వేల కోట్లకు పెంచారు. డీఆర్డీవోకు సరైన మొత్తంలో నిధుల కేటాయింపు చేయడంలేదని, దాంతో కొన్నసాగుతున్న ప్రాజెక్టులు, కార్యక్రమాల విషయంలో ఆ సంస్థ రాజీపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని 2018లో పార్లమెంటరీ ప్యానెల్ ప్రభుత్వానికి చెప్పింది. గడచిన 5 దశాబ్దాల్లో డీఆర్డీవో అనేక రకాల సాంకేతికతలను అభివృద్ధి చేసింది, పాతవాటిని మెరుగుపరిచింది. ఆ ప్రాజెక్టుల విలువ రూ.2.60 లక్షల కోట్లు. అందులో రూ.1.1 లక్షల కోట్ల ఖర్చు 2015 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులకే అవుతుంది. కానీ, 2017 మార్చి 31 నాటికి 13 డీఆర్డీవో మేజర్ మిషన్ మోడ్ ప్రాజెక్టులు ముందుగా నిర్ణయించిన గడువులోగా పూర్తి కాలేదు. రక్షణ ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేసేందుకు డీఆర్డీవో సంస్థ అధికార వికేంద్రీకరణ, కఠినమైన సమీక్ష లాంటి విధానాలను చేపట్టినట్లు 2018లో స్టాండింగ్ కమిటీ గుర్తించింది. సంస్థలో అన్ని విభాగాల్లోనూ ఒకే రకమైన విధానాలను అనుసరించేలా చూసేందుకు 2016లో డీఆర్డీవో సంస్థ అధికారిక మార్గదర్శకాలను విడుదల చేసింది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
2009 నుంచి నేషనల్ ఇంటలిజెన్స్ గ్రిడ్ (నాట్‌గ్రిడ్)ను అమలు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. అది గుర్తింపు పొందిన ఇంటలిజెన్స్ ఏజెన్సీలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో అనుసంధానం అయ్యే మార్గాలను సులభతరం చేస్తుంది. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో చర్యలు చేపట్టేందుకు వీలుగా ఇంటలిజెన్స్ ఏజెన్సీల మధ్య సమాచార మార్పిడికి సమన్వయకర్తగా వ్యవహరించేందుకు నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్(ఎన్సీసీసీ)కు 2015లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి దశలో 2017 నుంచి ఎన్సీసీసీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
2017-18, 2019-20 ఆర్థిక సంవత్సరాల కోసం రూ.25,060 కోట్లతో “పోలీసు బలగాలను నవీకరణ’’కు సంబంధించిన పథకానికి 2017లో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద పోలీసు వ్యవస్థ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లు, ఇన్స్టిట్యూషన్లు, పరికరాలను నవీకరించేందుకు రాష్ట్రాలకు సాయం అందుతుంది. సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద గ్రాంటుల రూపంలో ఆర్థిక సాయం అందిస్తుంది. 2018 ఆఖరులో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. వివిధ పోలీసు విభాగాలతో, ఇతర ప్రభుత్వ విభాగాలను అనుసంధానించడం దీని లక్ష్యం. దాని ద్వారా కేసుల దర్యాప్తు వేగవంతం చేసే వీలుటుంది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
ప్రపంచ బ్యాంకు ‘డూయింగ్ బిజినెస్ 2019’ రిపోర్ట్ లో ఇండియా 23 స్థానాలు పైకి ఎగబాకి 77 వ స్థానానికి చేరుకుంది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
సీఎస్ఐఆర్, ఎన్ఆర్డీసీలు సాంకేతికతల బదిలీ కోసం విదేశాలతో పాటు, దేశంలోని కొన్ని సంస్థలతో తరచూ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ప్రభుత్వం మరే కొత్త సంస్థనూ ఏర్పాటు చేయలేదు. సాంకేతికత బదిలీ కార్యాలయాలను కొత్తగా ఏర్పాటు చేసేందుకు లేదా ఉన్నవాటిని మెరుగుపరిచేందుకు ఆసక్తి ఉన్న విద్యా సంస్థలు/ విశ్వవిద్యాలయాలు/ పరిశోధనా సంస్థలు/ సాంకేతిక సంస్థలు/ సెక్షన్ 8 కంపెనీలు ముందుక రావాలని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా బయోటెక్నాలజీ విభాగం కోరింది. అందుకు సంబంధించి దరఖాస్తు చేసేందుకు ఆఖరి తేదీ 2019 జనవరి 7
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
పరిశోధనలు చేసేందుకు ముందుకొచ్చే యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనే కార్యక్రమాలు/ పథకాలు అమలు చేస్తోంది. అందులో కొన్ని... ఇన్స్పైర్, ఎన్-పీడీఎఫ్, ఈసీఆర్ఏ, సీఎస్ఐఆర్ ఫెలోషిప్ పథకాలు. విద్యార్థి దశలోనే స్టార్టప్‌లు ఏర్పాటు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు 2016లో ప్రభుత్వం స్టూడెంట్ స్టార్టప్ నిధిని ప్రారంభించింది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
సామాజిక అవసరాల కోసం సాంకేతిక జోక్యం వంటి పథకాలు, సమాజం లో బలహీన తరగతులు ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించటానికి సాంకేతిక ప్రయోగాలూ చేసే యువ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల పథకం వంటి పలు పథకాలు కొనసాగిస్తోంది. ఎన్ఐటీ, ఐఐటీ, ఐఐఎస్ఆర్ వంటి ఉన్నత విద్య సంస్థలను అనుసంధానం చెయ్యటం ద్వార తగిన సాంకేతిక పరిజ్ఞాన్ని అభివృద్ధి చేసేందుకు 2014లో ఉన్నత భారత్ అభియాన్‌ను ప్రారంభించింది. పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు పోషణ్ అనే పథకాన్ని 2017లో ప్రారంభించింది. అంగన్ వాడి కార్మికులు, మహిళా ఆయాలకు ఈ పథకం అమలు గురించి నిరంతరం తాజా సమాచారాన్ని అందుబాటులోకి తెస్తుంది. సామాజిక మాధ్యమాలు, కృత్రిమ మేథ, అనలిటిక్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక సాధనాల ద్వారా చీఫ్ డిజిటల్ ఆఫీసర్, చీఫ్ దిస్రప్షన్ ఆఫీసర్ డేటా సైంటిస్ట్ వంటి కొత్త కొత్త ఉద్యోగాలు దొరుకుతున్నాయి.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
2016లో ప్రభుత్వము జాతీయ వైపరీత్యాల నిర్వహణ ప్రణాళిక రూపొందించింది. హోం గార్డులు, పౌర రక్షణ సహాయకులు వంటి దళాలకు మెలుకువలు నేర్పటం, వైపరీత్యాల సమయములో సహకరించుకోవటం వంటి విషయాల్లో శిక్షణ ఇవ్వటం ఈ ప్రణాళిక లక్ష్యం. 2014లో ప్రభుత్వం వైపరీత్యాల ప్రమాదాల తీవ్రతను తగ్గించుకోటానికి పౌర సహాయక దళాలు సిద్ధం చేయటానికి ఓ పథకం ప్రారంభించింది. ఈ 12 వ ప్రణాళికలో దీనికి 290 కోట్లు కేటాయించింది. ఈ పథకం అమలు 100 జిల్లాల నుండి 240 జిల్లాలకు విస్తరించింది.
వర్గం: వ్యవసాయం స్థితి: పురోగతి ఉంది
ప్రభుత్వం మొత్తం 22 పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించింది. 2018 - 19 లో ఆ ధరలను 50 శాతం, అంతకంటే ఎక్కువ కూడా పెంచింది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయడం గురించి కొందరు ముఖ్యమంత్రులతో చర్చలు కూడా జరిపింది కాని ఆ దిశగా నిర్దిష్ట చర్యలేమీ తీసుకోలేదు.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టడానికి ఓ జాతీయ విధానం లేదు. ఈ పరిస్తితిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను పటిష్ట పరిచేందుకు2014లో మొబైల్ టవర్లు ఏర్పాటు చేయటానికి అనుమతించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ 2016 లో నిర్ణయం తీసుకొంది. రక్షణ దళాలు, ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పటానికి 2017లో పౌర కార్యాచరణ ప్రణాళిక ను రూపొందిచాము. పోలీస్ సిబ్బందిని ఆధునీకరించే విశాల పథకానికి అనేక అనుబంధ పథకాలు జోడించింది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికుల సంక్షేమ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం 2008 నాటి అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టాన్ని కొనసాగిస్తున్నాము. అదనంగా జీవిత బీమా వికలాంగుల బీమా సౌకర్యాలు కలగచేస్తోంది. అయితే ఈ పథకాలు ఏవీ భద్రత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. దేశం లో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 2014లో కేంద్ర హోమ్ శాఖ ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సులు ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఓ మహిళతో సహా న్యాయ సలహాదారులను ధిల్లీ న్యాయ సేవల సంస్థ పానెల్ లో సభ్యులు గా చేర్చాము. ఈశాన్య ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న దాడుల గురించి డిల్లీ, బెంగుళూరు పోలీసులు క్రియాసీలకం గా జోక్యం చేసుకుంటున్నారు.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: పురోగతి ఉంది
రైతులకు వాతావరణం, సాంకేతిక పరిజ్ఞానం, బీమా, ధరలు, విత్తనాలు వగైరా సమాచారం అందించేందుకు ప్రభుత్వం అనేక మొబైల్ యాప్స్, వెబ్ పోర్టల్స్ ప్రారంభించింది. ఈ యాప్స్ లో అధిక భాగం సక్రమంగా పని చేయడం లేదు. ప్రాంతీయ భాషలలో అందుబాటులో లేకపోవడం మరో లోపం.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
పంచాయతీల ఆర్థిక స్థితిని సమీక్షించేందుకు అయిదేళ్లకోసారి రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేయాలని 2016లో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
మేధో ఆస్తి హక్కుల విషయంలో ఉద్యోగుల నియామకం, శిక్షణతో సహా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. 2017-18 తో పోల్చితే 2018-19 సంవత్సరం మొదటి 8 నెలలలో పేటెంట్ ల కోసం పెట్టుకున్న దరఖాస్తులు 7 శాతం పెరిగాయి.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్ లాంటి సంస్థల ద్వారా ఆహారం, వ్యవసాయ విభాగాల్లో అణు ఇంధన శాఖ పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోంది. అందులో భాగంగా కొత్త వంగడాల అభివృద్ధి, మేలురకం సేంద్రీయ ఎరువు లాంటి అంశాల్లో పరిశోధనలు చేస్తున్నారు. అందుకోసం 2014-15లో రూ. 7,700 కోట్లు, 2018-19లో 16965.25 కోట్లు కేటాయించారు.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
బిజెపి అధికారానికి వచ్చిన తర్వాత రక్షణ ఉత్పత్తుల సేకరణ లో అనేక మార్పులు చేసింది. రక్షణ ఉత్పత్తుల సేకరణ, సైనిక సిబ్బంది కి వ్యూహాత్మక శిక్షణ నిరంతర ప్రక్రియ. 2013-2014 బడ్జెట్ లో సాయుధ దళాల ఆధునీకరణ కు 73444 కేటాయిస్తే నిజానికి ఖర్చు పెట్టింది మాత్రం 66850 కోట్లు. 2015 -2016, లో 77406 కోట్లు కేటాయించి 62235 కోట్లు ఖర్చు పెట్టింది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
సరిహద్దు పర్యవేక్షణ లో అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఉపయోగించే అవకాశాలు పరిశీలించటానికి 2019లో ఓ ప్రత్యెక బృందాన్ని ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ కోసం 2016 లో సమగ్ర సమీకృత సరిహద్దు వ్యవస్థ ను ఉనికిలోకి తెచ్చింది. ఈ విధానం కింద తొలిసారి 2018 లో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దులో రెండు చోట్ల పైలట్ ప్రాజెక్ట్ లు ప్రారంభించారు. బంగ్లాదేశ్ నుండి వచ్చే అక్రమ వలసలను గుర్తించి, నియంత్రిన్చేదుకు ప్రత్యెక బృందాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ పార్లమెంటరీ స్తాయీ సంఘం సరిహద్దు రక్షణ గురించి 2016 లో ఇచ్చిన నివేదిక లో పహారా కేంద్రాలు, తీగ, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలనీ సిఫార్సు చేసింది. గుర్గాం లోని బినోల లో జాతీయ రక్షణ విశ్వ విద్యాలయం నిర్మాణాన్ని 2010 లో చేపట్టింది. ఇంకా పూర్తీ కాలేదు. ఈ ప్రభుత్వం అటువంటి కొత్త పథకాలు ఏమీ చేపట్టలేదు.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
వివిధ రకాల ఉష్ణ మండల వ్యాధులపై 'భారతీయ వైద్య పరిశోధనా మండలి' పరిశోధనలు చేస్తోంది. 2013లో ఈ మండలి రూ.480.20 కోట్ల నిధులు అందుకుంది. 2017లో అది రూ.1395.60 కోట్లకు పెరిగింది. అంటే, 190 శాతం పెరిగింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. అందుకోసం ఆర్థిక సాయం అందించేందుకు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ పథకాన్ని ప్రారంభించింది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
సాయుధ దళాల నిమాకం విషయం లో సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా మూడు సాయుధ దళాల ప్రధానాధికారుల ఆర్ధిక అధికారాలు పరిధి పెంచింది. డెహ్రాడున్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ లో 2018 లో జరిగిన త్రివిధ దళాల కమాండర్ స్తాయి అధికారుల సమావేశం లో ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి త్రివిధ దళాల మధ్య శిక్షణ, సాధన సంపత్తి, ప్రణాళిక, సేకరణ వంటి విషయాల్లో ఉమ్మడి ఉమ్మడి అవగాహన కు ఉన్న అవకాశాల గురించి ప్రస్తావించారు. తదుపరి ఈ దిశా గా ఏ చర్యా తీసుకోలేదు.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
సాయుధ దళాలకు ట్రిబ్యునల్ లో 11 బెంచ్ లు ఉన్నాయి. ఈ బెంచిల పరిధి లో 17 న్యాయ స్థానాలు పని చేస్తున్నాయి. 2018 లో జమ్మూ కాశ్మీర్ లో కొత్త బెంచ్ ఏర్పాటు చేసింది. ఈ నయాన స్థానాల్లో 2019 నాటికి 593 పోస్టులకు గాను 196 పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. ట్రిబ్యునల్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధికారులు (సభ్యుల అర్హతలు, అనుభవం, ఇతర షరతులు) కింద 2017లో జారీ చేసిన నిబంధనల కింద అదనం గా మరో తొమ్మిది మందిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2007 సాయుధ దళాల చట్టం కింద ఈ ట్రిబ్యునల్ లో ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అటువంటి అప్పీలు హై కోర్టుల్లో దాఖలు చేయరాదనీ, సుప్రీం కోర్టు లోనే దాఖలు చేయాలని 2015 లో సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది. 2009 లో ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు అయినప్పటి నుండి 2018 నాటికి 11705 విచారించింది. సైనిక దళాల్లో పని చేసే సిబ్బంది సైనికులు ఒకే ప్రాంతం లో మూడేళ్ళకు పైగా పని చేస్తే ఆ ప్రాంతం లో ఓటర్ల జాబీతా లోనమోదు చేసుకునే అవకాశం 2008 నాటి నుండీ అమల్లో ఉంది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
విధి నిర్వహణ లో ఉన్న సైనికులు ఎలక్ట్రానిక్ పోస్టల్ బాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవనకాశం ఇస్తూ 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధలను 2016 సవరించింది. అయితే తగినన్ని పోస్టల్ బాలేట్లు అందుబాటులో లేక పోవటంతో 90 శాతం సైనికులు ఈ వెసులుబాటు వినియోగించుకోలేక పోతున్నారని పార్లమెంటరీ స్థాయీ సంఘం గుర్తించింది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
అన్ని ఉన్నత విద్యా సంస్థల్లోనూ నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు 2018లో మానవనరుల అభివృద్ధి శాఖ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేసింది. విజ్ఞానం, సాంకేతికత పరమైన వినూత్న ఆలోచనలు స్టార్టప్‌లుగా మారేలా ప్రోత్సహించేందుకు 2016-17లో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ 'నిధి' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
స్కిల్ ఇండియా పథకం కింద శిక్షణ పొందిన తోలి బృందాన్ని జపాన్ లో సాంకేతిక శిక్షణ పొందే నిమిత్తం పంపుతున్న సందర్భం గా 2018 మార్చి 28 న అభినందన సభ జరిగింది.
వర్గం: వ్యవసాయం స్థితి: పురోగతి ఉంది
2018 నాటికి వివిధ రాష్ట్రాలలో 130 విత్తన పరీక్ష ప్రయోగశాలలు ఉన్నాయి. విత్తనాలను పరీక్షించేందుకు రెండు కేంద్ర సంస్థలు కూడా ఉన్నాయి. ఒకటి వారణాసిలో, రెండోది ఫరీదాబాద్ లో.ఈ ప్రయోగశాలలను దేశమంతటా పెద్దఎత్తున నెలకొల్పాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ పత్రిక 2018 అక్టోబర్ లో ఒక వార్తను ప్రచురించింది. పెద్ద పట్టణాలలో 583 దాకా విత్తన పరీక్ష ప్రయోగశాలలను, గ్రామీణ ప్రాంతాలలో తాలూకా స్థాయిలో 6,600 ప్రయోగశాలలను నెలకొల్పడం గురించి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్టు ఆ పత్రిక పేర్కొంది. అయితే ఆ తర్వాత ఎటువంటి పురోగతీ లేదు.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
ఉన్నత భారత్ అభియాన్ రెండో దశ లో భాగం గా 2018 ఆగస్టు నాటికి మరో 750 ఉన్నత విద్యా సంస్థలను కనీసం ఐదేసి గ్రామాలతో అనుసంధానం చేసింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
స్కిల్ డేవలప్మేంట్ మరియు పారిశ్రామికవేత్తల శిక్షణ శాఖ తన పరిధి లోని జాతీయ కౌశాలాభివ్రుద్ధి సంస్థ, జాతీయ కౌశాలాభివృద్ధి కార్పోరేషన్, జాతీయ కౌశాలాభివృద్ది నిధి ద్వారా ఇప్పటికే పని చేస్తున్న కౌసలాభివృద్ధి కేంద్రాలు, విశ్వ విద్యాలయాలు, ఇతర సంస్థలతో కలిసి పని చేస్తుంది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం రంగం లో అత్యాధునిక కేంద్రాలను ప్రారంభించింది.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: పురోగతి ఉంది
అంతర్జాతీయ సౌర సంఘటన (ISA) పునరుద్ధరించగల ఇంధన వనరులపై దృష్టి పెడితే OPEC ని పక్కకు పెట్టి భవిష్యత్ లో ప్రధాన ఇంధన సరఫరాదారు కాగలదని ప్రధాని మోడీ 2018 అక్టోబర్ 2 ణ జరిగిన ISA సమావేశంలో చెప్పారు. క్రాస్ సెక్టార్ నేషనల్ ఎనర్జీ స్టోరేజ్ మిషన్ ను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు కూడా చెప్పారు. తక్కువ ధరలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంతో నేషనల్ విండ్-సోలార్ హైబ్రిడ్ పాలసీ నొకదాన్ని కూడా ఆయన ప్రకటించారు.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
2012 నాటి బాలలు యువకుల చట్టాన్ని 2015 మే లో కేంద్ర ప్రభుత్వం సవరించింది. వ్యవసాయం వినోద రంగాల్లో మినహా మిగిలిన అన్ని రంగాల్లో 14 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలను పని లోకి పెట్టుకోరాదు అన్నదే ఆ సవరణ సారాంశం.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
2018 మార్చి 22 వ తేదీ నాటికి ‘సాగరమాల’ కార్యక్రమం కింద రూ.2.65 లక్షల కోట్ల విలువ చేసే 222 పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులను గుర్తించారు. వీటిలో 14 ప్రాజెక్టులు పూర్తయ్యాయి, మరో 69 ప్రాజెక్టులకు సంబంధించిన పనులు నడుస్తున్నాయి. ఇవన్నీ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, భారత జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర ప్రజా పనుల శాఖలు, రేవులు, ఇండియన్ పోర్ట్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ మొదలైన సంస్థలు, శాఖల సహాయంతో అమలవుతున్నాయి.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ తయారీ ప్రక్రియలలో ‘జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్’ పద్ధతులను అనుసరించేలా చేయడానికి ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వ శాఖ ‘జెడ్ (ZED) సర్టిఫికేషన్ స్కీమ్ కు ఆర్ధిక సహాయం’ పేరుతో ఒక పథకాన్ని ప్రకటించింది. ఇప్పటిదాకా 20,000 పైగా పరిశ్రమలు ఈ స్కీమ్ కింద సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుతానికి ఈ పథకం ఒక్క ఎం.ఎస్.ఎం.ఇ రంగానికి మాత్రమే వర్తింప జేసారు.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: పురోగతి ఉంది
జాతీయ ఇంధన విధానం రెండవ ముసాయిదా సిద్ధంగా ఉంది. త్వరలో ఖరారయ్యే అవకాశం ఉంది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
ప్రధాన మంత్రి కౌసల వికాస యోజన పథకం ద్వారా తేలిక పాటి నైపుణ్య శిక్షణ కూడా అందించే అవకాశం కల్పిస్తోంది. పదకొండు, పన్నెండు తరగతుల్లో విదేశీ భాషలు ఆసక్తి ఉన్న వారికీ నేర్పేందుకు వీలుగా కేంద్ర మాధ్యమిక విద్య సంస్థ నిర్ణయం తీసుకుంది. విదేశీ బాషలు నేర్చుకోవటం గురించి ఇప్పటి వరకు ఎటువంటి జాతీయ విధానము లేదు.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
2015 లో ప్రారంభించిన జాతీయ నైపుణ్యం అభివృద్ది పథకం దేశ వ్యాప్తం గా నైపుణ్యం పెంచేందుకు కావాల్సిన సంస్థాగత ఏర్పాట్లు చేస్తోంది.కాలీజి నుండి పాథశాలల నుండి చదువులు అర్ధంతరంగా విరమించుకున్న వారికీ స్వల్ప కాల శిక్షణ ఇచ్చేందుకు ప్రధాన మంత్రి కౌశల యోజన (2016-2020) అవకాశం కల్పిస్తోంది. 2016లో ఈ పథకం కింద 49973 మందికి శిక్షణ ఇవ్వగా 2018 లో 674534 మందికి శిక్షణ ఇచ్చింది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
వివిధ రాష్ట్రాల్లో నానో టెక్నాలజీ పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం 20 కేంద్రాలను ఏర్పాటు చేసింది. వివిధ విశ్వవిద్యాలయాలు తమ సొంత ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేశాయి.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
చిన్న వ్యాపారులు, రోడ్డు మీద వస్తువులు పెట్టుకుని అమ్ముకునే చిరు వ్యాపారులకు జి.ఎస్.టి మినహాయింపులు, రుణాలు ఇవ్వడం మినహా ప్రభుత్వం సాంకేతికంగా వారికి ఎలాంటి సహాయం చేయలేదు.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
2018 లో జాతీయ పౌష్టికాహార మిషన్ ప్రారంభించింది. 2020 నాటికి 10 కోట్ల మంది లబ్ది దారులకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకానికి రు. 9046.17 కేటాయించింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
2014లో కేంద్ర ప్రభుత్వం మైగౌ వెబ్ పోర్టల్ ని ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వార ప్రభుత్వం ప్రజల మధ్య అనుసంధానం పెంపొందించటంతో పాటు ప్రజాస్వామ్యం లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ పోర్టల్ ని ఉపయోగించటానికి వయో పరిమితులు లేవు.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
ప్రభుత్వ స్కాలర్షిప్ లు బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసుకోవటం, పొందటం, ఇతర సమాచారం పొందటం సులభ సాధ్యం చేస్తూ విద్యాలక్ష్మి వెబ్ సైట్ ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నంలో ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహానికి అనేక చర్యలు తీసుకుంది. కొత్త వస్తువులను కొత్త మార్కెట్లకు ఎగుమతి చేసే ప్రయత్నంతో పాటు సంప్రదాయ వస్తువులు, మార్కెట్లలో ఇండియా వాటాను పెంచే ప్రయత్నం కూడా చేస్తోంది. జి.ఎస్.టి కింద అన్ని రాష్ట్రాలలో ఒకే రకమైన పన్ను రేట్లు, పద్ధతులు రావడంతో ఎగుమతిదారులకు చాలా ఖర్చు, పేపర్ పని తగ్గింది. వారు తీసుకున్న ఇతర చర్యలు ఎం.ఎస్.ఎం.ఇ ఎగుమతులను, ప్రపంచ మార్కెట్లో పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడం.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
యు.జి.సి లో 2012 లో దేశీయ భాషల అభివృద్ధికి ఒక కమిటీని నెలకొల్పారు. అంతరించిపోతున్న భాషల కోసం యూనివర్సిటీలలో కేంద్రాలు నెలకొల్పాలని ఆ కమిటీ సూచించింది కాని 2015 నుండే వాటి కోసం నిధుల విడుదల మొదలైంది. 2017 లో 9 యూనివర్సిటీలలో ఈ కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
వికలాంగుల హక్కుల చట్టం 2016 ఆదేశించిన విధం గా జూన్ 2019 నాటికి బహిరంగ ప్రదేశాలు అన్నింటి లోను వికలాంగులకు సౌలభ్యం కల్పిస్తూ నిర్మాణాలు ఇతర మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలనీ సుప్రీం కోర్టు ఆదేశించింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన పరిధిలోని మ్యూజియంలలోని వస్తువులనన్నిటినీ డిజిటైజ్ చేయాలని నిర్ణయించింది. 2017 లో ప్రారంభించిన వారసత్వ సంపద పరిరక్షణ పథకం ADOPT దేశంలోని ముఖ్యమైన పురా చిహ్నాల పరిరక్షణ బాధ్యతను కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రైవేటు/పబ్లిక్ కంపెనీలు/ సంస్థలు/ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. టూరిస్ట్ ప్రదేశాలలో మౌలిక సదుపాయాల కల్పన, వాటి సుందరీకరణకు PRASAD పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనుంది. ఇంతవరకు 15 రాష్ట్రాలలో 24 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటికి రూ. 727.16 కోట్లు ఖర్చవుతాయని అంచనా. గత ఐదేళ్ళలో వీటికి 341.68 కోట్లు విడుదల చేసారు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు 2018లో కేంద్ర పర్యావరణ శాఖ ఏక గవాక్ష విధానాన్ని ప్రవేశపెట్టింది. దరఖాస్తులను ఆన్‌లోనే పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
మొత్తం 13 జాతీయ క్రీడా అకాడమీలు ప్రారంభించాలని నిర్నయించగా 2015-2016 వరకు ఐదు అకాడమీలు పని ప్రారంభించాయి.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
రూ. 2000 కోట్ల వ్యయంతో ‘నమామి గంగ’ పథకాన్ని 2014 లో ఆమోదించారు. కాని ఈ ప్రాజెక్ట్ ను సక్రమంగా అమలు చేయలేదని, నిధులు ఖర్చు చేయలేదని కాగ్ అక్షింతలు వేసింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
రామ సేతు దగ్గర పూడిక తీయాల్సిన అవసరం లేకుండా వేరే సముద్ర మార్గాన్ని ఎంపిక చేయడంలో ప్రభుత్వం చాలా జాప్యం చేసింది. నౌకా రవాణా శాఖ రామ సేతుకు నష్టం వాటిల్లకుండా ఒక మార్గాన్ని ప్రతిపాదించింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
జాతీయ యువ నేతల కార్యక్రమం 2014 డిసంబర్ లో ప్రారంభించ బడింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
2014-2015 కేంద్ర బడ్జెట్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా డిసెంబరు 2014లో జాతీయ యువ నేతల కార్యక్రమం పథకాన్ని ప్రారంభించి వివిధ రాష్ట్రాలకు నిధులు కేటాయించింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
2014-2015 కేంద్ర బడ్జెట్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా డిసెంబరు 2014లో జాతీయ యువ నేతల కార్యక్రమం పథకాన్ని ప్రారంభించి వివిధ రాష్ట్రాలకు నిధులను కేటాయించింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
సార్క్, ఏసియన్ కూటమిలో భారత్ ఎన్నో ఏళ్లుగా పాల్గొంటోంది. అలాగే, ఏసియన్- ఇండియా వాణిజ్యాన్ని విస్తరిస్తోంది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
2015లో నేషనల్ సైబర్ కో ఆర్డినేషన్ కేంద్రాన్ని ప్రభుత్వం ఆమోదించింది. సైబర్ ఫోరెన్సిక్ రంగంలో ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
దేశంలోని మొత్తం 38 ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుల్లో తొమ్మిదింటిని 2014లో నోటిఫై చేశారు. ఉగ్రవాద అణచివేత, భద్రత పరమైన వ్యవహారాల కోసం ఇతర దేశాలతో కలిసి జాయింట్ వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేసేందుకు భారత్ చర్యలు చేపట్టింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
ప్రభుత్వంతో ప్రజలను అనుసంధానించేందుకు 2014 లో mygov పేరుతో ఒక వెబ్ పోర్టల్ ప్రారంభించారు. పరిపాలనా సంబంధమైన అనేక విషయాలపై పౌరులు తమ అభిప్రాయాలను, సూచనలను ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇది బాగా ఉపయోగపడింది. వారి సూచనలను బడ్జెట్ల రూపకల్పనలో, జాతీయ విద్యావిధాన రూపకల్పనలో ఉపయోగించుకున్నారు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
రైతులకు నిరాటంకంగా, సాఫీగా రుణాలు అందేలా ప్రభుత్వం ఏటా బ్యాంకింగ్ రంగానికి వ్యవసాయ రుణ లక్ష్యాలను ముందుగానే నిర్ణయిస్తుంది. ఎల్లప్పుడూ బ్యాంకులు ఆ లక్ష్యాలను అధిగమిస్తూనే ఉన్నాయి.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
రకరకాల పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం తన దగ్గరున్న సమాచారాన్నంతా డిజిటల్ రూపంలో భద్రపరచడం ప్రారంభించింది. ఈ డిజిటల్ ఇండియా ప్లాట్ ఫారం గురించి ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
ఇది నిరంతర ప్రక్రియ. కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కెరీర్ ఫెయిర్లు, ఎగ్జిబిషన్లను, క్యాంపైన్లను నిర్వహించింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
జాతీయ ఎచీవ్మెంట్ సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 2017లో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని తిరిగి అమల్లోకి తెచ్చారు. 2014 మొదట్లో నేషనల్ యూత్ పాలసీని ఆమోదించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తోంది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
గత ప్రభుత్వం హయాంలో 19 వ లా కమిషన్ ‘కాలం చెల్లిన చట్టాల’ గుర్తింపుకు ఒక కార్యక్రమం చేపట్టింది కాని ఈ లోపల కమిషన్ కాలవ్యవధి ముగియడంతో పని ముందుకు నడవలేదు. 20 వ లా కమిషన్ ఆ పనిని చేపట్టి ‘కాలం చెల్లిన చట్టాలు: తక్షణ రద్దు ఆవశ్యకత’ పేరుతో నాలుగు రిపోర్టులు తీసుకొచ్చి అందులో రద్దు చేయాల్సిన చట్టాల పేర్లను పేర్కొంది. వాటిని పరిశీలించడానికి ప్రధానమంత్రి కార్యాలయం 2014 లో ఒక ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మొత్తం 1,824 చట్టాలను గుర్తించింది. వీటిని రద్దు చేయడానికి ఇప్పటివరకు పార్లమెంటు 5 బిల్లులను ఆమోదించింది. 1,824 కు గాను 1,428 చట్టాలు రద్దయ్యాయి.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం, 1972-73 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2014-15లో భారత్‌లో ఎయిర్ కార్గో 20 రెట్లకు పైగా పెరిగి 0.08 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 2.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
ఎస్సీ, ఓబీసీ, సీనియర్ సిటిజన్లు, డ్రగ్ ఎడిక్ట్స్, వికలాంగుల కోసం పనిచేసే ఎన్జీవోలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఏడీఐపీ పథకం కింద వివిధ ఎన్జీవోలకు అనేక విధాలుగా సాయం చేస్తోంది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలనే కేంద్ర పథకానికి సుప్రీంకోర్టు 2017 చివరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంటు సభ్యులపైన, శాసనసభ్యులపైన పెండింగులో ఉన్న 1581 క్రిమినల్ కేసులపై సంవత్సరం వ్యవధిలో విచారణ పూర్తిచేయాలని గడువు విధించింది. 2018 జులై నాటికి వీటిలో 1349 కేసులను త్వరిత విచారణకు ప్రత్యేక కోర్టులకు బదిలీ చేశారు.
వర్గం: మహిళలు స్థితి: పురోగతి ఉంది
బాలికల పట్ల కేంద్రీకరణ పెంచే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. అక్షరాస్యత తక్కువ గా ఉన్న ఆదివాసీ కేంద్రీకరణ గల జిల్లాల్లో మహిళల అక్షరాస్యత పెంచేదుకు జరిగే ప్రత్యెక ప్రయత్నం, గిరిజన బాల బాలికలకు సంబంధించిన పథకాలు, ఆదివాసీ ప్రాంతాల్లో ఆశ్రమ పాటశాలలు వంటి పథకాలు అమలు కొనసాగిస్తోంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలతో సహా అన్ని కుటుంబాల్లో బాలికల ప్రయోజనం కోసం బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని 2015 లో ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఆడపిల్లలను అక్రమం గా తరలించటాన్ని నివారించేందుకు, బాధితులను కాపాడేందుకు ప్రారంభించిన ఉజ్వల పథకం అమలు జరుగుతోంది.
వర్గం: మహిళలు స్థితి: పురోగతి ఉంది
2014లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్చ భారత్ అభియాన్ పాయఖానాల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణ, పరిశుభ్రమైన తాగు నీరు అందించే ప్రయత్నాల వెనక చోదక శక్తి గా ఉంది. బహుముఖ అభివృద్ధి లక్ష్యం గా ప్రభుత్వం ప్రకటించింది. కానీ గడువు నాటికి అంటే 2019 అక్టోబర్ నాటికి ఇంటింటికీ కనీస వసతులు అందుబాటులోకి తేవటం సాధించలేక పోతోంది. 2018 డిసంబర్ నాటికి గ్రామీణ ప్రాంతాలలో 71.8 % కుటుంబాలకు శుబ్రమైన తాగు నీరు అందుబాటులోకి తీసుకువచ్చింది. 82..7 % కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చింది. ఇప్పటి వరకు 32 % గ్రామాల్లో మాత్రం బహిర్భూమికి వెళ్ళటం పూర్తీ గా నిలిచి పోయింది. దాదాపు 80.3 % గ్రామీణ ప్రజలకు తాగునీరు సరఫరా అందుబాటులోకి తెచ్చాము.కానీ స్వచ్చమైన తాగు నీరు మాత్రం 56 % కుటుంబాలకు మాత్రమె అందుబాటులో ఉంది. 2018 ఏప్రిల్ నాటికి జన గణన లో నమోదైన అన్ని గ్రామాలను విద్యుదీకరించము. 2019 మార్చి 31 నాటికి దేశవ్యాప్తం గా అన్ని కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం అందించాలన్నది లక్ష్యం గా ఉంది
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
మధ్యవర్తిత్వ బిల్లుకు సవరణను 2018లో పార్లమెంటు ఆమోదం తెలిపింది. 1996 నాటి ఈ చట్టానికి చేసిన సవరణ మధ్యవర్తిత్వ ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు, తక్కువ ఖర్చుతో కేసుల వేగవంతమైన పరిష్కారానికి కూడా ఉపకరిస్తుంది. 2015 నుంచి లోక్ అదాలత్‌ల ద్వారా 4,09,35,185 వ్యాజ్యాలను, పెండింగు కేసులను పరిష్కరించారు.
వర్గం: వ్యవసాయం స్థితి: పురోగతి ఉంది
2015లో బీజేపీ ప్రభుత్వం డీడీ కిసాన్ చానెల్ ప్రారంభించింది. 2014-15 నుంచి 2016-17 మధ్య దానికి రూ.122.25కోట్ల విడుదల చేశారు. 2017-18లో రూ.80కోట్లు విడుదల చేశారు. ఐఏఆర్ఐ, ఐకార్ లాంటి సంస్థల నుంచి దానికి సమాచారం అందుతుంది. ప్రాంతీయంగా అలాంటి చానెల్స్ ఏవీ లేవు.
వర్గం: మహిళలు స్థితి: పురోగతి ఉంది
జాతీయ మహిళా విధానం కోసం ఓ ముసాయిదాను మంత్రివర్గ ఉప సంఘం రూపొందించి మంత్రి మండలికి సమర్పించింది. విధవలు, విడాకులు తీసుకున్న వారు, పెళ్లి చేసుకొని వారు, వదిలివేయబడ్డ మహిళలు, మహిళా యాజమాన్యం లో ఉన్న కుటుంబాలు వంటి వారికి గల ప్రత్యెక అవసరాలు తీర్చేందుకు అనేక సూచనలు ప్రతిపాదించబడ్డాయి.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
వాడుకలో లేని చట్టాలను గుర్తించే ప్రాజెక్టును గత ప్రభుత్వ హయాంలోనే 19వ లా కమిషన్ చేపట్టింది. కానీ కమిషన్ గడువు ముగియడంతో దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు. 20వ లా కమిషన్ కూడా ఈ ప్రాజెక్టును కొనసాగించాలని నిర్ణయించింది. తన సిఫార్సులతో “వాడుకలో లేని చట్టాలు: వెంటనే తొలగించాల్సిన ఆవశ్యకత” అనే పేరుతో ఓ నివేదికను కూడా సమర్పించింది. ఈ నివేదికను సమీక్షించి అవసరం లేని చట్టాలను రద్దుచేసేందుకు 2014లో ప్రధాని కార్యాలయం ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. రద్దుకు అర్హమైన 1824 చట్టాలను ఆ కమిటీ గుర్తించింది. దీనికోసం అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐదు బిల్లులు పాస్ అయ్యాయి. మొత్తం 1824 చట్టాల్లో 1428 చట్టాలు ఇప్పటికే రద్దయ్యాయి.
వర్గం: మహిళలు స్థితి: పురోగతి ఉంది
మహిళా శిశు సంక్షేమ శాఖ పని చేసే మహిళల కోసం వసతి గృహాలు నిర్వహిస్తోంది. ఈ వసతి గృహాలలో బట్టలు ఉతికి పెట్టె వెసులుబాటుతో పాటు పిల్లల సంరక్షణ కేంద్రాలు, మహిళల భద్రత వంటి అంశాలు ఉన్నాయి.2017-2018 బడ్జెట్ లో అటువంటివి మరో 190 వసతి గృహాలు అదనం గా ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
క్రీడలను ప్రోత్సహించేందుకు కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులను వినియోగించాలని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. క్రీడలను ప్రోత్సహించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2014లో రూ.53.36 కోట్లు ఖర్చు చేశారు. 2015లో దాన్ని రూ.134.76 కోట్లకు పెంచారు. క్రీడల ప్రోత్సాహం కోసం కార్పొరేట్ సంస్థలు రూ.51.73 కోట్లు ఇచ్చాయి.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: పురోగతి ఉంది
విద్యా హక్కు చట్టం 2009 అమలు తీరుపై ప్రభుత్వం తరచూ సమీక్షిస్తోంది. యూడీఐఎస్ఈ ద్వారా ఏటా వివరాలు సేకరిస్తోంది. సర్వశిక్షా అభియాన్‌ను ఏటా రెండుసార్లు సమీక్షిస్తున్నారు. ఎన్సీఈఆర్టీతో నేషనల్ అచివ్మెంట్ సర్వేలు చేశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార భద్రత చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు.
వర్గం: వ్యవసాయం స్థితి: పురోగతి ఉంది
సమీకృత ఉద్యానవన సేద్యం పథకాన్ని కేంద్రం 2014-2015 బడ్జెట్ నుండీ అమలు చేస్తోంది. ఉద్యానవన సేద్యాన్ని విస్తరించటమే ఈ పథకం లక్ష్యం. 2018లో ఈ పథకానికి 2319.5 కోట్ల రూపాయల నిధి కేటాయించింది. 2017లో ఈ కేటాయింపులు కేవలం 192.9 కోట్లు మాత్రమే. 2015-2016 ప్రత్యేకం గా పంజాబ్ విశ్వ వ్యవసాయ విద్యాలయం పరిధిలో ఉద్యానవన విద్య పరిశోధన కు పోస్ట్ గ్రాడుయేట్ విద్య సంస్థను ప్రారంభించేందుకు నిర్ణయించింది. సమీకృత ఉద్యానవన సేద్యం పథకం, జాతీయ ఉద్యాన వన బోర్డు, రాష్ట్రీయ కృషి వికాస యోజన, మన్నికైన వ్యవసాయం కోసం జాతీయ మిషన్, ప్రధాన మంత్రి కృషి సిచాయి యోజన వంటి పథకాల ద్వారా కేంద్రం పుష్ప సేద్యం, తేనెటీగల పెంపకం వంటి వాటికీ కూడా వ్యవసాయోత్పత్తుల ప్రాసెస్సింగ్ మరియు ఎగుమతి అభివృద్ధి బోర్డు ద్వారా పూలు ఎగుమతికి చర్యలు చేపట్టింది.
వర్గం: వ్యవసాయం స్థితి: పురోగతి ఉంది
దేశ వ్యాప్తం గా ఉన్న వ్యవసాయోత్పత్తులకు జాతీయ మార్కెట్ ను అనుసంధానం చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చె లక్ష్యం తో ఆన్ లైన్ లో రైతులు తమ ఉత్పత్తులను ఏ మార్కెట్ లో నైనా అమ్ముకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం 2016లో ఈనాం పథకాన్ని ప్రారంభించింది. ఈనాం అంటే జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డులను ఆన్లైన్లో అనుసంధానం చేయటం. 2018 నాటికి 19 రాష్ట్రాల్లో 585 నియంత్రిత వ్యవసాయ మార్కెట్ యార్డులను ఈ పథకం కింద అనుసంధానం చేసింది. రైతులను మార్కెతో అనుసంధానం చేయటం లో భాగం గా వ్యవసాయోత్పత్తులు పశు సంపద (ప్రోత్సాహం, సులభతరం చేయటం) చట్టం 2017 ఆమోదించింది.
వర్గం: వ్యవసాయం స్థితి: పురోగతి ఉంది
ప్రధాన మంత్రి కృషి సిచాయి యోజన లో భాగంగా 2016-2020 మధ్య కాలం లో ఆరువేల కోట్లతో ఆహారోత్పత్తుల ప్రాసెస్సింగ్ పరిశ్రమల శాఖ ఆధ్వర్యం కేంద్ర ప్రభుత్వ పథకం అమలు చేస్తోంది. పళ్ళు పూలు వంటి ఉత్పతులకు ఆధునిక గిడ్డంగి సదుపాయాలు కల్పించటం వాటిని కేంద్రం చేసుకుని వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటును ప్రోత్సహించటం ఈ పథకం లక్ష్యం. 2018లో వివిధ రాష్ట్రాలకు 100 ఆగ్రో ప్రాసెస్సింగ్ పరిశ్రమలు కేటాయించాము. దేశం లో ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ల లో పరిశ్రమలు ప్రారంభించేదుకు ఆసక్తి కలిగిన పారిశ్రామికవేత్తలు అన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాము. ఈ మేరకు కేంద్ర తన ఆసక్తిని ని కనబరిచింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
సాగరమాల కార్యక్రమం కింద రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడుల అంచనాతో 2018 మార్చి 22 నాటికి 222 ఓడరేవుల అనుసంధానం ప్రాజెక్టులను గుర్తించాము. ఇందులో 14 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. మరో 69 ప్రాజెక్టులు నిర్మాణం లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రోడ్లు జాతీయ రహదారుల శాఖ, జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర పౌర నిర్మాణాల శాఖ, భారతీయ పోర్ట్ రైల్ కార్పోరేషన్, చమురు, సహజ వాయువుల మంత్రిత్వ శాఖల వంటి పలు ప్రభుత్వ సంస్థల ద్వారా అమలవుతున్నాయి.
వర్గం: వ్యవసాయం స్థితి: పురోగతి ఉంది
2016లో నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈనామ్)ను ఏర్పాటు చేశారు. 2017లో ‘ది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ లైవ్ స్టాక్ మార్కెటింగ్ యాక్ట్’ అమల్లోకి వచ్చింది. 2016 నాటికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా అందుబాటులోకి వచ్చింది. 2018-19లో ప్రభుత్వం ఎంఎస్పీని కూడా పెంచింది. 2019 బడ్జెట్లో ప్రభుత్వం ‘ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిథి’ని ప్రకటించింది. అందులో భాగంగా రైతులకు ఏడాది రూ.6వేల సాయాన్ని ప్రకటించింది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
వయోధికుల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 2010 నుంచి కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వృద్ధులకు ఉచితంగా ఊతం కర్రలు, చక్రాల కుర్చీల్లాంటివి పంపిణీ చేసేందుకు 2017లో రాష్ట్రీయ వయోశ్రీ యోజన ప్రారంభించింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
తాత్కాలికంగాను, శాశ్వతంగానూ వరదల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈశాన్య రాష్ట్రాలకు 2017 లో ప్రధాని నరేంద్ర మోదీ 2350 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: పురోగతి ఉంది
విద్యుత్ రంగం లో ప్రభుత్వం అనేక పథకాలు విధానాలు అమలు చేసింది. 2017 లో నీతి ఆయోగ్ ముసాయిదా విద్యుత్ విధానాన్ని రూపొందించింది. జాతీయ సముద్ర తీర పవన విద్యుత్తు విధానాన్ని 2015 లో ప్రకటించింది. విద్యుత్ ఉత్పత్తులను స్థిరీకరించేందుకు 2017లో ఓ విధానాన్ని కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2015 లో పవన విద్యుత్ ఉత్పత్తి కి 314 కోట్లు కేటాయించగా 2018 నాటికి ఈ మొత్తం 784.59 కోట్లకు పెరిగింది. భారత అణు విద్యుత్ కార్పోరేషన్ తో కలసి సంయుక్తంగా అణు విద్యుత్ కేంద్రాలు నిర్మించేందుకు వీలుగా అణు ఇంధన చట్టాన్ని 2015 లో సవరించాము.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: పురోగతి ఉంది
2019 జనవరి నాటికి దేశం లో 37 జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణం లో ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కావాల్సిన బొగ్గు అందుబాటులోకి తెచ్చే విధం గా 2015 లో బొగ్గు గనుల చట్టం (ప్రత్యెక అంశాలు) ను సవరించాము. ఈ సవరణ ఫలితం గా 2019 జనవరి నాటికి కేటాయించిన బొగ్గు గనుల ద్వారా కేంద్రానికి సమకూరిన ఆదాయం 6438.94 కోట్లు. 1957 నాటి గనులు ఖనిజ వనరులు (నియంత్రణ అభివృద్ధి) చట్టం లో భాగం గా బొగ్గు గనుల కేటాయింపు నిబంధనలు 2017 లో మార్చాము. అక్రమంగా గనులు తవ్వితే అపరాధ రుసుము చెల్లించాలని కూడా ఈ కొత్త నిబంధనలు ఆదేశిస్తున్నాయి. దేశం లో అక్రమ గనుల తవ్వకాన్ని నిరోధించేందుకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ గనుల పర్య వేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. 2015 నాటి గనుల వేలం నిబంధనలు కూడా 2017 నవంబరులో మార్చాము.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ప్రతిపాదిత 3326 కిలోమీటర్ల కంచె నిర్మాణంలో 2746.44 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తైంది.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: పురోగతి ఉంది
జాతీయ కాలుష్య రహిత ఇంధనం మరియు పర్యావరణ నిధికి 2015లో కేంద్రం 5324.8 కోట్లు కేటాయించింది. ఈ నిధి 2017 నాటికి 7342.8 కోట్లకు పెరిగింది. (సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం) కాలుష్య రహిత ఇంధనం ఇంధన అభివృద్ధి కి 2017లో కేంద్ర ప్రభుత్వం పోర్చుగల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. సౌర విద్యుత్ ఉత్పత్తి వినియోగానికి సంబంధించి 2010 లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించిన జవహర్ లాల్ నెహ్రు జాతీయ సౌర విద్యుత్ మిషన్ ను కొనసాగిస్తోంది. జాతీయ పరివృత్త వాయు కాలుష్య పర్యవేక్షణ విధానం 2011 మెరకు నిరంతర పరివృత్త కాలుష్య పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు, జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక, స్వచ్చ గంగ జాతీయ ప్రణాళిక వంటి అనేక పథకాలు విధానాలు ద్వారా రాష్ట్రాలకు కాలుష్య నియంత్రణ లక్ష్య సాధన కోసం ఆర్ధిక సహాయం అందిస్తోంది. పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పు శాఖ 2017 లో జల వనరుల నాణ్యత పరిరక్షించెందుకు మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. పంట పొలాలు కాల్చటం, కాలుష్య కారక ఇధనల స్థానం లో సహజ వాయువుతో ప్రత్యామ్నాయ ఇంధనం అందుబాటులోకి తేవటం వంటి చర్యలు చేపట్టింది. 2015లో జాతీయ వాయు కాలుష్య సూచిక కు రూపొందించాము. సాగులో వచ్చే వ్యర్ధ పదార్దాలు కాల్చటం ద్వారా పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించటానికి కేంద్ర ప్రభుత్వం హర్యానా పంజాబ్ డిల్లీ ఉత్తరప్రదేశ్ లలో సాగు వ్యర్ధాలను నివారించేందుకు యాంత్రికీకరణ పథకాన్ని 2018-2019, 2019-2020 లలో అమలు జరిగేలా ప్రతిపాదించింది.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
ఇస్రో మొదట్నుంచీ జీఎస్ఐకి సాంకేతిక సేవలు అందిస్తోంది. వ్యవసాయం రంగంపై ఉపగ్రహాల సాయంతో డేటాను సేకరిస్తోంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కూడా సాంకేతికత సాయంతో అటవీ వనరులను పర్యవేక్షిస్తోంది. మొదలుపెట్టిన 158 ప్రాజెక్టుల్లో 94 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 35 ప్రాజెక్టులు వివిద దశల్లో ఉన్నాయి.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి వచ్చిన నిరాశ్రయుల కోసం 2000 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్యాకేజీని 2016లో ప్రభుత్వం ఆమోదించింది.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: పురోగతి ఉంది
తేరి సంస్థ గృహ పేరుతొ పర్యావరణ సానుకూల భావనలకు గుర్తింపు ఇచ్చేందుకు ఓ విధానాన్ని రూపొందించింది. ఈ విధానాన్ని జాతీయ విధానం గా 2007 లో ప్రకటించింది కేంద్రం. ఈ పథకం కింద 2015 లో తాజా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 2018లో ఈ నగరాల కోసం ప్రత్యేకంగా ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. మన్నికైన నగరాల అభివ్రిద్ది లక్ష్యం గా ఈ మార్గదర్శకాలను నగలకు కూడా వర్తింప చేస్తున్నాము. ఇంధన సామర్ద్య బ్యూరో 2017లో ఇంధన సామర్ధ్యాన్ని పెంచేందుకు అవసరమైన రీతిలో భావన నిర్మాణాలు ఉండేలా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. సహజ అటవీ జీవన పరిస్తితులు కాపాడటానికి 12 వ పంచవర్ష ప్రణాళిక లో అమలు జర్గిన కేంద్ర ప్రభుత్వ సమీకృత పథకాన్ని ప్రణాళిక గడువు తర్వాత 2017-2018, 2019-2020 లలో కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ పథకానికి కేటాయించిన మొత్తం 1731.72కోట్లు. అందులో ప్రాజెక్ట్ టైగర్ పథకం కింద 1143 కోట్లు, సహజ అటవీ జీవన పరిస్తితులు కల్పించేందుకు మరో 496.50 కోట్లు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కోసం 92.22 కోట్లు కేటాయించింది. పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పు శాఖ 2017-2031 కాలానికి గాను జాతీయ ఆటవె జీవన ప్రణాళిక రూపొందించింది. దేశ వ్యాప్తంగా అటవీ సంపద రక్షణ, పరిరక్షణ, నిర్వహణ ఈ ప్రణాళిక లక్ష్యం.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: పురోగతి ఉంది
పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పు శాఖ నూతన అటవీ విధాన ముసాయిదాను 2018 లో విడుదల చేసింది. మన్నికైన అటవీ యాజమాన్య పద్దతుల ద్వారా పర్యావరణ మార్పులతో వచ్చే దుష్పరిణామాలను నియంత్రించటం దీని ఉద్దేశ్యము. భాగస్వామ్య అటవీ యాజమాన్యం మీద ఈ విధానం దృష్టి పెడుతుంది. హరిత భారతం మిషన్ 2010 లోనే మొదలైనప్పటికీ ఈ పథకం కింద కార్యక్రమాలు మాత్రం 2015-16లోనే మొదలయ్యాయి. దేశ వ్యాప్తం గా అటవీ విస్తీర్ణం పెచటం అడవుల నాణ్యత పెంచటం ఈ పథకం ఉద్దేశ్యం. పంట పొలాల్లో కూడా అటవీ భూములు అభివృద్ధి చేసేందుకు సామాజిక వనాలు పెంచేదుకు ఈ పథకం కింద అవకాశం ఉంది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
భవన, ఇతర నిర్మాణరంగ కార్మికులకు ఉచిత బీమా, 60ఏళ్లు దాటిన వారికి నెలకు 1000 రూపాయల పెన్షన్, పిల్లలకు స్కాలర్షిప్, వైద్య ఖర్చుల చెల్లింపు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ముసాయిదా పథకంలో ప్రతిపాదించింది.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: పురోగతి ఉంది
జాతీయ సహజ వనరుల నిర్వహణా వ్యవస్థ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రకృతి వనరులను అంచనా వేయటానికి నిర్వహించటానికి పరిశోధన సంస్థలకు ఆర్ధిక సహాయం అందిస్తుంది. జలవనరుల శాఖ, నదుల అభివృద్ధి విభాగం, గంగ నది పునరుధారణ పథకం వంటి పథకాల ద్వార జల వనరుల సమాచార వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి. ఉపగ్రహాల ద్వారా అందుతున్న సమాచారాన్ని వయవయకోత్పత్తులను అంచనా వేయటానికి, వైపరీత్యాల ద్వారా కలిగే నష్టాన్ని నివారించటానికి ఉపయోగిస్తున్నాము. దేశం లో ఉన్న అటవీ వనరులను పర్యనేక్షించటానికి భారత అటవీ సర్వే విభాగం ఉపగ్రహ ఛాయా చిత్రాలు ఉపయోగిస్తోంది. భూగర్భ సర్వే శాఖ 2016-2017 లో దేశంలోని 194 ప్రాంతాల్లో ఖనిజవనరులను వెలికి తీసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2016 లో ప్రయోగించిన రాకెట్ ద్వారా రిసోర్స్ అత 2ఎ ఛాయాచిత్ర పరిజ్ఞానాన్ని అందించే ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
కేంద్ర సాంస్కృతిక శాఖ తన పరిధిలో ఉన్న అన్ని వస్తు ప్రదర్శన శాలల ను కంప్యుటరీకరణ చేయాలనీ నిర్ణయించింది. సారస్వత కేంద్రాన్ని దత్తత తీసుకోండి అనే పథకాన్ని 2017 లో ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, సంస్థలు వ్యక్తులు కూడా ఇటువంటి చారిత్రిక ప్రాధాన్యత గల కేంద్రాలను, పర్యాటక ప్రాధాన్యత కలిగిన కేంద్రాలను, సారస్వత కేంద్రాలను దత్తత తీసుకోవచ్చు. ప్రసాద్ పథకం ద్వారా పర్యాటక ప్రాధాన్యత కలిగిన స్థలాలను సుందరీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకు 15 రాష్ట్రాల్లో 24 ప్రాజక్టులను ఈ పథకం కింద ఆమోదించి 727.16 కోట్ల వ్యయ ప్రతిపాదనలు ఆమోదించింది. అందులో 2014 నుండీ 2018 మధ్య కాలంలో 341.68 కోట్లు విడుదల చేసింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
గత ఎనిమిది సంవత్సరాలకు పైగా అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన వివాదాలు సుప్రీం కోర్ట్ లో నానుతున్నాయి. అలహాబాద్ హైకోర్ట్ ఈ భూమిని మూడు సమాన భాగాలుగా విడగొట్టి ముగ్గురు కక్క్షి దారులకు పంచాలని ఎనిమిదేళ్ళ క్రితం తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు ఈ వివాదాన్ని విచారించి మధ్యవర్తుల కమిటీ నియమించి ఎనిమిడి వారాల్లోగా అభిప్రాయం చెప్పాలని కోరింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
జి.ఎస్.టి చాలా పరోక్ష పన్నుల స్థానంలో ఒకే ఒక పరోక్ష పన్నును తీసుకొచ్చింది. ఆన్ లైన్ పోర్టల్స్ మొదలైన వాటి ద్వారా పన్నుల చెల్లింపును సులభతరం చేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2017 ఆగస్టులో మరో నాలుగు అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంది. అంతర్జాతీయ లావాదేవీల ధరలను ముందుగానే నిర్ణయించడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు ఒక స్థాయి వరకు భరోసాను కల్పిస్తుంది ఈ స్కీమ్.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
దిగువ స్థాయి న్యాయ స్థానాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయటానికి హైకోర్టులు 2018-2019 సంవత్సరానికి సిద్ధం చేసిన ప్రణాళికను అంద చేయాలని న్యాయ శాఖ కోరింది. జిల్లా స్తాయిలో ఆమోదించిన న్యాయాధికారుల సంఖ్య 2013 డిసెంబరు నాటికి 19518 గా ఉంటే మార్చి 2018 నాటికి 22545 కి పెరిగింది. 2013 డిసెంబరు నాటికి భర్తీ అయిన జిల్లా స్తాయి న్యాయాధికారుల సంఖ్య 15115 ఉంటే మార్చి 2018 నాటికి 17836 కి పెరిగాయి. నవంబరు 2017 నాటికి జిల్లా, అంతకన్నా దిగువ స్థాయిలో ఉన్న నాయస్థానాల్లో 17836 కోర్టు భవనాలు ఉంటె మరో 2824 భవనాలు నిర్మాణం లో ఉన్నాయి.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
న్యాయ శాఖా, సిబ్బంది, ఫిర్యాదులు, మంత్రిత్వ శాఖల స్థాయి సంఘం “న్యాయ మూర్తుల నియామకం లో జరుగుతున్న జాప్యం” మీద ఓ నివేదిక 2016 లో ఇచ్చింది. విధి విధానాలకు సంబంధిచిన అవగాన ఒప్పందం కుడుర్చుకోవటం లో న్యాయ వ్యవస్థకు కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య ఉన్న భేధాభిప్రాయాల గురించి ఈ నివేదిక ఉదహరించింది. ఈ భిన్నాభిప్రాయాలు నేటికీ పరిష్కారం కాలేదు. 99 రాజ్యాంగ సవరణ చట్టం 2014, జాతీయ న్యాయాధికారుల నియామకాల సంఘం చట్టం 2014లు 2015 లో అమల్లోకి వచ్చినా సుప్రీం కోర్ట్ ఈ చట్టాలను కొట్టేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న కోలీజియం వ్యవస్త ద్వారానే నియామకాలు జరిపే పద్దతి పునరుద్ధరించబడింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
2015లో ప్రభుత్వం ప్రగతి ( క్రియాశీల ప్రభుత్వం, సమయ పరిమితిలో అమలు) పథకం ప్రారంభించింది. సాధారణ ప్రజల ఫిర్యాదులు పరిష్కరించేందుకు సమాంతరంగా కీలకమైన ప్రభుత్వ పథకాలు అమలును పర్యవేక్షించటం ఈ పథకం లక్ష్యం. అంతర్గత తనిఖీ వ్యవస్థను బలోపేతం చేయటం లో భాగంగా కేంద్ర గ్రానీనాభివ్రుద్ది శాఖ 2017 లో ఓ నిపుణుల బృందాన్ని నియమించింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
గ్రామీణ ప్రజలకు ఉపాధి, స్వయం ఉపాధి కల్పన లక్ష్యం గా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తోంది. దీన దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అమలు చేస్తోంది. 2018 లో సవరించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం దీన దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పరిధి లోకి సమాచార ప్రసార పరిజ్ఞానం కూడా వస్తాయి. 2014 లో ఉపాధి హామీ పథకం కింద 621 లక్షల మందికి ఉపాధి కల్పిస్తే 2017 లో ఈ పథకం ద్వారా 651 లక్షల మందికి ఉపాధి కల్పించింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
దేశమంతటా పర్యాటకాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టింది. దాని వెబ్ సైట్ ప్రకారం 2019 ఫిబ్రవరి 15 నాటికి 74 మార్గాలలో టూరిజం అభివృద్ధికి అనుమతులు ఇచ్చేశారు.
వర్గం: వ్యవసాయం స్థితి: పురోగతి ఉంది
2017లో వ్యవసాయ శాఖ సముద్ర ఫిషరీస్‌కు సంబంధించి కొత్త పాలసీని నోటిఫై చేసింది. నీలి విప్లవం పథకం కింద ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. 2018లో రూ.7,522 కోట్ల నిధుల్ని కేటాయించి ఫిషరీస్ అండ్ యాక్వాకల్చర్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
జైళ్ల ఆధునికీకరణ అనేది చాలా పెద్ద, జరుగుతూనే ఉన్న ప్రక్రియ. డిజిటైజేషన్ ద్వారా జైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ-జైళ్లు ప్రాజెక్టును అమలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తోంది. విచారణలో ఉన్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఓ వెబ్ ఆధారిత అప్లికేషన్‌ను 2017లో ప్రారంభించింది. జైళ్ల ఆధునికీకరణ పథకాన్ని 2002-03లో ప్రారంభించారు. 2009లో దీని మొదటి దశ పూర్తైంది. రెండో దశను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నప్పటికీ దీనికి ఎలాంటి నిధుల కేటాయింపూ జరగలేదు. అందుకే రెండో దశ ప్రారంభం కాలేదు.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
2017 నుండీ కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలకు చెందిన ప్రజల అభివృద్దికి ఉద్దేశించిన పథకాల అమలును పర్యవేక్షించటానికి కేంద్ర సామజిక న్యాయం సాధికారత శాఖ ఒక ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో దళితులూ, ఆదివాసీ గిరిజనులు అభివృద్ధిని ఉద్దేశించి నడుస్తున్న షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక, షెడ్యుల్ తెగల ఉప ప్రణాళిక, షెడ్యుల్ తెగల అభివృద్ధి కోసం సాంకేతికజోక్యం వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. దళితుల్లో పారిశ్రామిక వేత్తలను అభివృద్ధి చేసే లక్ష్యంతో 2015 లో వెంచర్ కాపిటల్ ఫండ్ ఏర్పాటు చేసాము. ఇందుకు గాను 2018-2019 బడ్జెట్ లో 140 కోట్ల రూపాయలు కేటాయించాము. ప్రభుత్వం నైపుణ్యం పెంచుకునే ఎస్సీ / ఎస్టీ విద్యార్ధులకు రుణాలు, స్కాలర్షిప్ లు, గ్రాంట్లు ఇస్తూనే ఉంది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
దేశమంతటా రవాణా కనెక్టివిటీని పెంచేందుకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వద్ద రకరకాల పథకాలు ఉన్నాయి కాని ఇప్పటిదాకా బహుళ రవాణా పద్ధతులను అనుసంధానించే ప్రాజెక్ట్ ఒక్కటీ లేదు. 2017 మే లో దీని గురించి ఒక జాతీయ స్థాయి సదస్సును మాత్రం నిర్వహించింది. 2. భారత్‌లో సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి భారత్, యూకేల మధ్య ఓ అవగాహన ఒప్పందంపై 2018లో సంతకాలు జరిగాయి.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
దేశ వ్యాప్తం గా ఆన్లైన్ అనుసంధానానికి కావాల్సిన ఇంటర్నెట్ కనెక్టివిటీ, సంబంధిత మౌలిక వసతుల కల్పన దిశ గా డిజిటల్ఇండియా పథకాన్ని 2015లో ప్రారంభించింది కేంద్రం. దాదాపు రెండున్నర లక్షణ గ్రామాలని బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేసే 2017 లో భారత్ నెట్ రెండో దశమొదలైంది. (2011 ఈ పథకం జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పథకం గా మొదలైంది) ఈ పథకం కింద గ్రామ పంచాయతీల్లో వైఫై హాట్ స్పాట్ లు ఏర్పాటు చేసేందుకు కూడా అవకాశం ఉంది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
2015 లో మొదలైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన పథకం ద్వారా విద్యుత్ సరఫరా నాణ్యత పెంచటం, నికరత్వం పెంచటం లక్ష్యం గా ఉంది. 2009 నాటికి విద్యుత్ పంపిణీ లో నష్టాలు 25.47 శాతం గా ఉంటె 2015 నాటికి 21.81 శాతానికి తగ్గాయి.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
రాష్ట్రాలు లేదా ప్రాంతాల అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక కౌన్సిళ్లను ఏర్పాటు చేసే బాధ్యతను నీతి ఆయోగ్ తీసుకుంది. 2018లో హిమాలయ ప్రాంత రాష్ట్రాల మండలి ఏర్పాటైంది.
వర్గం: వ్యవసాయం స్థితి: పురోగతి ఉంది
2015లో ప్రభుత్వం సాయిల్ హెల్త్ కార్డుల పథకాన్ని ప్రారంభించి రైతులకు 2 ఏళ్లకోసారి ఆ కార్డులను అందిస్తోంది. రైతులకు మట్టి నాణ్యతపై అవగాహన కల్పించడమే దాని లక్ష్యం. 12.04కోట్ల హెల్త్ కార్డుల లక్ష్యానికి గానూ 8.13 కోట్ల కార్డుల ఫిబ్రవరి 6 2019 నాటికి జారీ చేసింది. 2014లో దీనికోసం 2389.58 లక్షలను విడుదల చేశార. 2018-19లో 19119.89 లక్షలను విడుదల చేశారు. 2018 మార్చి నాటికి 284 మొబైల్ సాయిల్ టెస్టింగ్ లేబొరేటరీలు వినియోగంలో ఉన్నాయి.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
2010 జాతీయ కక్షిదారు విధానం ముసాయిదా రూపొందింది. ప్రభుత్వం బాధ్యతాయుతమైన కక్షి దారుగా ఉండాలన్నదే ఈ విధానం లక్ష్యం. ఈ ముసాయిదా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వ్యాజ్యాలు తగ్గించటానికి ప్రభుత్వ విధానం శీర్షికన న్యాయ శాఖ ఓ విధాన పత్రాన్ని 2017 విడుదల చేసింది. ఈ విధాన పత్రం లో అనేక పరిష్కారాలు ప్రతిపాదించింది. పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. ఎర్రియర్స్ కమిటీ నియమించాము. న్యాయ మిత్ర పథకం 2017లో ప్రారంభం అయ్యింది. సిబ్బంది కి సంబంధించిన కేసుల విషయం లో వ్యాజ్యాలు తగ్గించటానికి రక్షణ శాఖ ఓ నిపుణుల కమిటీని 2015 లో నియమించింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
2019 ఫిబ్రవరి 8 నాటికి సుప్రీం కోర్టు లో 28 మంది న్యాయమూర్తున్నారు. అందులో ముగ్గురు మహిళలు. హైకోర్టులలో కూడా పరిస్తితి ఇలానే ఉంది. రాజ్యాంగం లో 217, మరియు 224 అధికరణాల మేరకు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది. అయితే ఈ అధికరణాలు స్త్రీలకు లేదా కులాలు, వర్గాల ప్రాతిపదికన రిజర్వేషన్లుకు అవకాశం ఇవ్వలేదు. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకాలకు సిఫార్సులు పంపేటపుడు మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని కేంద్ర న్యాయ శాఖా మంత్రి హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులకు లేఖలు రాసారు. దిగువ స్థాయిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ కొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
జాతీయ న్యాయ సేవల సంస్థ ఇతర న్యాయ సంస్థలతో కలిసి ప్రజలకు గల హక్కులు పట్ల అవగాహన కల్పించేదుకు అనేక చర్యలు చేపట్టింది. 2012-2013 లో 64625 న్యాయ సలహా సహాయ శిబిరాలు ఏర్పాటు చేసాము. 2015-2016 నాటికి ఈ శిబిరాల సంఖ్య 110400 కి పెరిగినది. పాటశాలలు కళాశాలల్లో అనేక న్యాయ సేవ శిబిరాలు అవగాన శిబిరాలు ఏర్పాటు చేసాము. 11, 12 తరగతుల్లో న్యాయ వ్యవస్థ అధ్యనం కూడా ఓ అంశము గా బోధించటానికి కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు ప్రవేశ పెట్టింది. జాతీయ న్యాయ సేవల సంస్థ సలహా మేరకు కళా శాలలో న్యాయ సలహా క్లబ్బులు నిర్వహిస్తున్నాయి.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
నిర్థిష్ట సమయానికి సమర్థ పౌరసేవలను అందించేందుకు, సమాచారాన్ని పొందడంలో పారదర్శకతను పెంపొందించేందుకు 2013లో ఈ-కోర్టు ప్రాజెక్టు ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రెండో దశను అమలు చేస్తోంది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
భారత ఫారిన్ సర్వీసుల్లో నియామక ప్రక్రియను మార్చే ఆలోచనలేవీ లేవని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశాంగా మంత్రి చెప్పారు. మొత్తం ఆమోదం పొందిన ఐఎఫ్ఎస్ క్యాడర్ సంఖ్య 941. 2018 ఆగస్టు 2 నాటికి ఖాళీల సంఖ్య 30. అవసరాన్ని బట్టి అదనపు సెక్యురిటీని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
పట్టణ పేదలకు అందుబాటు ధరల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చే ఉద్దేశంతో రాష్ట్రాలకు తోడ్పాటునందించడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) (పీఎంఏవై(యూ)) పథకాన్ని 2015 నుంచి గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలుచేస్తోంది. 2019 ఫిబ్రవరి 4 నాటికి మొత్తం రూ.1,11,825 కోట్ల రూపాయలతో 72,80,851 ఇళ్ల నిర్మాణాలకు అనుమతి లభించింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
ఈశాన్య భారత్ కోసం రూ.100 కోట్ల మూలనిధితో నార్త్ ఈస్ట్ వెంచర్ ఫండ్‌ను నార్త్ ఈస్ట్రన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఈడీఎఫ్ఐ) ఏర్పాటుచేసింది. ఫుడ్ ప్రోసెసింగ్, ఆరోగ్య భద్రత, పర్యటకం వంటి రంగాల అభివృద్ధికి ఈ నిధులను వెచ్చించారు.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2017 నుండీ నేటి వరకు 330 మంది బంగ్లాదేశీయులను 1770 మంది పాకిస్తానీయులను వెనక్కి పంపాము. 2016 నుండీ సమగ్ర సమీకృత సరిహద్దు పర్యవేక్షణ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా భారత అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ నిఘా అమలు చేస్తున్నాము. అక్రమ వలసదారులను గుర్తించినపుడు వారిని వెనక్కు పంపేంత వరకు ఖైదు చేసి. ఉంచే లా ఖైదు కేంద్రాలు ఏర్పాటు చేసాము. అస్సామ్ లో అక్రమ వలసదారులను గుర్తించేందుకు తిప్పి పంపేందుకు 100 విదేశస్తుల ట్రిబ్యునల్లు ఏర్పాటు చేసాము.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
జవహర్లాల్ విశ్వ విద్యాలయం లో ఈశాన్య రాష్ట్రాలకు విద్యార్థుల కోసం ఈశాన్య రాష్ట్రాల మండలి, ఈశాన్య రాష్ట్రాల అంభివృద్ధి మంత్రిత్వ శాఖల సహకారంతో వసతి గృహాలు నిర్మిస్తున్నాము. ఇటువంటి వసతి గృహాల నిర్మాణానికి గాను జాన్ 2018 లో బెంగుళూరు విశ్వ విద్యాలయం లో కూడా శంకుస్థాపన జరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం లో చదువుతున్న ఈశాన్య రాష్టాల విద్యార్థులకు వసతి ఏర్పాటు చేసేందుకు వీలుగా రోహిణి లో స్థల సేకరణ జరుగుతుంది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
2008లో ఆమోదించిన అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టం ప్రకారం అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు , గుర్తింపు నంబరు కేటాయించేందుకు రు.402.7 కోట్లు తో ప్రణాళిక రూపొందింది. 2017-2018,2018-2019లల్లో అమలు కానుంది. ఈ కార్మికుల కోసం ఓ జాతీయ వేదిక కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 2017 మే లో సమగ్ర రవాణా మరియు లాజిస్టిక్స్ సదస్సును నిర్వహించింది. స్పష్టమైన ప్రణాళికనేదీ రూపొందించలేదు కాని చర్చలు మొదలయ్యాయి. లాజిస్టిక్స్ పార్క్స్ ఏర్పాటుకు స్థలాలను గుర్తించారు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
2018 లో పార్సెల్ కార్గో ఎక్స్ ప్రెస్ రైలు ద్వారా గౌహతికి, మహారాష్ట్రకి మధ్య రోడ్డు కనెక్టివిటీని ఏర్పరచారు. ఈశాన్య రాష్ట్రాల నుండి వ్యవసాయోత్పత్తులను ముంబయి, బెంగళూరు, నాగపూర్, పూణే తదితర నగరాలకు చేరవేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 2017 లో కోల్డ్ చెయిన్ డెవలప్మెంట్ నేషనల్ సెంటర్ త్వరగా పాడైపోయే వ్యవసాయోత్పత్తుల రవాణాపై ఒక నివేదిక తీసుకొచ్చింది. అందులో త్వరగా పాడైపోయే పళ్ళు, కూరగాయలలో 1.9 శాతం రైళ్ళ ద్వారా, 97.4 శాతం రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతున్నట్టు పేర్కొన్నారు. రైల్వే శాఖ ఇటువంటి వస్తువుల రవాణా కోసం రిఫ్రిజిరేటర్ వ్యాన్ సర్వీస్ ను ప్రవేశపెట్టింది. డిమాండ్ లేకపోవడం వల్ల ఈ సర్వీస్ పెద్దగా ఉపయోగపడడం లేదు కాని 2017 లో అముల్ సంస్థ 17 మెట్రిక్ టన్నుల వెన్నను ఈ వ్యాన్ లోనే పాలంపూర్ నుండి ఢిల్లీ పంపింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
దేశంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్వాధీనం లో ఉన్న విమానాశ్రయాల ఆధునీకరణ/అభివృద్ధి/మెరుగుదల పనులు చేపట్టే నిమిత్తం 25000 కోట్ల.రూపాయల మౌలిక వ్యయ ప్రణాళిక రూపొందించింది. 2016లో పౌర విమానయాన శాఖ జాతీయ పౌర విమానయాన విధానాన్ని ప్రకటించింది. పౌరవిమాన యాన రంగంలో ప్రయివేట్ పెట్టుబడులు ఆహ్వానించటమే ఈ విధానం లక్ష్యం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఈ రంగాన్ని అభివృద్ధి చేయటం జాతీయ పౌర విమానయాన విధాన ఉద్దేశ్యం.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
2000 సంవత్సరం లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మొదలైంది. రహదారి మార్గం తో అనుసంధానం కానీ గ్రామలన్నింటినీ అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునే విధంగా మన్నికైన రహదారులతో అనుసంధానం చేయాలన్న మొదటి దశ లక్ష్యాన్ని నెరవేర్చే గడువును 2019 మార్చి కి పొడిగించటం జరిగింది. ఈ పథకం మొదలైన నాటి నుండి ఫిబ్రవరి 6, 2019 వరకు 1.45 లక్షల నివాస ప్రాంతాలు కవర్ చేసాము.
వర్గం: వ్యవసాయం స్థితి: పురోగతి ఉంది
ప్రస్తుత పథకాలను కొనసాగించడం ద్వారా, నిధుల కేటాయింపులను పెంచడం ద్వారా ప్రభుత్వం గ్రామీణ రుణ సదుపాయాల మీద గట్టిగానే శ్రద్ధ చూపుతోంది. 2006-7 నుండి ప్రభుత్వం ఏడాది లోగా తిరిగి చెల్లించే ప్రాతిపదికపై తక్కువ వడ్డీకి స్వల్ప కాలిక పంట రుణాలను అందిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డుల పథకాన్ని కూడా కొనసాగిస్తోంది. బీజేపీ ప్రభుత్వం వచ్చాక డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు గాను ఈ కార్డులను రూపే కార్డులుగా మార్చింది. చిన్న, సన్నకారు రైతులకు కూడా సంస్థాగత రుణ పథకాలను వర్తింపచేసేందుకు బ్యాంకులు జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (ఉమ్మడి పూచీకత్తుపై రుణాలు) ను ప్రోత్సహించాయి. 2017 మార్చి నాటికి బ్యాంకులు మొత్తం 24.53 లక్షల గ్రూపులకు 26,848.13 కోట్ల రూపాయల రుణాలను అందజేశాయి. వ్యవసాయ రుణాల లక్ష్యం 2015-16 లో 8,50,000 కోట్లు అయితే ప్రభుత్వం దానిని 2018-19 సంవత్సరానికి 11,00,000 కోట్లకు పెంచింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అస్సాం లోని లంబడింగ్-సిల్చార్ రైలు మార్గాన్ని బ్రాడ్ గేజ్ గా మార్చటంతో బారక్ లోయ దేశ ప్రధాన స్రవంతి తో అనుసంధానం అయ్యింది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
2020 నాటికి తూర్పు మరియు పశ్శిమ ప్రత్యేక ఫ్రాయిట్ కారిదార్ల నిర్మాణం పూర్తి కావాలన్న లక్ధ్యంతో ప్రభుత్వము పని చేస్తుంది. ఈ కారిడార్ల నిర్మాణం వివిధ దశల్లో పురోగమిస్తోంది.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
2010లో అప్పటి ప్రభుత్వం వివిధ విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు మధ్య పరిశోధనా విషయాలు ఫలితాలు ఇచ్చి పుచ్చుకునేందుకు జాతీయ కాలెడ్జ్ నెట్వర్క్ ను ప్రతిపాదించినది. 2014 నవంబరు 30 నాటికి 1354 సంస్థలను అనుసంధానం చేయటం జరిగింది. మార్చి 3, 2019 నాటికి ఈ పథకం ద్వారా అనుసంధానించబడిన సంస్తల సంఖ్య 1693 కి పెరిగింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
రైల్వే వ్యవస్థను ఆధునికీకరించే పని భారత్‌లో నిరంతరం జరుగుతూ ఉంటుంది. 2000 సంవత్సరం ఆరంభం నుంచి ఇప్పుడు వాడుతున్న కోచ్ ల స్థానంలో ఎల్.హెచ్.బి కోచ్ లను ప్రవేశపెట్టే పని జరుగుతోంది. స్టేషన్ లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటే చేసే పని కూడా పెద్దఎత్తున సాగుతోంది. 2017 సెప్టెంబర్ లో ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం కింద బులెట్ ట్రైన్ నిర్మాణానికి జపాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు 6762 రైల్వే స్టేషన్ లకు పూర్తి స్థాయిలో ఎల్.ఇ.డి దీపాలను అమర్చారు. అన్ని విషయాలలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునేందుకు 2017 లో ‘టెక్నాలజీ మిషన్ ఫర్ ఇండియన్ రైల్వేస్’ అనే పథకాన్ని ఆమోదించారు.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
భూగర్భజలాల వినియోగంపై కేంద్ర భూగర్భ జల సంస్థ 2018 లో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ తిరస్కరించినది. 2017లో జారీ అయిన జల నాణ్యత పర్యవేక్షణ మార్గదర్శన సూత్రాల మేరకు ఏడాదికి రెండు సార్లు ఈ పర్యవేక్షణ జరుగుతుంది. 2016 లో జారీ అయిన నమూనా భవన నిర్మాణ నిబంధనలు కూడా వర్షపు నీటిని వినియోగంలోకి తేవాలన్న షరతు విధించాయి.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకాన్ని ఈ ప్రభుత్వం పునర్నిర్మాణం చేసింది. తాజా పరచబడిన పథకం ప్రకారం అన్ని గ్రామాలకు అన్ని కుటుంబాలకు పైఫుల ద్వారా రక్షిత తాగునీరు సరఫరా చేసేందుకు 2030 తుది గడువు గా నిర్ధారించతమైనది. 2012 నాటి జాతీయ జల విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. జల వినియోగంలో సామర్ధ్యం పెంపొందించటం, పరిరక్షించటాన్ని ప్రోత్సహించడం ఈ విధానం లక్ష్యం. దేశంలో పరిశుభ్రత, వ్యర్ధపదార్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం లక్ష్యాలుగా 2014 చివరి నుండీ స్వచ్ఛ భారత్ అభియాన్ నడుస్తోంది. మాన్నికైన సేద్యం మిషన్ లో భాగంగా పంట పొలాల్లో సాగునీరు సద్వినియోగం చేయడానికి ఉద్దేశించిన పథకం.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
పాఠశాలల్లో క్రీడలు ప్రధాన విద్య లో భాగంగా మార్చే ప్రతిపాదన ఏదీ లేదు. క్రీడలు విద్యేతర విషయం గానే ఉంది. వేర్వేరు విద్యా బోర్డులు వేర్వేరు సంస్థలు ఈ విషయంలో విచక్షణ తో వ్యవహరిస్తున్నాయి. 2018లో ఒక ఉపన్యాసంలో ఉప రాష్ట్రపతి క్రీడలు కూడా తప్పని సరి పాఠ్యంశంగా చేయాలని పిలుపునిచ్చారు. అప్పటి నుండీ ఆ విషయంలో కొత్తగా పురోగతి ఏమీ లేదు. కళాశాలలు పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు 2017 నుండీ ఖేలో ఇండియా కార్యక్రమం అమలు జరుగుతోంది. కళాశాలలు పాఠశాలల్లో క్రీడలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొన్ని సంస్థలు క్రీడా సంఘాలను గుర్తించింది. దేశవ్యాప్తంగా కళాశాలలు పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు భారతీయ క్రీడా సంస్థ 8-25 వయసులో ఉన్న విద్యార్థుల్లో ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసేందుకు అనేక చర్యలు తీసుకొంటోంది. ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలా ఎంపిక చేసిన ప్రతిభావంతులను జాతీయ అంతర్జాతీయ క్రీడలకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేస్తోంది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
మధ్యాహ్న భోజనం పథకం కింద 2015 లో 11.5 లక్షల పాఠశాలల్లో 10 కోట్ల మంది విద్యార్థులున్నారు. 2017లో పాఠశాలల సంఖ్య 11.3 లక్షలకు విద్యార్థుల సంఖ్య 9.5 కోట్లకు తగ్గింది. ఈ పథకం కింద 2015 లో 9912.21 కోట్లు వెచ్చించింది ప్రభుత్వం. ఈ ఖర్చు 2017 నాటికి 9075.76 కోట్లకు తగ్గింది. ఆహారం నాణ్యత గురించి మొత్తం 57 ఫిర్యాదులు వచ్చాయి. 2018 లో20 ఫిర్యాదులు వచ్చాయి. ఇంకా 16 ఫిర్యాదులకు సమాధానం రావాల్సి ఉంది. భోజనం వండటానికి అయ్యే ఖర్చు దఫాదఫాలుగా సమీక్ష జరుగుతుంది. 2018 లో ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థికి భోజనానికి 4.35 రూపాయలు అవుతుంది. ఉన్నత పాఠశాల విద్యార్థికి 6.51 రూపాయలు అవుతుంది. ఆ వ్యయం భరించటానీకి సంబంధించి 2015 లో నిర్ణయం అయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాను పునః సమీక్ష చేశాము.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
2016 లో వ్యర్ధ పదార్ధాల నిబంధనలు సవరించబడ్డాయి. తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త వేరువేరు చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు కూడా అదే విధంగా వేరు చేయాలి. కంపోస్టు బావులు, వర్మీ కంపోస్టు, బయోగాస్, తక్కువ ఖర్చుతో మురుగు కాల్వలు, మురుగు ఎండటానికి అవకాశం, మురుగు నీరు శుద్ధి చేసి ఉపయోగానికి సిద్ధం చేయటం, ఇళ్లల్లో పొగుపడే చెత్తను వేరు చేయటం వంటి విషయాలు సవరించిన మార్గదర్శక సూత్రాల్లో ఆసక్తికరంగా మారాయి. కంపోస్టు బావులు, వర్మీ కంపోస్టు, బయోగాస్, తక్కువ ఖర్చుతో మురుగు కాల్వలు, మురుగు ఎండటానికి అవకాశం, మురుగు నీరు శుద్ధి చేసి ఉపయోగానికి సిద్ధం చేయటం, ఇళ్లల్లో పొగుపడే చెత్తను వేరు చేయటం వంటి విషయాలు సవరించిన మార్గదర్శక సూత్రాల్లో ఆసక్తికరంగా మారాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ పట్టణ ప్రాంత స్థానిక సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ ఉంది. కాలుష్య నివారణ కోసం ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన కలిగించటానికి సభలు సమావేశాలు జరుపుతుంది
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
భారతదేశంలో వైద్య రంగాన్ని నియంత్రించేందుకు అనేక సంస్థలు వ్యవస్థలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ( నియంత్రణ , రిజిస్ట్రేషన్) చట్టం 2010 ఆధారంగా 2012లో జారీ అయిన నిబంధనలను కొనసాగుస్తుంది. 2013 లో జాతీయ నాణ్యత ప్రమాణాలు పథకం అమల్లోకి వచ్చింది. ఈ ప్రమాణాలు ప్రభుత్వ వైద్య సేవల కు వర్తిస్థాయి. భారతీయ వైద్య మండలి దేశంలో వైద్య విద్య అర్హతలను గుర్తించటం, వైద్య కళాశాలలకు గుర్తింపు ఇవ్వటం, వైద్య సేవలు అందించే నిపుణులకు గుర్తింపు ఇవ్వటం, వైద్య సేవలు పర్యవేక్షణ వంటి బాధ్యతలు నెరవేరుస్తుంది. వైద్యపరికరాలు దిగుమతి వ్యాపారం తయారీ నియంత్రణకు 2017 లో వైద్య పరికరాల నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
జాతీయ వైద్య మిషన్ 2005 కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత వహిస్తున్నాయి. ఈ పథకం కింద సృజనాత్మకత, మానవ వనరుల అబ్బివృద్ధి, వైద్య పరికరాల తయారీ, ఔషధాలు, పరీక్షల వ్యవస్థ లు వంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. 2017-2018 గ్రామీణ వైద్య గణాంకాల మేరకు వైద్య ఉప కేంద్రాల్లో 18 శాతం, లరాధమి6 వైద్య కేంద్రాల్లో 22 శాతం, కమ్యూనిటీ వైద్య కేంద్రాల్లో 30 శాతం వైద్య వసతులు కొరవడ్డాయి.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: పురోగతి ఉంది
భారత్‌కు ఇతర దేశాలకూ మధ్య సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఒప్పందాలను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అమలు చేస్తోంది.వ్యవసాయం , మెడికల్ బయోటెక్నాలజీ తదితర రంగాల్లో భారత్ ఇజ్రాయెల్ మధ్య కొత్త పరిశోధనా ప్రాజెక్టులు అమల్లోకి వచ్చాయి. రెండు దేశాలూ బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కలిసి పనిచేయాలని రెండు దేశాలూ నిర్ణయించాయి.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
జాతీయ వైద్య మిషన్ పరిధిలో టెలి మెడిసిన్ అందించే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపే పథకాలకు కేంద్రం ఆర్ధిక సహాయం అందిస్తుంది. జాతీయ వైద్య ప్రణాళికలో ఉన్న అనేక అంశాలను ప్రజలకు అందుబాటులో కి తెచ్చేందుకు అనేక మొబైల్ ఆధారిత అప్లికేషన్ లు తయారవుతున్నాయి.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
2014 లో స్వచ్ఛ భారత్ అభియాన్ మొదలైంది. బహిర్భుమికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటింటికీ మరుగుదొడ్డి అందుబాటులో కి తేవటం ఈ ఉద్యమం లక్ష్యం. డిసెంబర్ 2018 నాటికి దేశంలో 559 జిల్లాలు బహిర్భూమి అవసరం లేని జిల్లాలుగా నిర్ధారించబడ్డాయి. ఈ పథకం కింద 2015లో 6363 కోట్లు విడుదల చేస్తే 2017 నాటికి 16611 కోట్లకు పెరిగింది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
2016 లో వ్యర్ధ పదార్ధాల నిబంధనలు సవరించబడ్డాయి. తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త వేరువేరు చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు కూడా అదే విధంగా వేరు చేయాలి. కంపోస్టు బావులు, వర్మీ కంపోస్టు, బయోగాస్, తక్కువ ఖర్చుతో మురుగు కాల్వలు, మురుగు ఎండటానికి అవకాశం, మురుగు నీరు శుద్ధి చేసి ఉపయోగానికి సిద్ధం చేయటం, ఇళ్లల్లో పొగుపడే చెత్తను వేరు చేయటం వంటి విషయాలు సవరించిన మార్గదర్శక సూత్రాల్లో ఆసక్తికరంగా మారాయి. కంపోస్టు బావులు, వర్మీ కంపోస్టు, బయోగాస్, తక్కువ ఖర్చుతో మురుగు కాల్వలు, మురుగు ఎండటానికి అవకాశం, మురుగు నీరు శుద్ధి చేసి ఉపయోగానికి సిద్ధం చేయటం, ఇళ్లల్లో పొగుపడే చెత్తను వేరు చేయటం వంటి విషయాలు సవరించిన మార్గదర్శక సూత్రాల్లో ఆసక్తికరంగా మారాయి.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
నదుల అనుసంధానం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి, జల వనరుల అభివృద్ధికోసం నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్‌ను డిసెంబరు 2015లో ప్రారంభించారు. 30 మార్గాల్లో ఈ అనుసంధానం సాధ్యమేనని, వీటిలో నాలుగు మార్గాలకు ప్రాధాన్య హోదా ఇవ్వాలని 2018 మార్చి నాటికి గుర్తించారు.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. 2030 నాటికి ప్రతి ఇంటికీ పైపులైన్ల ద్వారా నీళ్లు సరఫరా చేయాలన్నది లక్ష్యం. 2019 ఫిబ్రవరి 5 నాటికి 12.4శాతం మంతి గ్రామీణులకు సురక్షిత నీటి లభ్యత లేదు. 2016లో అది 14శాతంగా ఉండేది. 2017లో ఎన్ఆర్డీడబ్ల్యుపీపై కాగ్ సర్వే చేసి అది లక్ష్యాలను అందుకోవడంలో విఫలమైనట్లు తేల్చింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: పురోగతి ఉంది
2014 లో రీసర్చ్, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్.డి.ఎస్.ఒ) కి రూ.216.11 కోట్లు కేటాయించారు. 2016 లో ఈ కేటాయింపులను 313.10 కోట్లకు పెంచారు. 2017 లో మొదలుపెట్టిన టెక్నాలజీ మిషన్ దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తుంది. రవాణా రంగంలో దీర్ఘకాలిక పరిశోధన, అభివృద్దిని ప్రోత్సహించడానికి ‘శ్రేష్ట’ (వ్యూహాత్మక సాంకేతిక మరియు సమగ్ర అభివృద్ధికై ఉద్దేశించిన ప్రత్యేక రైల్వే సంస్థ) ను నెలకొల్పుతున్నట్టు రైల్వే మంత్రి 2016-17 బడ్జెట్ ఉపన్యాసంలో ప్రకటించారు. పూర్తి ప్రాజెక్ట్ నివేదిక తయారవుతోంది. ఇండియా ఇప్పటిదాకా తన కోచ్ లకు ఎక్కువగా జర్మన్ డిజైన్ లను వాడింది. 2017 నుంచి చక్రాలు మినహా మిగతా కోచ్ లను ఎల్.హెచ్.బి పద్ధతిలో సొంతంగా తయారు చేస్తోంది. దానిపై పరీక్షలు జరుగుతున్నాయి. రైళ్ళు ఒకదానితో ఒకటి గుద్దుకోకుండా ఉండే సాంకేతిక వ్యవస్థ ‘టి.సి.ఎ.ఎస్’ కూడా ఇప్పుడు ప్రయోగాత్మక దశలో ఉంది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
2017లో పోషణ్ అభియాన్‌ను తీసుకొచ్చారు. పిల్లలు, గర్భవతులు, బాలింతలకు పోషకాహార లభ్యతను పెంచడం దీని ఉద్దేశం.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
దేశంలో ఆరోగ్య పరిస్థితులపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఎప్పటికప్పుడు అధ్యయనాలు నిర్వహిస్తోంది. రాష్ట్రాలు తమ సొంత పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుంది. 2017లో ప్రభుత్వం జాతీయ హెల్త్ పాలసీ 2017ను ప్రవేశపెట్టింది. 2015లో ఎన్సీడీ గ్లోబల్ మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్ అండ్ యాక్షన్ ప్లాన్‌ను స్వీకరించిన తొలి దేశం భారతే. ప్రభుత్వం ఎన్పీడీసీఎస్ను కూడా 2008 నుంచి అమలు చేస్తోంది.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: పురోగతి ఉంది
ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అత్యవసర సేవల కోసం 112 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 112 ఇండియా మొబైల్ యాప్ కూడా ఉంది. పౌరుల కోసం ఈఆర్ఎస్ఎస్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2018లో 112 మొదట అమల్లోకి తెచ్చిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.
వర్గం: పరిపాలన స్థితి: పురోగతి ఉంది
వరల్డ్ వాటర్ కౌన్సిల్ (డబ్ల్యూడబ్ల్యూసీ) 2017లో చేసిన ఓ సర్వే ప్రకారం.. గత 5 ఏళ్లలో తాగునీటి ప్రమాణాలు పెరిగాయి.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్ఎస్ఎంఏ) కింద బాలికలకు స్వీయ రక్షణపై శిక్షణను 2009 నుంచి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సమగ్ర శిక్షణ పేరుతో ప్రస్తుత పాఠశాల విద్యా పథకాలన్నింటినీ విలీనం చేస్తూ ఓ సరికొత్త పథకాన్ని 2018లో ప్రభుత్వం ప్రారంభించింది. సమగ్ర శిక్షణ పథకం కింద స్వీయ రక్షణ పద్ధతులపై 6 నుంచి 12 వ తరగతి వరకూ విద్యార్థినులు శిక్షణ తీసుకునే అవకాశం ఉంది. దీన్ని స్కూలు పాఠ్యప్రణాళికలో తప్పనిసరిగా భాగం చేయాల్సిన అవసరం లేదు. ఇదొక పాఠ్యేతర ప్రణాళిక (ఎక్స్ట్రా కరిక్యులర్) కార్యక్రమంగా భావించవచ్చు.
వర్గం: మైనారిటీలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
‘మతపరమైన స్వేచ్ఛ విషయంలో భారత్ తిరోగమిస్తోంది’ అని 2016 వార్షిక నివేదికలో యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ తెలిపింది. 2019లో ఇంటర్ ఫెయిత్ స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వర్గం: పరిపాలన స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
న్యాయ వ్యవస్థ లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 1993-94 లో మొదలైన కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఆగస్టు 2018 నాటికి 6355.79 కోట్ల రూపాయలు కేటాయించాము. 2017-2018 ఆర్ధిక సంవత్సరం లో ఈ పథకం కింద 621.21 కోట్లు కేటాయించగా పూర్తిగా ఖర్చు పెట్టాము. 2018-2019 ఆర్ధిక సంవత్సరానికి గాను 622 కోట్లు కేటాయించాము. న్యాయస్థానాల ఆధునీకరణకు ప్రత్యెక నిధులు ఏవీ కేటాయించలేదు. దిగువ స్థాయి న్యాయస్థానాల్లోఈ కోర్టులు మిషన్ మోడ్ ప్రాజెక్టు ద్వారా న్యాయ పరిపాలన లో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ రెండో దశ (2015-2019)లో ఆగస్టు 2018 వరకు 1670 కోట్లు కేటాయించి అందులో 1073.18 కోట్లు ఖర్చు పెట్టాము.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
బంజరు భూముల అభివ్రుద్ధికి ఎటువంటి పదకమూ ప్రభుత్వం వద్ద లేదు. ప్రధానమంత్రి కృషి సిచాయి యోజన పథకం లో వాటర్ షెడ్ల అభివృద్ధి విభాగం కింద 2009-2010 నుండి 2014-2015 మధ్య కాలం లో 8214 వాటర్ షెడ్లు అభివృద్ధికి అనుమతి మంజూరు అయ్యింది. వర్షా భావ ప్రాంతాలు బంజరు భూములకు సాగునీరు అందించటం ఈ అనుమతుల లక్ష్యం. ఈ ప్రాజెక్టుల అమలు వేర్వేరు దశల్లో ఉంది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
ప్రభుత్వం ఎలక్ట్రానిక్ పరిపాలన పథకం కింద అనేక శాఖలు విభాగాలను నేరుగా ప్రజలతో అనుసంధానం చేస్తూ పలు రకాలైన పోర్టల్స్ ప్రారంభించింది. అయితే వీటిలో ఏదీ ప్రభుత్వానికి పరిశ్రమలకు మధ్య అనుసంధానం కల్పించే మిషన్ గా లేదు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
2002 లో ఆమోదించిన బహు రాష్ట్రీయ సహకార సంఘాల చట్టానికి 2010 లో సవరణలు ప్రతిపాదించినా ఇంకా ఆమోదం పొందలేదు
వర్గం: మహిళలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
గత ప్రభుత్వాలు ప్రారంభించిన వయోజన విద్య పథకాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితాలు వచ్చే పథకం ఏమీ లేదు.
వర్గం: మహిళలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
డిసంబరు 2013 నాటికి దేశ వ్యాప్తంగా మహిళల లోసం 1431 ఐ టి ఐ లు, లేదా ఐ టి ఐ లలో మహిళా శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 82390 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. రాజ్య సభకు ఇచ్చిన సమాధానం లో నైపుణ్య అబివృద్ది మరియు పారిశ్రామిక వేత్తల శిక్షణ శాఖ దేశం లో 2016-2017 లో మొత్తం 1408 ఐ టి ఐ లు / ఐ టి సి లు లో 135459 మంది శిక్షణ పొందారు. ఐ టి ఐ లలో విద్యార్ధినులకు 30 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి.
వర్గం: మహిళలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
చిన్న మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి పథకం కొనసాగుతోంది. ఈ పథకం కింద ఒకే స్వభావం ఉన్న పరిశ్రమలను ఒక తరగతి గా గుర్తించటం జరుగుతుంది. ఇదే తరహా లో మహిళా యాజమాన్యం లో ఉన్న చిన్న మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఉత్పత్తులు అందుకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం ఆధారం గా ఈ క్లస్టర్ ఏర్పాటు ఉంటుంది. మహిళా యాజమాన్యం లో ఉన్న పరిశ్రమలకు అందించే ఆర్ధిక సహకారం గురించి కూడా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిచటానికి అనేక కొత్త పథకాలు ప్రారంభించటం తో పాటు గతం నుండీ అమలు జరుగుతున్నా పథకాలను కూడా కొనసాహిస్తోంది.కొనసాగిస్తోంది. .
వర్గం: మైనారిటీలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
2018లో సేవా భోజ్ యోజనను ప్రభుత్వం ప్రారంభించింది. 2018-20కి గాను రూ.325 కోట్లను కేటాయించారు. కానీ వాలంటీర్లు ఎవరనేది ఈ పథకం నిర్వర్తించలేదు. రాష్ట్రాలు, ఎన్జీవోలే వాటిని గుర్తించాల్సి ఉంటుంది.
వర్గం: మహిళలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్ లో ఇంకా ఆమోదం పొంద లేదు.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
ఆహర నాణ్యతపై డ్రగ్స్ అండ్ ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం దృష్టిపెడుతుంది. పోషకాహారం అనేది ఆరోగ్య విభాగంలోకి వస్తుంది. ఔషదాలకు సంబంధించి ప్రత్యేక విభాగం ఉంది. ఇవన్నీ విలీనం కాలేదు.
వర్గం: మహిళలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
2014లో ప్రారంభించబడిన భారతీయ మహిళా బ్యాంకు ని1 ఎప్రిల్ 2017 ఎస్ బి ఐ లో విలీనం చేసింది. అప్పటికి ఈ బ్యాంకుకు 113 శాఖలున్నాయి. ఏవీ సంచార శాఖలు కాదు.
వర్గం: నైపుణ్యం, సామాజిక అభివృద్ధి స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
నివాస ప్రాంతాల్లో క్రీడా సదుపాయాలు కల్పించేదుకు ప్రస్తుతం అవకాశాలు లేవు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. అయితే ఇళ్ళ విస్తీర్ణం ఎంత ఉండాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. అదనపు సౌకర్యాలు కూడా ఏమేమి కల్పించాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. కానీ ఈ అదనపు సౌకర్యాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయదు.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
2007 లో కంటోన్మెంట్ ల పరిధి లో ఉన్న రక్షణ శాఖ కు సంబంధించిన భూముల రికార్డులను కంప్యూటరీకరణ చేసేందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ తో కలిసి డిఫెన్స్ ఎస్టేట్స్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం కృషి చేసింది. ఈ విధం గా కంప్యూటరీకరించబడిన రికార్డునలు 2011 లో ప్రజలు అందుబాటులోకి తెచ్చింది. ఇది నిరంతర ప్రక్రియ. ఈ పథకం కింద అదనపు చొరవ ప్రదర్శించ లేదు.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
2015 లో మాజీ సైనికుల కోసం జాతీయ సంఘం ముసాయిదా బిల్లు తయారయ్యింది. ఈ కాలంలో అదనపు పురోగతి ఏమీ లేదు.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
హరియాణాలోని బినోలలో ఇండియన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు 2010లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికీ అది ఇంకా నిర్మాణంలోనే ఉంది.ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వలేదు.
వర్గం: సైన్స్, రక్షణ స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
జాతీయ జలయాన సాధికార సంస్థ ఎర్పాటు
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
వివిధ దేశాల మధ్య విద్యార్థుల మార్పిడి పథకంపై ఎలాంటి పురోగతీ లేదు.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2000 సంవత్సరం లో జాతీయ ఔషధ మొక్కల బోర్డు ఏర్పాటు అయ్యింది. 2007-2008 నుండీ ఔషధ మొక్కల పరిరక్షణ, అభివృద్ధి, యాజమాన్యం లక్ష్యాతో కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి అమలు జరుగుతోంది. 2013-2014 నుండీ జాతీయ ఆయుష్ మిషన్ పేరుతో మరో పథకం కూడా అమలు జరిగుతుంది. ఈ పథకాల్లో కూడా ఔషధ మొక్కల పరిరక్షణ సంబంధిత అంశాలు ఉన్నాయి. ఈ రంగంలో కొత్త పథకాలు ఏమీ మొదలు పెట్టలేదు.
వర్గం: ఆరోగ్యం, విద్య స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
హిమాలయన్ టెక్నాలజీ కోసం ప్రత్యేకంగా ఓ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని 2015లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. అప్పటి నుంచి దీని ఏర్పాటుపై ఎలాంటి పురోగతీ లేదు.
వర్గం: పరిపాలన స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
మోదీ ప్రభుత్వం తమ మొదటి సంవత్సరంలోనే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించింది. ఇది 2014 డిసెంబర్ 31 న నోటిఫై అయ్యింది. అయితే, ఇది రాజ్యాంగ వ్యతిరేకం అంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దీన్ని కొట్టిపారేసింది.
వర్గం: పరిపాలన స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ-భాష పేరుతో ఓ ప్రాజెక్టును ప్రారంభించాలని 2015లో రాష్ట్రపతి ప్రతిపాదించారు. కానీ దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి పురోగతీ లేదు. పార్లమెంటులో గానీ, అధికారిక వెబ్సైట్లలో గానీ దీనిపై ఎలాంటి ప్రస్తావనా లేదు.
వర్గం: పరిపాలన స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
జాతీయ లిటిగేషన్ విధానం, 2010 ని ప్రభుత్వం సమీక్షించింది. జాతీయ లిటిగేషన్ పాలసీ, 2015 ను అమల్లోకి తెచ్చే అంశం మూడేళ్లుగా పరిశీలనలో ఉంది. ఇప్పటివరకూ ఇది అమల్లోకి రాలేదు.
వర్గం: పరిపాలన స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
బీజేపీ ప్రభుత్వం ‘ఒక దేశం, ఒక ఎన్నికలు’ అనే ప్రతిపాదన తెచ్చింది కాని దానికి రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. రాజకీయ పార్టీల మధ్య దీని విషయమై ఏకాభిప్రాయం లేదు. లా కమిషన్ 2018 లో ఒక ముసాయిదా నివేదికను విడుదల చేసింది. న్యాయ మంత్రిత్వ శాఖ స్థాయీ సంఘం కూడా దాని సాధ్యాసాధ్యాలపై 2015 లో ఒక నివేదిక విడుదల చేసింది.
వర్గం: పరిపాలన స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
గ్రామ పంచాయతీలకు పనితీరు ప్రాతిపదికగా గ్రాంట్లు ఇవ్వాలని నిర్ణయించారు. 2016 -17 లో అన్ని రాష్ట్రాలలోని పంచాయతీలకు కలిపి ఈ పథకం కింద 3499.45 కోట్లు పంపిణీ చేశారు. 2017-18 లో 1106.90 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు.
వర్గం: పరిపాలన స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
చాలా ప్రభుత్వ శాఖలు ఇప్పుడు PPP మోడల్ ను అనుసరిస్తున్నాయి. అయితే దీనిలో ప్రజల భాగస్వామ్యాన్ని చేర్చుతూ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్ షిప్స్ మోడల్ ను ప్రతిపాదించారు. అయితే నిర్దిష్టంగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు
వర్గం: పరిపాలన స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
దేశీయ పశు జాతి రకాల పరిరక్షణకు 2014 డిసెంబర్ లో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ను ప్రారంభించారు. మాంసం కోసం పశువుల అమ్మకంపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం 2018 లో తొలగించింది.
వర్గం: పర్యావరణం, ఇంధనం స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
భూ విజ్ఞాన (ఎర్త్ సైన్సెస్) మంత్రిత్వ శాఖ 2015 లో రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా నిధిని ఇంకా ఏర్పాటు చేయలేదని చెప్పింది. దాని మీద ఆ తర్వాత ఎటువంటి సమాచారం లేదు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
భారీ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రానికి మధ్య ఎలాంటి ఉమ్మడి వ్యవస్థ లేదు. ఒక్కో శాఖ వేరువేరుగా అనుమతులు ఇస్తున్నాయి.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
నిత్యావసర వస్తువుల చట్టం, బ్లాక్ మార్కెటింగ్ నివారణ చట్టం అమలు గురించి ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ ఉంటుంది. అయితే అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను మాత్రం నెలకొల్పలేదు.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ) పునర్నిర్మాణం గురించి సూచనలు చేయవలసిందిగా కోరుతూ 2014 లో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. అయితే 2016 లో వారు ఇచ్చిన నివేదికలో సంస్థ వికేంద్రీకరణకు సంబందించిన సూచనలు ఏమీ లేవు.
వర్గం: ఆర్థిక వ్యవస్థ స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
2017 ఎఫ్.డి.ఐ పాలసీ ప్రకారం మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపార రంగంలో 51 శాతం వరకు పెట్టుబడులను అనుమతించాలి. ఇప్పటికీ అదే అమల్లో ఉంది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
ప్రభుత్వం 2014-15 బడ్జెట్లోనే ఎగుమతుల ప్రోత్సాహ పథకాన్ని ప్రకటించింది కాని దానికి సంబంధించిన చర్యలేమీ తీసుకోలేదు. అయితే వివిధ ఇతర పథకాలు, మండళ్ళ ద్వారా ఎగుమతుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
బీజేపీ ప్రభుత్వం వచ్చాక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేయలేదు. ఆఖరి టాస్క్ ఫోర్సు ఏర్పాటు 2009 లో గత ప్రభుత్వ హయాంలో జరిగింది.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986, అటవీ (పరిరక్షణ) చట్టం, 1980, వన్యమృగ (రక్షణ) చట్టం మొదలైన పర్యావరణ చట్టాల పునః పరిశీలనకు 2014 లో ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీ సమర్పించిన నివేదికను పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిశీలించింది. వారి సిఫార్సులలో ఒక ఏకీకృత పర్యావరణ చట్టం, ఒక జాతీయ స్థాయి పర్యావరణ సంస్థ, పర్యావరణ అనుమతులను ఇచ్చే ప్రక్రియల క్రమబద్దీకరణ మొదలైనవి ఉన్నాయి. కాని వీటి మీద ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం, 2010 లలో మార్పులు చేయాలని భావించి 2015 లో ఒక ముసాయిదా సవరణ బిల్లును కూడా తయారు చేసింది ప్రభుత్వం. అయితే ఆ విషయంలోనూ ఎలాంటి పురోగతి లేదు.
వర్గం: వాణిజ్యం, పరిశ్రమలు స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
వడ్డీ రేట్ల క్రమబద్దీకరణకు ఎటువంటి చర్యా తీసుకోలేదు. 2016 లో ప్రభుత్వం కొన్ని జాతీయ చిన్న పొదుపు మొత్తాల పథకాలను మదింపు చేసి వాటి వడ్డీ రేట్లకు కొత్త ప్రామాణికాన్ని నిర్ణయించింది. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ “ మొత్తంగా చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ఇచ్చే గృహ రుణాలు, వాహన రుణాలపై వడ్డీ రేట్లు 2008-2018 మధ్య తగ్గాయ”ని చెప్పారు.
వర్గం: వ్యవసాయం స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
అలాంటి కార్పొరేషన్ ఏర్పాటేదీ జరగలేదు. దాని బదులుగా ప్రభుత్వం వివిధ పథకాలను తీసుకొచ్చింది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 2015లో పరమ్పరాగత్ కృషి వియాస్ యోజనను ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికోసం 2015-16లో రూ.582.47 కోట్లు విడుదల చేశారు. 2018-19లో ఆ మొత్తం 2014.32 కోట్లు. 2015లో ఈశాన్య రాష్ట్రాల కోసం అలాంటి పథకాన్నే తీసుకొచ్చారు. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లోని 20 కేంద్రాల్లో ‘నెట్వర్క్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్’ అమల్లో ఉంది.
వర్గం: వ్యవసాయం స్థితి: ఎలాంటి పురోగతీ లేదు
రొటేషనల్ సాగును ప్రవేశపెట్టేందుకు ఏ పథకాన్నీ తీసుకురాలేదు